devastation
-
ఒడిశాలో భారీ వర్షాలు.. 18 గ్రామాలకు సంబంధాలు కట్
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశాలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే కొండచరియలు విరిగిపడటంతో మల్కన్‌గిరి జిల్లాలోని 18 గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఈ వివరాలను అధికారులు మీడియాకు తెలియజేశారు.మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ బ్లాక్ పరిధిలోని బయపదర్ ఘాట్ రోడ్డులోని తుంబపదర్ గ్రామ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మల్కన్‌గిరి, కోరాపుట్‌లోని లమటాపుట్, నందాపూర్ ప్రాంతా నుంచి వాహనాల రాకపోకలపై ప్రభావం పడింది. ఉత్తర ఒడిశాలోని గంగా మైదానాల్లో అల్పపీడనం ప్రభావంతో జూలై 31 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బులెటిన్‌లో పేర్కొంది. ఆదివారం(నేడు) మల్కన్‌గిరి, కోరాపుట్, నబరంగ్‌పూర్, బోలంగీర్, నువాపాడా, సోన్పూర్, ఝర్సుగూడ, సుందర్ఘర్, సంబల్పూర్, కియోంజర్, అంగుల్, డియోగర్, కలహండి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ కార్యాలయం తెలిపింది.ఆదివారం బంగాళాఖాతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. బార్గఢ్, జార్సుగూడ, సుందర్ఘర్, నుపాడా, నబరంగ్‌పూర్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. -
పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
రియోడిజెనెరియో: బ్రెజిల్లో భారీ వర్షాలు ఆగకుండా కురుస్తున్నాయి. ఈ వర్షాలతో బ్రెజిల్ అతలాకుతలం అవుతోంది. దక్షిణ బ్రెజిల్లో నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో రియో గ్రాండేలో వరదలు పోటెత్తాయి. బ్రెజిల్ గత 80 ఏళ్లలో ఎప్పుడూ చూడని వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ వరదల ధాటికి ఇప్పటివరకు 100 మందిపైగా చనిపోట్లు అధికారికంగా ప్రకటించారు.వరదల్లో వందల మంది గల్లంతయ్యారు. లక్షల మంది చెల్లాచెదురయ్యారు. తాగునీరు, కరెంటు లేకుండా పోయాయి. టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ఇంటర్నెట్ సర్వీసులు పనిచేయడం లేదు. వీధులు నదుల్లా మారిపోయాయి. రెస్క్యూ సిబ్బంది బోట్లలో వెళ్లి ఇళ్లలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారు ఇళ్లు విడిచి రావడానికి ఇష్టపడటం లేదు.A devastating flood has hit Rio Grande do Sul in Brazil impacting more than 1 million people, of which 41,000 had already been forced to flee.UNHCR is working with local authorities and civil society to respond to this climate emergency. https://t.co/Ewm4e1IprO pic.twitter.com/IypsMLTV7s— UNHCR, the UN Refugee Agency (@Refugees) May 9, 2024తమ ఇళ్లలో దోపిడీ జరుగుతుందేమో అన్న భయంతో వారు పునరావాస కేంద్రాలకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా గ్యూబా నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. మొత్తం ఐదు డ్యామ్‌లలో నీటి నిల్వలు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి.ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. స్పందించిన బిలీయనీర్ ఎలాన్ మస్క్...బ్రెజిల్ రియో గ్రాండేలో పోటెత్తిన భీకర వరదలపై టెస్లా అధినేత, పాపులర్ బిలియనీర్ ఎలాన్‌మస్క్ స్పందించారు. స్టార్‌లింక్‌కు చెందిన 1000 టర్మినల్స్‌ను విరాళమిస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల్లో సమాచార వ్యవస్థ కోసం ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. బ్రెజిల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. Horse stranded on rooftop amidst the floodwater in the city of Canoas, Brazil. The city’s mayor said they were hoping to rescue the horse with a helicopter.pic.twitter.com/4CDfpA2Lst— Mahatma Gandhi (Parody) (@GandhiAOC) May 9, 2024ఇంటి మీదకు ఎక్కిన గుర్రం.. వీడియో వైరల్ రియో గ్రాండేలోని పోర్టో అలెగ్రెలోని కానోస్ పట్టణంలో పోటెత్తిన వరదల నుంచి తప్పించుకోవడానికి ఒక గుర్రం ఏకంగా ఇంటిపైకి ఎక్కి నిల్చుంది. ఈ గుర్రాన్ని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. కారామెలో అని నిక్‌నేమ్‌తో నెటిజన్స్ పిలుచుకుంటున్న గుర్రాన్ని ఫైర్ ఫైటర్స్ కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం కారామెలో వెటర్నరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటోంది. Man searching for survivors during the devastating floods in Brazil smashes through the roof of a fully inundated house to rescue a dog after he hears barking and whimpering. 🇧🇷🙏pic.twitter.com/51Kv6gylSM— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) May 9, 2024 -
జలప్రళయం.. హిమాచల్ కకావికలం
సిమ్లా: ఎడతెరిపిలేని వర్షాలు హిమాచల్ ప్రదేశ్‌ని అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాష్ట్రమంతటా రోడ్లు కొట్టుకుపోయిన కారణంగా రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. విద్యుత్ వ్యవస్థ నిలిచిపోయింది. వరద నీటితో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గత నాలుగు రోజుల్లో వర్షాల ధాటికి 80 మంది మృతి చెందారు. రూ.4000 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 1300 రోడ్లు బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఛండీగఢ్-మనాలీ, సిమ్లా-కాల్కా జాతీయ రహదారులను మూసివేసినట్లు వెల్లడించారు. మనాలీలో చిక్కిన 1000 మంది పర్యటకుల వాహనాలను తరలించడానికి అర్ధరాత్రి పూట వన్‌వే ట్రాఫిక్‌ను తెరిచినట్లు తెలిపారు. పలు ప్రాంతాల్లో పర్యటకులు చిక్కుకుపోయినట్లు పేర్కొన్నారు. More Scary visuals from Thunag area of Mandi, Himachal#Thunag #Mandi #HimachalPradesh #Manali #Kullu pic.twitter.com/qtyyo3OHcD — Anil Thakur (@Ani_iTV) July 9, 2023 ఇప్పటివరకు రాష్ట్రంలో 40 వంతెనలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. జులై 5 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 20,000లకు పైనే ప్రజలను పునరావాస ప్రదేశాలకు తరలించినట్లు వెల్లడించారు. కొండ చరియలు విరిగిపడి, వరదలతో భారీ నష్టం జరిగిన కులూ ప్రాంతాల్లో రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుకూ పర్యటించారు. పరిస్థితిని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకువచ్చామని తెలిపారు. నష్టాన్ని పూరించడానికి చేయాల్సిన పని చాలా ఉందని అన్నారు. This is Temple in Sirmaur Himachal Pradesh under flood pic.twitter.com/PI3IIibmzp — Go Himachal (@GoHimachal_) July 11, 2023 గత నాలుగు రోజులుగా ఉత్తర భారతం భారీ వర్షాలతో వణికిపోతోంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. వర్షాల ధాటికి వరద నీటితో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు సంభవిస్తుండగా.. హిమాచల్ ప్రదేశ్‌లో భారీ నష్టం వాటిల్లింది. 80 Killed, ₹ 3,000 Crore Damage: Himachal Rain Devastation In Numbers https://t.co/7xnflWjHa5 pic.twitter.com/FFgvfMddRA — NDTV (@ndtv) July 12, 2023 కాగా.. రానున్న 24 గంటల్లో భారీ స్థాయిలో వర్షాలు రానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో 23 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాల్లో ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో రెడ్ అలర్ట్ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఇదీ చదవండి: Yamuna Rivar: డేంజర్ మార్క్ దాటి మహోగ్రంగా ప్రవహిస్తున్న యమునా.. ఢిల్లీ హై అలర్ట్.. -
కుప్పకూలిపోయాను..డియర్.. RIP: కిరణ్ మజుందార్ షా భావోద్వేగం
బెంగళూరు: బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా తన జీవితంలో చోటు చేసుకున్న విషాదంపై భావోద్వానికి లోనయ్యారు. దీపావళి పర్వదినం రోజు తనను శాశ్వతంగా విడిచివెళ్లిన భర్త జాన్ షా ను గుర్తు చేసుకుంటూ ట్విటర్ పోస్ట్ ద్వారా కన్నీటి నివాళి అర్పించారు. ‘‘కుంగిపోయాను.. నా భర్త, సోల్ మేట్, గురువును కోల్పోయాను. నా లక్క్ష్య సాధనలో జాన్ ఎప్పుడూ చాలా అండగా నిలిచారు. ఎంతో మార్గనిర్దేశనం చేశారు. నా జీవితాన్ని ఇంత స్పెషల్‌గా ఉంచి నందుకు ధన్యవాదాలు. రెస్ట్ ఇన్ పీస్ మై డియర్ జాన్...మీరు లేని లోటు పూడ్చలేనిది’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. కేన్సర్‌తో బాధపడుతున్న జాన్ షా (73)బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. దీంతో పలువురు వ్యాపార, రాజకీయ పెద్దలు ఆమెకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కాన్సర్‌తో బాధపడుతూ కిరణ్ మజుందార్ షా తల్లి యామిని మజుందార్ షా ఈ ఏడాది జూన్‌లో కన్నుమూశారు. ఇపుడు భర్తను కోల్పోవడంతో కిరణ్ విషాదంలో మునిగిపోయారు. కాగా స్కాటిష్ జాతీయుడైన జాన్షా 1998లో కిరణ్ మజుందార్ షాను వివాహం చేసుకున్నారు. తరువాత వివిధ బయోకాన్ గ్రూప్ కంపెనీల సలహా బోర్డు సభ్యుడు సేవలందించారు. 1978లో కిరణ్ మజుందార్ షా బయోకాన్ కంపెనీని స్థాపించగా 1999 నుంచి జాన్ షా బయోకాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒకరిగా వివిధ హోదాల్లో పనిచేశారు. విదేశీ ప్రమోటర్‌గా వ్యవహరిస్తూనే బయోకాన్ గ్రూప్ కంపెనీలకు అడ్వైజరీ బోర్డ్ మెంబర్‌గానూ సేవలు అందించారు. 1999లో బయోకాన్‌లో చేరడానికి ముందు వస్త్ర తయారీదారు మధుర కోట్స్‌కు నాయకత్వం వహించారు జాన్ షా. జూలై 2021లో పదవీ విరమణకు ముందు బయోకాన్ వైస్ ఛైర్మన్ ,నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా 22 సంవత్సరాలు కంపెనీకి విశిష్ట సేవలు అందించారు. I am devastated to lose my husband, my mentor and soul mate. I will always be spiritually guided by John as I pursue my purpose. Rest in Peace my darling John. Thank you for making my life so very special. I will miss you profoundly pic.twitter.com/b0qv6ZGI2D — Kiran Mazumdar-Shaw (@kiranshaw) October 25, 2022 -
కోటు వేసుకోవడానికి నానా పాట్లు పడ్డ బైడెన్: వీడియో వైరల్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లాడు. అక్కడ బాధితులకు ధైర్యం చెప్పడమే కాక పలు వాగ్దానాలు కూడా చేశాడు. ఈ ప్రకృతి వైపరిత్యం కుటుంబాలను ఎలా చిద్రం చేస్తోందో తనకు తెలుసునని అన్నారు. ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిన బాధ్యత తన పై ఉందని అన్నారు. మీరు ఫెడరల్ ప్రభుత్వ పాలనలో ఉన్నారు. మీరంతా మీరు ఉన్న చోటు ...రాష్ట్రం, కౌంటీ లేదా నగరాలకు చేరుకునేవారకు తాము తోడుగా ఉంటామని చెప్పాడు. ఆయన కరోనా వచ్చి రెండు వారాలు హోం క్యారంటైన్లో గడిపిన అనంతరం చేసిన అధికారిక పర్యటన ఇది. ఈ మేరకు ఆ పర్యటన అనంతరం వెనుతిరిగి వస్తున్న సందర్భంలో కెంటుకీ విమానాశ్రయంలో ఒక అనుహ్య ఘటన చోటు చేసుకుంది. బైడెన్ హెలికాప్టర్ దిగి వస్తూ సూట్ వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎంతసేపటికి వేసుకోలేకపోతాడు. దీంతో సహాయం కోసం తన భార్య బిల్ బైడెన్ వైపు తిరిగితాడు. చివరి ఆమె సాయంతో వేసుకుంటాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా లుక్కేయండి. What's going on here? pic.twitter.com/ICzLGFH0bn — RNC Research (@RNCResearch) August 8, 2022 (చదవండి: చెట్టు గాలి పీల్చుకోవడం చూశారా? వీడియో వైరల్) -
చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం
-
ఒడిశాలో సుడిగాలి బీభత్సం
-
చైనాలో వరద బీభత్సం..
-
చినుకు పడితే గుండె దడ దడ
వర్షాలు, గాలులకు తోడు భయపెడుతున్న పురాతన భవనాలు నగరంలో అధికారులు గుర్తించినా కూల్చనివి 274 నిర్లక్ష్యం వీడకపోతే ప్రాణనష్టం తప్పదంటున్న నిపుణులు సిటీబ్యూరో: క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో నగరంలో బుధవారం మళ్లీ గాలివాన బీభత్సం సృష్టించింది. ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 100 కి.మీ ప్రచండ వేగంతో ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల భారీ వృక్షాలు విరిగిపడడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. విద్యుత్ తీగలు తెగిపడడంతో పలు శివారు ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. ఎస్.ఆర్.నగర్ బీకేగూడాలో ఓ భారీ వృక్షం కూలి ఆటో ధ్వంసమైంది. సనత్‌నగర్ బస్టాప్ వద్ద ఓ దుకాణంపై భారీ వృక్షం కూలింది. అశోక్‌నగర్ కాలనీలో ఓ భవనంపై ఉన్న రేకులు ఎగిరి పక్కనే ఉన్న పెంకుటిల్లుపై పడడంతో ఆ ఇల్లు ధ్వంసమైంది. బేగంపేట్ రసూల్‌పురా భరణి కాంప్లెక్స్ వద్ద ఓ భారీ వృక్షం కూలి మూడు కార్లు ధ్వంసమయ్యాయి. సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులో ఓ భారీ వృక్షం కూలి రెండు కార్లు ధ్వంసమయ్యాయి. గాలివాన బీభత్సం నేపథ్యంలో బుధవారం సాయంత్రం జీహెచ్ఎంసీ మేయర్, వివిధ విభాగాల నోడల్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. జీహెచ్ఎంసీ అత్యవసర కాల్ సెంటర్‌కు అందిన ఫిర్యాదుల్లో.. విద్యుత్ సరఫరాలో అంతరాయంపై 26 ఫిర్యాదులు, చెట్లుకూలిన ఘటనపై 27 ఫిర్యాదులు అందినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. తక్షణం ఆయా సమస్యలను పరి ష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్ధన్‌రెడ్డి సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. కాగా సాయంత్రం 8.30 గంటల వరకు1.06 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. ట్రాఫిక్ జాంఝాటం.. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా గాలివాన రావడంతో అబిడ్స్, కోఠి, నాంపల్లి, లక్డికాపూల్, పంజగుట్ట, ఖైరతాబాద్, ఎస్.ఆర్.నగర్, అమీర్‌పేట్, సికింద్రాబాద్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో వర్షపునీరు రహదారులపై నిలిచి ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. వాహనదారులు, ఉద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు ట్రాఫిక్‌లో చిక్కుకొని విలవిల్లాడారు. ఆలస్యంగా ఇళ్లకు చేరుకున్నారు. కాగా మధ్యాహ్నం గరిష్టంగా 40.5 డిగ్రీలు, కనిష్టంగా 28.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ 89 శాతంగా నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రాగల 24 గంటల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఎమర్జెన్సీ కంట్రోల్‌రూమ్‌కు ఫిర్యాదులు బుధవారం సాయంత్రం కురిసిన వాన, ఈదురుగాలుల వల్ల 30 ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలిగినట్లు, 25 చెట్లు కూలిపోయినట్లు జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ కంట్రోల్‌రూమ్‌కు ఫిర్యాదులందాయి. దాంతో వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణశాఖ ద్వారా అందిని హెచ్చరికలతో ఎమర్జెన్సీ కంట్రోల్‌రూమ్‌కు చేరుకోవాల్సిందిగా ఆయా విభాగాల నోడల్ అధికారులకు సమాచారమిచ్చారు. కేవలం పదినిమిషాల్లోనే తక్షణ చర్యలు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించారని పేర్కొన్నారు. సీతాఫల్మండి, జూబ్లీహిల్స్, చిలుకలగూడ, లోయర్‌ట్యాంక్‌బండ్, ముషీరాబాద్ ఎమ్మార్వో కార్యాలయం, బంజారాహిల్స్ రోడ్డునెంబర్ 12 తదితర ప్రాంతాల్లో కూలిన చెట్లను వెంటనే తొలగించినట్లు పేర్కొన్నారు. ఓయూ క్యాంపస్‌లో కూలిన చెట్లు గాలివానతో బుధవారం ఓయూ క్యాంపస్ అతలాకుతలం అయింది. విపరీతమైన గాలికి పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగి కిందపడగా, కరెంట్ తీగలు తెగి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. టెక్నాలజీ విద్యార్థుల హాస్టల్ పైకప్పుపై చెట్టు విరిగిపడడంతో సిమెంట్ రేకులు విరిగిపోయాయి. దీంతో వర్షం నీరు హాస్టల్ గదుల్లోకి ప్రవేశించి విద్యార్థుల పుస్తకాలు, దుస్తులు, ఇతర వస్తులు తడిచిపోయాయి. -
ఎల్.ఎన్.పేటలో ఏనుగుల బీభత్సం
