ఆర్యన్‌ ఖాన్‌ కొత్త బ్రాండ్‌ జాకెట్‌ ధర వింటే షాకవ్వుతారు! | Aryan Khans Dyavol X Collection Jacket Priced At Rs 99000 | Sakshi
Sakshi News home page

ఆర్యన్‌ ఖాన్‌ కొత్త బ్రాండ్‌ జాకెట్‌ ధర వింటే షాకవ్వుతారు!

Published Mon, Mar 18 2024 5:57 PM | Last Updated on Mon, Mar 18 2024 6:54 PM

Aryan Khans Dyavol X Collection Jacket Priced At Rs 99000  - Sakshi

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ బ్రాండెడ్‌ దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అతడి కొత్త బ్రాండ్‌ డ్యావోల్ఎక్స్(DyavolX) ప్రమోషన్లలో షారుక్, అతని కూతురు సుహానా ఖాన్ బిజీగా ఉన్నారు. ఆదివారం (మార్చి 17) ఈ కొత్త బ్రాండ్ మార్కెట్లోకి రాగా..వీటి ధరలు చూసి కంగుతింటున్నారు అభిమానులు.

షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్యావోల్ఎక్స్ (DyavolX) పేరుతో కొత్త బట్టల బ్రాండ్ తీసుకొచ్చాడు. దీనికి సంబంధించిన పోస్టర్ ను షారుక్ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. ఇందులో ఆర్యన్ ఖాన్ తోపాటు షారుక్, సుహానా ఈ కొత్త బ్రాండ్ డ్రెస్సుల్లో సందడి చేశారు. వీటిలో ట్రిపుల్ థ్రెట్ ఎక్స్ 2 పేరుతో హుడీస్, టీషర్ట్స్, క్రాప్ టాప్స్, డెనిమ్ జాకెట్స్ అందుబాటులో ఉంటాయి. వాటి ధరలు వచ్చేసి ఏకంగా రూ.16 వేల నుంచి రూ.99 వేల వరకూ ఉన్నాయి.

ఈ బ్రాండ్‌ ఎక్స్‌ 2 అందుబాటులోకి వచ్చిందంటూ వెబ్‌సైట్‌ http://dyavolx.comలో బుక్ చేసుకోండి. ఇవి పరిమిత స్థాయిలోనే ఉంటాయి, గ్లోబల్ షిప్పింగ్ కూడా ఉంది" అనే క్యాప్షన్ తో షారుక్ ఈ పోస్ట్ చేశాడు. అయితే వీటి ధరలు చూసి సగటు అభిమానులు షాక్ తింటున్నారు. ఇక ఈ లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్లో ఓ డెనిమ్ జాకెట్ ధర రూ.99 వేలు కావడం విశేషం. ఇక ఇందులోని హుడీస్ రూ.41 వేలు, రూ.40 వేలుగా ఉన్నాయి. గాళ్స్ కోసం క్రాప్ టాప్స్ రూ.16 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ పోస్టర్ లో షారుక్ ఖాన్, ఆర్యన్ ఖాన్ వేసుకున్న టీషర్ట్స్ ధర రూ.21,500 కావడం విశేషం. ఇక కార్గో ప్యాంట్ల ధర రూ.35 వేలుగా ఉంది.

ఇవన్నీ ఎక్కువ ధరలే అయినా.. గతంలో 2023లో ఆర్యన్ ఖాన్ తీసుకొచ్చిన కలెక్షన్ల ధరలైతే ఏకంగా రూ.2 లక్షల వరకూ ఉన్నాయి. వాటితో పోలిస్తే ఇవి కాస్త బెటర్‌ అని చెప్పొచ్చు. అప్పట్లో షారుక్ సంతకంతో ఉన్న హుడీస్ ధరను రూ.2 లక్షలుగా నిర్ణయించగా.. కొన్ని గంటల్లోనే అన్నీ అమ్ముడైపోయాయి. ఇక తన కొడుకు బ్రాండ్‌కు షారుక్‌ ఇస్తున్న ప్రమోషన్‌ కూడా బాగా కలిసి వస్తోంది. అందులో షారుక్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి దశాబ్దాలకు పైనే అయినా ఇప్పటికీ అతని క్రేజ్‌ తగ్గలేదు. గతేడాది అతడు పఠాన్, జవాన్ లతో ఒకే ఏడాది రూ.1000 కోట్ల కలెక్షన్లు సినిమాలు అందించాడంటే అతనికి క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

(చదవండి: రాధిక మర్చంట్‌ డ్రెస్‌ ధర వింటే...)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement