
సాక్షి, హైదరాబాద్: ఓ జిమ్ ట్రైనర్ ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డీఐ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. పటేల్‌నగర్‌కు చెందిన వెంకటేష్‌గౌడ్ కుమారుడు రాకేష్‌గౌడ్(27) విద్యానగర్‌లో జిమ్‌ట్రైనర్. కాగా గతంలో ఓ అమ్మాయిని ప్రేమించి వివాహాం చేసుకున్నాడు. ఇద్దరి మద్య విభేదాలు తలెత్తడంతో భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తీవ్ర మానసిక వేదనకు గురై ఈ నెల 12న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు.
దీంతో తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు మొదటగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. శుక్రవారం తిరిగొచ్చిన రాకేష్ ఇంట్లో ఎవరు లేని సమయంలో తాళం పగులగొట్టి ఇంట్లోనే ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment