jocket
-
ఆర్యన్ ఖాన్ కొత్త బ్రాండ్ జాకెట్ ధర వింటే షాకవ్వుతారు!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బ్రాండెడ్ దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అతడి కొత్త బ్రాండ్ డ్యావోల్ఎక్స్(DyavolX) ప్రమోషన్లలో షారుక్, అతని కూతురు సుహానా ఖాన్ బిజీగా ఉన్నారు. ఆదివారం (మార్చి 17) ఈ కొత్త బ్రాండ్ మార్కెట్లోకి రాగా..వీటి ధరలు చూసి కంగుతింటున్నారు అభిమానులు. షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్యావోల్ఎక్స్ (DyavolX) పేరుతో కొత్త బట్టల బ్రాండ్ తీసుకొచ్చాడు. దీనికి సంబంధించిన పోస్టర్ ను షారుక్ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. ఇందులో ఆర్యన్ ఖాన్ తోపాటు షారుక్, సుహానా ఈ కొత్త బ్రాండ్ డ్రెస్సుల్లో సందడి చేశారు. వీటిలో ట్రిపుల్ థ్రెట్ ఎక్స్ 2 పేరుతో హుడీస్, టీషర్ట్స్, క్రాప్ టాప్స్, డెనిమ్ జాకెట్స్ అందుబాటులో ఉంటాయి. వాటి ధరలు వచ్చేసి ఏకంగా రూ.16 వేల నుంచి రూ.99 వేల వరకూ ఉన్నాయి. ఈ బ్రాండ్ ఎక్స్ 2 అందుబాటులోకి వచ్చిందంటూ వెబ్సైట్ http://dyavolx.comలో బుక్ చేసుకోండి. ఇవి పరిమిత స్థాయిలోనే ఉంటాయి, గ్లోబల్ షిప్పింగ్ కూడా ఉంది" అనే క్యాప్షన్ తో షారుక్ ఈ పోస్ట్ చేశాడు. అయితే వీటి ధరలు చూసి సగటు అభిమానులు షాక్ తింటున్నారు. ఇక ఈ లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్లో ఓ డెనిమ్ జాకెట్ ధర రూ.99 వేలు కావడం విశేషం. ఇక ఇందులోని హుడీస్ రూ.41 వేలు, రూ.40 వేలుగా ఉన్నాయి. గాళ్స్ కోసం క్రాప్ టాప్స్ రూ.16 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ పోస్టర్ లో షారుక్ ఖాన్, ఆర్యన్ ఖాన్ వేసుకున్న టీషర్ట్స్ ధర రూ.21,500 కావడం విశేషం. ఇక కార్గో ప్యాంట్ల ధర రూ.35 వేలుగా ఉంది. ఇవన్నీ ఎక్కువ ధరలే అయినా.. గతంలో 2023లో ఆర్యన్ ఖాన్ తీసుకొచ్చిన కలెక్షన్ల ధరలైతే ఏకంగా రూ.2 లక్షల వరకూ ఉన్నాయి. వాటితో పోలిస్తే ఇవి కాస్త బెటర్ అని చెప్పొచ్చు. అప్పట్లో షారుక్ సంతకంతో ఉన్న హుడీస్ ధరను రూ.2 లక్షలుగా నిర్ణయించగా.. కొన్ని గంటల్లోనే అన్నీ అమ్ముడైపోయాయి. ఇక తన కొడుకు బ్రాండ్‌కు షారుక్ ఇస్తున్న ప్రమోషన్ కూడా బాగా కలిసి వస్తోంది. అందులో షారుక్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి దశాబ్దాలకు పైనే అయినా ఇప్పటికీ అతని క్రేజ్ తగ్గలేదు. గతేడాది అతడు పఠాన్, జవాన్ లతో ఒకే ఏడాది రూ.1000 కోట్ల కలెక్షన్లు సినిమాలు అందించాడంటే అతనికి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. View this post on Instagram A post shared by Shah Rukh Khan (@iamsrk) (చదవండి: రాధిక మర్చంట్ డ్రెస్ ధర వింటే...) -
కోటు వేసుకోవడానికి నానా పాట్లు పడ్డ బైడెన్: వీడియో వైరల్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లాడు. అక్కడ బాధితులకు ధైర్యం చెప్పడమే కాక పలు వాగ్దానాలు కూడా చేశాడు. ఈ ప్రకృతి వైపరిత్యం కుటుంబాలను ఎలా చిద్రం చేస్తోందో తనకు తెలుసునని అన్నారు. ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిన బాధ్యత తన పై ఉందని అన్నారు. మీరు ఫెడరల్ ప్రభుత్వ పాలనలో ఉన్నారు. మీరంతా మీరు ఉన్న చోటు ...