ఎల్.ఎన్.పేట: వ్యవసాయ బావి వద్ద ఉన్న వడ్ల రాశిపై ఏనుగులు దాడిచేసి సుమారు 20 బస్తాల ధాన్యం తిని.. మిగతా ధాన్యంతో పాటు వరికుప్పలను ధ్వంసం చేశాయి. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనర్సుపేట మండలం గొట్టిపల్లి గ్రామ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బుధవారం ఉదయం బావి వద్దకు వెళ్లిన రైతు ఇది గుర్తించి ఏనుగులను అక్కడి నుంచి తరమడానికి ప్రయత్నించగా.. అవి తిరగబడి అతన్ని తరిమిశాయి.. దీంతో అప్రమత్తమైన గ్రామస్థులు బాణాసంచా, డప్పుల చప్పుడు చేయడంతో.. ఏనుగుల మంద అటవీ ప్రాంతం వైపు పరుగులు తీసీంది. -
బడి చదువుల్లో దోపిడీ
బడి చదువులకెళ్లే పిల్లలున్న తల్లిదండ్రులకు ఏటా స్కూళ్లు తెరుస్తున్నారంటేనే గుబులు. ఫీజుల బాదుడు ఎంత ఉంటుందో, అందుకవసరమైన డబ్బు ఎక్కడ తీసుకురావాలో తోచక భయం. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ స్థితిలో కాస్తయినా మార్పు రాలేదని... తల్లిదండ్రులది అరణ్యరోదనే అవుతున్నదని హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ (హెచ్ఎస్పీఏ) వెల్లడించిన అంశాలు చెబుతున్నాయి. ఈ సమస్య ఒక్క హైదరాబాద్‌కి మాత్రమే పరిమితమైనది కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలన్నిటా ఈ పరిస్థితే నెలకొంది. నిరసనలు వ్యక్తమైనప్పుడల్లా అధిక ఫీజుల బెడదను కట్టడి చేస్తామని చెప్పడం, వారం పదిరోజులు గడిచేసరికి యధాప్రకారం మౌనముద్ర దాల్చడం అధికారంలో ఉన్నవారికి అలవాటైంది. అందువల్లే ప్రైవేటు పాఠశాలల దోపిడీ అంతకంతకు పెరుగుతున్నదే తప్ప నియంత్రణలోకి రావడంలేదు. ఒక ప్రైవేటు పాఠశాల గత ఏడేళ్లలో ఫీజుల్ని 225 శాతం పెంచిందని హెచ్ఎస్పీఏ బాధ్యుడొకరు చెప్పిన ఉదాహరణ మన ప్రభుత్వాల పనితీరును వెల్లడిస్తుంది. తమ సంతానానికి ‘మంచి చదువు’ చెప్పించాలని సహజంగానే ఏ తల్లిదండ్రులైనా తపన పడతారు. ఆ బలహీనతను ప్రైవేటు విద్యా సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. పర్యవసానంగా సంపాదనలో సగానికి పైగా పిల్లల చదువులకే హారతి కర్పూరమవుతున్నది. చదువుల సీజన్ మొదలయ్యే జూన్‌లోనే తల్లిదండ్రులపై ఫీజుల బండ పడుతుంది. మునుపటి కన్నా 20 శాతం పెంచామని, 30 శాతం పెంచామని ప్రకటించి ప్రైవేటు పాఠశాలలు దిక్కుతోచని స్థితి కల్పిస్తాయి. తమ పాఠశాలలో చదివిన విద్యార్థులు సాధించిన ర్యాంకుల్ని ఏకరువు పెట్టి వారిని అయోమయంలోకి నెట్టేస్తాయి. ఈ బడి మాన్పిస్తే తమ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో...గట్టిగా నిలదీస్తే పిల్లల చదువు ఎక్కడ కుంటుపడుతుందోనని బెంగటిల్లి తల్లిదండ్రులు అప్పో సప్పో చేస్తున్నారు. ఇద్దరు పిల్లలున్న కుటుంబం విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠశాలలకు చెల్లించుకునే మొత్తం దాదాపు రూ. 2 లక్షలవరకూ ఉంటుందని అంచనా. ఈ స్థాయిలో వసూళ్లు చేస్తున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. తామే తీసుకొచ్చిన జీవోలను యాజమాన్యాలు అపహాస్యం చేస్తున్నా, న్యాయస్థానాలు జోక్యం చేసుకుని బాధ్యతను గుర్తు చేసినా ప్రభుత్వాలకు పట్టడంలేదు. గత అయిదేళ్లుగా వన్‌టైమ్ ఫీజు పేరిట పాఠశాలలు నిలువుదోపిడీ చేస్తున్నా, కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నా అడిగే నాథుడు లేడని హెచ్ఎస్పీఏ చెబుతోంది. ఇంజనీరింగ్, మెడిసిన్ కళాశాలల్లో వసూలు చేసే ఫీజులకు ఎన్ని లోటుపాట్లతో అయినా ఓ విధానమంటూ ఉంది. ఆయా కళాశాలల గ్రేడ్ల ఆధారంగా విద్యార్థులనుంచి ఫీజులు వసూలు చేసే పద్ధతి పెట్టారు. పాఠశాలల విద్యకు సంబంధించినంత వరకూ అదేమీ లేదు. ఇష్టానుసారం ప్రైవేటు పాఠశాలలు ఫీజులు పెంచడాన్ని నిరోధించడం కోసం జిల్లా స్థాయిల్లో ఫీజు నియంత్రణ కమిటీలు ఏర్పరుస్తూ జీవో జారీ అయినా దానికి వ్యతిరేకంగా యాజమాన్యాలు స్టే తెచ్చుకున్నాయి. పర్యవసానంగా అది అమలు కావడంలేదు. ఫీజుల దోపిడీని అరికట్టేందుకు 2009లో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న చర్యల స్ఫూర్తితోనే ఇక్కడ కూడా జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటుచేశారు. అయితే తేడా ఏమంటే... తమిళనాట విజయవంతమైన ప్రయోగం ఇక్కడ విఫలమైంది. పాఠశాల ఉన్న ప్రాంతం, అందులో చదివే విద్యార్థుల సంఖ్య, ఆ పాఠశాల సమకూరుస్తున్న మౌలిక సదుపాయాలు, లైబ్రరీ, ప్రయోగశాల, పారిశుద్ధ్యం, మంచినీటి సదుపాయం, ఉత్తీర్ణత శాతం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తమిళనాడులో జిల్లా కమిటీలు ఫీజులు నిర్ణయిస్తాయి. ఇందుకు పాఠశాలల అభ్యంతరాలేమిటో తెలుసుకుంటారు. తుది నిర్ణయం కమిటీలదే. ఇలా నిర్ణయించిన ఫీజు మూడేళ్లు అమలవుతుంది. ఆ తర్వాత ఫీజుల్ని సవరించమని పాఠశాలలు కోరవచ్చు. 