బ్లేజర్లో 10 కేజీల బంగారం | Irish national arrested for trying to smuggle 10 kg gold | Sakshi
Sakshi News home page

బ్లేజర్లో 10 కేజీల బంగారం

Published Tue, Jul 14 2015 4:27 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

బ్లేజర్లో 10 కేజీల బంగారం - Sakshi

బ్లేజర్లో 10 కేజీల బంగారం

కోచి: రహస్యంగా తరలిస్తే పట్టుబడతామని అనుకున్నారో ఏమోగానీ బాహాటంగా బంగారం తరలించే ప్రయత్నంచేసి బుక్కైపోయాడు ఓ స్మగ్లర్. మంగళవారం మద్యాహ్నం దుబాయ్ నుంచి కోచికి వచ్చిన ఎమిరేట్స్ విమానంలో తాను ధరించిన బ్లేజర్ లో 10 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తోన్న ఐరిష్ జాతీయుడ్ని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఆండ్రూ అనే ఐర్లాండ్ జాతీయుడు ఒక్కోటి కేజీ బరువున్న పది బంగారపు బిస్కెట్లను జాకెట్లో రహస్యంగా తరలిస్తుండగా అడ్డుకుని అరెస్టుచేశామని కస్టమ్స్ అధికారులు చెప్పారు. అయితే ఆండ్రూ కేవల పాత్రధారేనని, స్మగ్లింగ్ గ్రూప్ లో సూత్రధారులు ఎవరనేతి దర్యాప్తులో తేలుతుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement