
విజయలక్ష్మి (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన అంబర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై మల్లేష్ తెలిపిన మేరకు.. శ్రీనివాసులు, టి.విజయలక్ష్మి(35)లు గోల్నాక తిరుమలనగర్‌లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. శ్రీనివాస్ ద్విచక్ర వాహనంపై తిరుగుతూ చీరలు విక్రయిస్తుంటాడు. ఇంట్లో కూడా టైలర్ పని చేస్తుంటాడు.
చదవండి: (భార్యను భరించలేను.. విడాకులు కావాల్సిందే: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్)
ఇందులో భాగంగా శనివారం భార్య కోసం జాకెట్‌ను కుట్టాడు. తది నచ్చలేదని భార్య చెప్పింది. దీంతో శ్రీనివాస్ బ్లౌజ్ కుట్లు విప్పి నువ్వే నచ్చినట్టు కుట్టుకో అని చెప్పాడు. దీంతో మనస్థాపానికి చెందిన విజయలక్ష్మి బెడ్‌రూంలోకి వెళ్లి తలుపు వేసుకుంది. యధావిధిగా శ్రీనివాసులు తన పనిలో నిమగ్నమయ్యాడు. పాఠశాలకు వెళ్లిన పిల్లలు మధ్యాహ్నం వచ్చి తలుపు తట్టగా తల్లి స్పందించలేదు. బలవంతంగా తలుపులు తీసి చూడగా విజయలక్ష్మి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment