
అల్వాల్(హైదరాబాద్): భర్త వేధింపులకు భరించలేక భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పాత నేరేడ్‌మెట్‌కు చెందిన స్రవంతి 10 సంవత్సరాల క్రితం సురేష్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఏడాది తర్వాత వీరు వినాయక్‌నగర్‌లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. మద్యం అలవాటు ఉన్న సురేష్ భార్యను వేధిస్తుండడంతో తరుచూ గొడవలు జరుగుతుండగా అప్పుడప్పుడు పెద్దలు సర్ది చెప్పేవారు. ఈ క్రమంలో ఈ నెల 11న స్రవంతి అర్ధరాత్రి నిద్ర లేచి ఇంట్లో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
మరో ఘటన..
వ్యక్తి హత్య
మేడిపల్లి: ప్లాట్ రిజిస్ట్రేషన్ విషయంలో జరిగిన గొడవలో ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. షేక్‌పేటకు చెందిన రమేష్‌రెడ్డి (55)కి మేడిపల్లి ప్రశాంత్‌నగర్ కాలనీలో ప్లాట్లు ఉన్నాయి. శుక్రవారం ప్రశాంత్‌నగర్ కాలనీలో తన ఏజెంట్లకు ప్లాట్లు చూపిస్తుండగా కొత్తపేటకు చెందిన వెంకటేష్ (35) తనకు అగ్రిమెంట్ చేసిన ప్లాట్‌ని రిజిస్ట్రేషన్ చేయమని అడిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో రమేష్‌రెడ్డి తలపై వెంకటేష్ రాళ్లతో కొట్టి పారిపోయాడు. క్షతగాత్రుడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు.
చదవండి: ఇంటి యజమాని కొడుకుతో వివాహేతర సంబంధం.. భర్తకు తెలిసి
Comments
Please login to add a commentAdd a comment