2013లో రాజస్థాన్ ప్రభుత్వం సైతం దీన్ని ఆదర్శంగా తీసుకుంది. తమిళనాడు ప్రభుత్వం విధించిన నిబంధనలకు తోడు టీచర్ల అర్హతలను కూడా పరిగణనలోకి తీసుకుంది. కర్ణాటక, మహారాష్ట్రలు సైతం ఇవే తరహా చట్టాలను ఈ ఏడాదినుంచి అమలు చేయడం ప్రారంభించాయి. కార్పొరేట్ విద్యా సంస్థలు టెక్నో, కాన్సెప్ట్, ఒలంపియాడ్ వంటి విశేషణాలు తగిలించి తల్లిదండ్రుల్ని సమ్మోహనపరుస్తున్నాయి. భవిష్యత్తులో పిల్లలు ఐఐటీలకు ఎంపిక కావాలంటే తమ పాఠశాలలే అందుకు తగినవని ఊదరగొడుతున్నాయి. ఈ క్రమంలో వసూలు చేసే ఫీజులు అవధులు దాటుతున్నా, జీవోల స్ఫూర్తిని దెబ్బతీస్తున్నా పట్టించుకునేవారుండటం లేదు. అధిక ఫీజులనుంచి తమను కాపాడాలని సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లకు సైతం ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయకపోవడంతో అవి ఏళ్ల తరబడి ఎటూ తేలకుండా ఉండిపోతున్నాయని హెచ్ఎస్పీఏ ముఖ్యుడొకరు చెబుతున్నారు. ఇదే నిజమైతే ప్రభుత్వాలు సిగ్గుపడాలి. చిన్నప్పుడు పాఠశాలలో లభించే విద్య భవిష్యత్తుకు పునాది అవుతుందంటారు. కానీ అంగడి సరుకుగా మారిన విద్య అలాంటి పునాదిని అందించగలదా? ఆమధ్య తమిళనాడులోని ఒక పాఠశాల... కమిటీ నిర్ణయించిన ఫీజుకు అదనంగా చెల్లిస్తే వైద్య సదుపాయం, క్రీడలు, కేంటీన్ వగైరా 59 సౌకర్యాలుంటాయని తల్లిదండ్రుల్ని ఊరించింది. కమిటీ నిర్ణయించే ఫీజులు చెల్లించే పిల్లలు లైబ్రరీ సదుపాయానికి, పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొనడానికి, విహారయాత్రలకూ అనర్హులవుతారని తెలిపింది. విద్యా వ్యాపారం ఎంత వెర్రితలలు వేస్తున్నదో ఈ ఉదంతమే నిరూపిస్తున్నది. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మేల్కొని విద్యా వ్యాపారానికి కళ్లెం వేయాలి. అంతకన్నా ముందు ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యను అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. రేపటి పౌరుల్ని తీర్చిదిద్దడంలో అలసత్వం పనికిరాదని గ్రహించాలి. -
గాలివాన బీభత్సం
నగరంలో కూలిన చెట్లు, హోర్డింగులు విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం నాలుగున్నర గంటల పాటు కరెంట్ బంద్ విజయవాడ : నగరంలో ఆదివారం ఆకస్మికంగా గాలివాన బీభత్సం సృష్టించింది. గంటన్నరసేపు వీచిన పెనుగాలులకు పెద్దపెద్ద చెట్లు నేలకొరిగాయి. షాపింగ్ మాల్స్, భవనాలపై ఉన్న హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి. వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమైన గాలివాన గంటసేపు సాగింది. చెట్లు పడడంతో విద్యుత్ తీగలు తెగిపోయి, ట్రాన్స్ఫార్మర్లు దగ్ధమయ్యాయి. కృష్ణలంక, స్క్రూబ్రిడ్జి, బస్టాండ్, గుణదల, మాచవరం, కొత్తవంతెన ఆంజనేయస్వామి గుడి, వేమూరివారి వీధితోపాటు వన్‌టౌన్‌లో మూడుచోట్ల చెట్లు విరిగి విద్యుత్ లైన్లపై పడ్డాయి. అధికారులు వెంటనే రంగ ప్రవేశం చేసి వన్‌టౌన్‌లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. బందర్‌రోడ్డు, గవర్నర్‌పేట, సూర్యారావుపేట, ఏలూరురోడ్డు, ఐదో నంబర్ రోడ్డు, పటమట, కృష్ణలంక, స్క్రూ బ్రిడ్జి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు నాలుగున్నర గంటల పాటు అంతరాయం కలిగింది. మరికొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు అంధకారం అలము కుంది. బస్టాండ్, వస్త్రలత ప్రాంతాల్లో హోర్డింగ్‌లు విరిగి షాపులపై పడ్డాయి. జలమయమైన రోడ్లు వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. వన్‌టౌన్, కొత్తపేట, వించిపేట, భవానీపురం ప్రాంతాల్లో రోడ్లపైన మురుగునీటిలో వర్షం నీరు కలిసి ప్రవహించింది. లోబ్రిడ్జి, ఐదో నంబర్ రోడ్డు, ఏలూరు రోడ్లపై కొద్దిసేపు నీరు ప్రవహించడంతో ప్రజలు, వాహనచోదకులు అగచాట్లు పడ్డారు. డ్రైన్లలో మురుగునీరు రోడ్లపైకి రావడంతో చెరువులను తలపించాయి. సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాం నగరంలో గాలివానకు చెట్లు కూలి 33 కేవీ లైన్లు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగినట్లు ఏపీఎస్పీడీసీఎల్ విజయవాడ సర్కిల్ ఎస్.ఇ. విజయ్‌కుమార్ సాక్షికి చెప్పారు. అధికారులు, సిబ్బంది విరిగిపడిన చెట్లను తొలగించి దశలవారీగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారని వివరించారు. -