రాష్ట్రం, కౌంటీ లేదా నగరాలకు చేరుకునేవారకు తాము తోడుగా ఉంటామని చెప్పాడు. ఆయన కరోనా వచ్చి రెండు వారాలు హోం క్యారంటైన్లో గడిపిన అనంతరం చేసిన అధికారిక పర్యటన ఇది. ఈ మేరకు ఆ పర్యటన అనంతరం వెనుతిరిగి వస్తున్న సందర్భంలో కెంటుకీ విమానాశ్రయంలో ఒక అనుహ్య ఘటన చోటు చేసుకుంది. బైడెన్ హెలికాప్టర్ దిగి వస్తూ సూట్ వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎంతసేపటికి వేసుకోలేకపోతాడు. దీంతో సహాయం కోసం తన భార్య బిల్ బైడెన్ వైపు తిరిగితాడు. చివరి ఆమె సాయంతో వేసుకుంటాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా లుక్కేయండి. What's going on here? pic.twitter.com/ICzLGFH0bn — RNC Research (@RNCResearch) August 8, 2022 (చదవండి: చెట్టు గాలి పీల్చుకోవడం చూశారా? వీడియో వైరల్) -
భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన అంబర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై మల్లేష్ తెలిపిన మేరకు.. శ్రీనివాసులు, టి.విజయలక్ష్మి(35)లు గోల్నాక తిరుమలనగర్‌లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. శ్రీనివాస్ ద్విచక్ర వాహనంపై తిరుగుతూ చీరలు విక్రయిస్తుంటాడు. ఇంట్లో కూడా టైలర్ పని చేస్తుంటాడు. చదవండి: (భార్యను భరించలేను.. విడాకులు కావాల్సిందే: సాఫ్ట్వేర్ ఇంజనీర్) ఇందులో భాగంగా శనివారం భార్య కోసం జాకెట్‌ను కుట్టాడు. తది నచ్చలేదని భార్య చెప్పింది. దీంతో శ్రీనివాస్ బ్లౌజ్ కుట్లు విప్పి నువ్వే నచ్చినట్టు కుట్టుకో అని చెప్పాడు. దీంతో మనస్థాపానికి చెందిన విజయలక్ష్మి బెడ్రూంలోకి వెళ్లి తలుపు వేసుకుంది. యధావిధిగా శ్రీనివాసులు తన పనిలో నిమగ్నమయ్యాడు. పాఠశాలకు వెళ్లిన పిల్లలు మధ్యాహ్నం వచ్చి తలుపు తట్టగా తల్లి స్పందించలేదు. బలవంతంగా తలుపులు తీసి చూడగా విజయలక్ష్మి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆక్షన్ హీరో
స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్.. వీళ్లంతా సూపర్ హీరోలు. కానీ హాలీవుడ్ సూపర్ హీరోలు. మన ఇండియన్ సూపర్ హీరో అంటే మనకు గుర్తొచ్చేది ‘క్రిష్’. హృతిక్ రోషన్ బ్లాక్ జాకెట్, బ్లాక్ మాస్క్ వేసుకొని చేసిన సాహసాలు, యాక్షన్ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఎంజాయ్ చేశారు. సూపర్ హీరో ‘క్రిష్’ సూపర్ సక్సెస్ అయ్యాడు. ‘క్రిష్’ సిరీస్‌లో మూడు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. నాలుగో సినిమా కూడా త్వరలో రానుంది. ఇప్పుడీ యాక్షన్ హీరోను.. ఆక్షన్ హీరో చేశారు. ‘క్రిష్’ సినిమాలో హృతిక్ ధరించిన బ్లాక్ జాకెట్‌ను ఇప్పుడు ఆక్షన్ (వేలానికి) పెట్టారు. అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ‘సాల్ట్ స్కౌట్’ అనే సంస్థ ద్వారా సెలబ్రిటీలు సినిమాల్లో వేసుకున్న కాస్ట్యూమ్స్‌ను వేలం వేసి వచ్చిన డబ్బును చారిటీకి ఉపయోగించనున్నారు. అందులో భాగంగా ‘క్రిష్’ సినిమాలో హృతిక్ ధరించిన బ్లాక్ కోట్‌ను వేలంలో ఉంచారు. -
బ్లేజర్లో 10 కేజీల బంగారం
కోచి: రహస్యంగా తరలిస్తే పట్టుబడతామని అనుకున్నారో ఏమోగానీ బాహాటంగా బంగారం తరలించే ప్రయత్నంచేసి బుక్కైపోయాడు ఓ స్మగ్లర్. మంగళవారం మద్యాహ్నం దుబాయ్ నుంచి కోచికి వచ్చిన ఎమిరేట్స్ విమానంలో తాను ధరించిన బ్లేజర్ లో 10 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తోన్న ఐరిష్ జాతీయుడ్ని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆండ్రూ అనే ఐర్లాండ్ జాతీయుడు ఒక్కోటి కేజీ బరువున్న పది బంగారపు బిస్కెట్లను జాకెట్లో రహస్యంగా తరలిస్తుండగా అడ్డుకుని అరెస్టుచేశామని కస్టమ్స్ అధికారులు చెప్పారు. అయితే ఆండ్రూ కేవల పాత్రధారేనని, స్మగ్లింగ్ గ్రూప్ లో సూత్రధారులు ఎవరనేతి దర్యాప్తులో తేలుతుందని పేర్కొన్నారు.