అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లాడు. అక్కడ బాధితులకు ధైర్యం చెప్పడమే కాక పలు వాగ్దానాలు కూడా చేశాడు. ఈ ప్రకృతి వైపరిత్యం కుటుంబాలను ఎలా చిద్రం చేస్తోందో తనకు తెలుసునని అన్నారు. ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిన బాధ్యత తన పై ఉందని అన్నారు. మీరు ఫెడరల్ ప్రభుత్వ పాలనలో ఉన్నారు. మీరంతా మీరు ఉన్న చోటు ...రాష్ట్రం, కౌంటీ లేదా నగరాలకు చేరుకునేవారకు తాము తోడుగా ఉంటామని చెప్పాడు. ఆయన కరోనా వచ్చి రెండు వారాలు హోం క్యారంటైన్‌లో గడిపిన అనంతరం చేసిన అధికారిక పర్యటన ఇది.
ఈ మేరకు ఆ పర్యటన అనంతరం వెనుతిరిగి వస్తున్న సందర్భంలో కెంటుకీ విమానాశ్రయంలో ఒక అనుహ్య ఘటన చోటు చేసుకుంది. బైడెన్ హెలికాప్టర్ దిగి వస్తూ సూట్ వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎంతసేపటికి వేసుకోలేకపోతాడు. దీంతో సహాయం కోసం తన భార్య బిల్ బైడెన్ వైపు తిరిగితాడు. చివరి ఆమె సాయంతో వేసుకుంటాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా లుక్కేయండి.
What's going on here? pic.twitter.com/ICzLGFH0bn
— RNC Research (@RNCResearch) August 8, 2022
Comments
Please login to add a commentAdd a comment