గాలివాన భీభత్సం
సారంగాపూర్ : ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండలంలో మంగళవారం గాలితో కూడిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన గాలి కారణంగా మండలంలోని బీరవెల్లి గ్రామంలో సుమారు 100 ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. వీటిలో రేకుల ఇళ్లు , పెంకుటిళ్లు ఉన్నాయి. అలాగే పలు గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా మొక్కజొన్న, నువ్వుల పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక సమాచారం. -
ఏనుగుల దాడి.. పంట నష్టం
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో గజరాజులు మరోసారి బీభత్సం సృష్టించాయి. జిల్లా పరిధిలోని రామకుప్పం మండలం ఏనుగుల దాడికి తరచూ గురవుతున్న విషయం తెలిసిందే. తాజాగా నారాయణపురం తండా శివారులో పొలాలపై గురువారం రాత్రి దాడులు చేశాయి. పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు చిక్కుడు, వరి, మొక్కజొన్న పంటను తొక్కి, డ్రిప్ పైపులను ధ్వంసం చేశాయి. దాదాపు రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు రైతలు తెలిపారు. ఏనుగుల గుంపు రోజూ పంటలపై దాడులకు దిగుతుండడంతో ఇక్కడి రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ( రామకుప్పం) -
చిత్తూరులో కొనసాగుతున్న ఏనుగుల బీభత్సం
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో గజరాజుల బీభత్సం రోజురోజుకీ తారస్థాయికి చేరుకుంటోంది. జిల్లా పరిధిలోని రామకుప్పం మండలం ఏనుగుల దాడికి తరచూ గురవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మండల పరిధిలోని ననియాల, రామాపురం, పెద్దూరులో పంట పొలాలపై శుక్రవారం రాత్రి దాడులు చేశాయి. ఆ ప్రాంతాల్లోని పొలాల్లో టమాట, బీన్స్, మామిడి, అరటి పంటలకు తీవ్రనష్టం కలిగిస్తున్నాయి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తులంతా భయాందోళనకు గువవుతున్నారు. -
హద్దు మీరొచ్చి..హతమైంది!
ఓడీ చెరువు : మండలంలోని వంచిరెడ్డిపల్లిలో శుక్రవారం ఓ ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. ఉదయం తొమ్మిదికే గ్రామంలోకి ప్రవేశించి..స్థానికులపై దాడికి తెగబడింది. భోంచెర్వు రంగరామప్ప, గుడిసె చిన్నవెంకటరమణ అనే వ్యక్తులను తీవ్రంగా గాయపర్చింది. వీరికి చేతులు విరిగాయి. తల, గొంతు, పలు చోట్ల ఎలుగు బంటి కరవడంతో తీవ్రగాయూలై.. అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ద్విచ్రవాహనంపై గ్రామానికి వస్తున్న రత్నాకర్, మరో వ్యక్తిపైనా దాడి చేయడంతో అదుపు తప్పి కింద పడ్డారు. వారికి స్వల్ప గాయూలయ్యూరుు. దీంతో గ్రామస్తులు కుక్కల సాయంతో దాన్ని తరిమేందుకు ప్రయత్నించారు. అది ఎదురుదాడికి దిగింది. గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాలైన ఎంబీ క్రాస్, నందివారిపల్లి, సున్నంపల్లి, శెట్టివారిపల్లి గ్రామస్తులకు ఫోన్ చేయడంతో వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి ఎలుగుబంటిని హతమార్చారు. గాయపడ్డ వారిని 108 వాహనంలో కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నెల రోజుల నుంచి పొలాల్లోకి ఎలుగుబంట్లు వస్తున్నాయని ఫారెస్ట్ అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని గ్రామస్తులు వాపోయూరు. ఎలుగుబంటి కళేబరానికి ఘటనా స్థలం వద్దనే డాక్టర్ శ్రీరాములు నాయక్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ షరీఫ్, గార్డు తిమ్మారెడ్డి సమక్షంలో పోర్ట్‌మార్టం నిర్వహించారు. మంత్రి పల్లె పరామర్శ ఎలుగు బంటి దాడిలో తీవ్రంగా గాయపడి కదిరి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రంగరామప్ప , చిన్న వెంకటరమణతో పాటు వంచిరెడ్డిపల్లి గ్రామస్తులను రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అడవి జంతువులు పల్లెల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనల గురించి కనీసం తెలుసుకోలేదంటే ఎంత అశ్రద్ధగా పని చేస్తున్నారో అర్థమవుతోందని మండిపడ్డారు. ఇలాగే వ్యవహరిస్తే సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. -
హాహా‘కారం’ కనిపించలేదా?
హుద్‌హుద్ తుపాను బాధితులకు అందని సాయం సాక్షి, విశాఖపట్నం: హుద్‌హుద్ తుపాను నాలుగు జిల్లాల్లో విరుచుకుపడి బీభత్సం సృష్టించింది. దేశమంతా అయ్యో పాపం అనుకుంది. కేంద్రమూ సాయం ప్రకటిం చింది. వెల్లువలా వచ్చిన విరాళాలతో సీఎం సహాయ నిధి నిండిపోయింది. కానీ బాధితులకు అందిన సాయం నామమాత్రమేననటానికి ఎన్నో నిదర్శనాలు కనిపిస్తున్నాయి. విశాఖలో హుద్‌హుద్ తుపాను బాధితులకు కారప్పొడి పంపిణీ చేసేం దుకు 942 మెట్రిక్ టన్నులు తీసుకురాగా 687 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నారు. 255 మెట్రిక్ టన్నులు కారప్పొడి మర్రిపాలెంలోని పౌరసరఫరాల శాఖ గోడౌన్లో ముక్కిపోయింది. ఈ కారం పాడైపోయి వాడకానికి పనికిరాదని తేలింది. దీనిపై పౌరసరఫరాల శాఖ డిపో మేనేజర్ ప్రకాశరావును వివరణ కోరగా కారం నిల్వలపై ప్రభుత్వానికి లేక రాశామని, సమాధానం రాగానే పంపిణీ చేయడం లేదా వెనక్కు తిరిగి పంపించడం చేస్తామని బదులిచ్చారు. అక్టోబర్ 12న తుపాను వస్తే నిత్యావసరాలు నాలుగైదు రోజుల్లోనే దాతల సాయంతో జిల్లాకు తరలివచ్చాయి. రెండు నెలలు గడిచిపోయినా వాటిని పంపిణీ చేయకుండా నిర్లక్ష్యంగా గోదాములో వదిలేయటంతో ఈ దుస్థితి దాపురించింది. -
వర్ష బీభత్సం
సాక్షి, గుంటూరు: జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకూ కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వాగులు, వంకలు పొంగి పొర్లటంతో వేలాది ఎకరాల్లోని పంటలు నీట మునిగారుు. కాలువలు, చెరువులకు గండ్లు పడటంతోపాటు రోడ్లపై వరద నీరు ప్రవహించటంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. బాపట్ల, పల్నాడు ప్రాంతంలోని గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో వందలాది గ్రామాలు జలమయమయ్యాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు పస్తుంలుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శనివారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనం అవస్థలు పడ్డారు. మాచర్ల, గురజాల, బాపట్ల పట్టణాల్లో డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో మురుగునీరు పొంగి ఇళ్లలోకి చేరింది. దుర్గంధాన్ని భరించలేక ప్రజలు అల్లాడి పోయూరు. మాచర్ల పట్టణంలోని 13, 14 వార్డుల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరడంతో ప్రజలు కట్టుబట్టలతో బయటకురావాల్సి వచ్చింది. ఇళ్లలోని వస్తువులు, బియ్యం తడిసి ముద్దయ్యాయి. పల్నాడులోని వేల ఎకరాల్లో పత్తి, మిర్చి పంటలు నీటమునిగి ఉరకెత్తి పోయాయి. గురజాల మండలం మాడుగుల వద్ద ఒద్దులవాగు పొంగి ప్రవహించటంతో గురజాల నుంచి మాడుగుల, శ్యామరాజుపురాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఒద్దులవాగు దాటి మాడుగుల వెళ్లేందుకు ప్రయత్నించిన వల్లపు రాధ(48), బత్తుల అనసూర్య(50) అనే అక్కాచెల్లెళ్ళు నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయూరు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా మరొకరి మృతదేహం కోసం గాలిస్తున్నారు. అదే మండలంలోని దైద గ్రామం వద్ద దండెవాగు పొంగి ప్రవహిస్తుండటంతో దైద, తేలుకుట్ల, గొట్టిముక్కల, సమాధానం పేట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రెంటచింతల సమీపంలోని గోళివాగు ఉద్ధృతికి గుంటూరు-మాచర్ల రోడ్డులో రాకపోకలు స్తంభించాయి. వెల్దుర్తి మండలం రచ్చమాలపాడు వద్ద కానుగవాగు పొంగి ప్రవహించటంతో రచ్చమాలపాడు, శ్రీరాంపురం తండాలకు రాకపోకలు నిలిచిపోయూరుు. జమ్మలమడక వద్ద చంద్రవంక వాగు ఉధృతంగా ప్రవహించటంతో మాచర్ల నుంచి జమ్మలమడక, లింగాపురం, తుమృకోట గ్రామాలకు రాకపోకలు స్తంభించారుు. గురజాల, మాచర్ల పట్టణాల్లో నీటమునిగిన కాలనీల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి భోజన సదుపాయం కల్పించటం, ఇతర సహాయ చర్యలపై గురజాల ఆర్డీ మురళి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా సగటు వర్షపాతం 7. 31 సెం.మీ. జిల్లాలో ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా మాచర్ల మండలంలో 29.30 సెంటీమీటర్ల వర్షం పడగా అత్యల్పంగా కాకుమాను మండలంలో 0.05 సెం.మీ. వర్షం కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 7.31 సెం.మీ.గా నమోదైంది. వె ల్దుర్తి మండలంలో 15.82 సెం.మీ., గురజాల 15.24, రెంటచింతల 14.62, బాపట్ల 14.46, దుర్గి 12.56, దాచేపల్లి 12.44, బొల్లాపల్లి 12.40, నకరికల్లు 10.74, పెదకూరపాడు 10.52, మాచవరం మండలంలో 10.38 సెం.మీ.ల వంతున వర్షం పడింది. -
విశోక సంద్రం!
21 మంది ప్రాణాలు బలి తీసుకున్న హుదూద్ అంచనాలకు అందని భారీ నష్టం మారిపోయిన మహానగరం రూపురేఖలు ఎటు చూసినా కూలిన వృక్షాలు, తెగిన విద్యుత్ వైర్లు, దెబ్బతిన్న ఇళ్లు, రోడ్లు ఆహారం దొరక్క జనం అవస్థలు బాధితులకు ఆమడదూరంలో ప్రభుత్వ యంత్రాంగం అంధకారంతో జనం దుర్భర జీవనం ఉక్కునగరంలో నిలిచిన ఉత్పత్తి విశాఖపట్నం: అంచనాలకు అందని హుదూద్ తుపాను బీభత్సం విశాఖ నగరంలో జనజీవనాన్ని కకావికలం చేసింది. ప్రళయ తాండవం చేసిన తుపాను విశాఖ జిల్లావ్యాప్తంగా 15 మంది, మిగతా జిల్లాలో ఆరుగురి ప్రాణాలు బలితీసుకుంది. ఆకలి కేకలు, క్షతగాత్రుల ఆక్రందనలతో సముద్రం ప్రతిధ్వనిస్తోంది. ఒక్కరోజులో హుదూద్ మిగిల్చిన భారీ నష్టం విశాఖ జిల్లా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి రోడ్డుమార్గంలో విశాఖ రావాలనుకున్నప్పటికీ జాతీయ రహదారిపై ప్రయాణం అనుకూలంగా లేదని అధికారులు వారించడంతో హెలికాప్టర్ ద్వారా నగరానికి చేరుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తాగునీరూ కరువే హుదూద్‌తో భారీ ముప్పు తప్పదని ముందునుంచీ హెచ్చరికలు వస్తున్నా, ముందస్తు జాగ్రత్త ఏర్పాట్లలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. తుపాను నగరాన్ని ఢీకొట్టిన క్షణం నుంచి సోమవారం రాత్రి వరకూ నగరంలో ఒక్క ఆహార పొట్లాన్ని కూడా ప్రభుత్వం పంపిణీ చేయలేదు. ప్రజలను ఆదుకుంటామని, విసృ్తత ఏర్పాట్లు చేస్తున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు చేసిన ప్రకటనలు కేవలం నీటిమూటలుగానే మిగిలిపోయాయి. నిత్యావసర సరుకులు, కూరగాయలు మచ్చుకైనా దొరకడంలేదు. ఇళ్లల్లో నిల్వ ఉంచిన సరుకులు నిండుకోవడంతోపాటు ఫ్రిజ్‌లు పనిచేయకపోవడంతో పాడైపోతున్నాయి. కనీసం తాగడానికి కూడా నీరు దొరకడం లేదు. పక్క జిల్లాల నుంచి ఆహారం, తాగునీరు హెలికాప్టర్లలో తెప్పిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ వాటి జాడ కనిపించలేదు. ఇదే అదునుగా కొందరు స్వార్థపరులు ఆహారాన్ని అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. మద్యం షాఫులు మినహా భారీ షాపింగ్‌మాల్స్‌తో సహా మరే ఇతర దుకాణాలు తెరుచుకోలేదు. పాలు, అల్పాహారం, భోజనం ఏది కావాలన్నా వందలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రతి సరుకును దాని అసలు రేటు కంటే ఐదు నుంచి పది రెట్లు అధిక ధరకు అమ్ముతున్నారు. రోడ్డు, విద్యుత్ పునరుద్ధరణకు కృషి ధ్వంసమైన విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించడానికి తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) ఉభయగోదావరి జిల్లాల నుంచి వందలాదిమంది సిబ్బందిని ప్రత్యేక వాహనాల్లో విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు తరలించింది. జాతీయ రహదారుల వెంబడి కూలిపోయిన వేలాది విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను పునరుద్ధరించడానికే వారికి గంటల తరబడి సమయం పడుతోంది. దీంతో నగరంలో కూలిన చెట్లను ప్రజలే స్వచ్ఛందంగా తొలగించుకుంటున్నారు. సోమవారం రాత్రికి కూడా నగరంలో విద్యుత్ పునరుద్ధరణ సాధ్యంకాలేదు. మధ్యాహ్నం నుంచి బీఎస్ఎన్ఎల్తోపాటు మరికొన్ని సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌ల సిగ్నల్స్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఫోన్లు చార్జింగ్ లేకపోవడంతో పనిచేయలేదు. రవాణా వ్యవస్థను మధ్యాహ్నం సమయానికి కొద్దిగా పునరుద్ధరించారు. నగరం వీధుల్లో మాత్రం వాహనాలు తిరిగే అవకాశం లేకపోవడంతో ప్రజలు కాలినడకన వెళుతున్నారు. పెట్రోల్ బంకులు పనిచేయడం లేదు. ఎక్కడో ఓ చోట ఒకటి రెండు బంకులు తెరుచుకుంటే జనం తీర్థంలా క్యూ కడుతున్నారు. మత్స్యకారుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. తినడానికి తిండి కరువైంది. తుపాను ధాటికి ఫిషింగ్ బోట్లు దెబ్బతిన్నాయి. జీవనాధారం కోల్పోయి వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రతి చోటా తుపాను మిగిల్చిన శిధిల సాక్ష్యాలు దర్శనమిస్తున్నాయి. సాగర తీరం కళావిహీనం విశాఖ సాగరతీర అందాలు తుపాను ధాటికి కళావిహీనమయ్యాయి. అలల తాకిడికి ఆర్కే బీచ్ అందాలు తుడుచుకుపోయాయి. సబ్‌మెరైన్ మ్యూజియం గోడ కూలిపోగా సబ్‌మెరైన్ సైతం కొంతమేర ధ్వంసమైంది. నేవీ అమరవీరుల స్థూపం(విక్టరీఎట్ సీ) పార్క్‌లో ఏర్పాటుచేసిన నమూనా యుద్ధవిమానం నేలకూలింది. తీరంలో ఇసుక రోడ్డుమీదకు వచ్చి రోడ్డంతా ఇసుకతో నల్లగా మారింది. సాగర్‌నగర్ , రుషికొండ, తెన్నేటి పార్క్, జోడుగుళ్లు పాలెం వద్ద సాగరతీరం కోతకు గురైంది. సముద్రం సుమారు 200 మీటర్లు ముందుకు వచ్చింది. వర్షం దాటికి తీరం వెంబడి రుషికొండ బీచ్ వద్ద రోడ్డు కోతకు గురై అందవిహీనంగా తయారైంది. వణికిపోయిన ఉక్కునగరం అంతర్జాతీయ ఖ్యాతిని విశాఖపట్నానికి తీసుకువచ్చిన విశాఖ ఉక్కు కర్మాగారం తుపాను ధాటికి పండుటాకులా వణికిపోయింది. ప్రచండ గాలుల ధాటికి స్టీల్‌ప్లాంట్‌లోని దాదాపు 12 విభాగాలు షట్‌డౌన్ అయ్యాయి. 1971లో ప్రారంభించిన ప్లాంట్ చరిత్రలోనే తొలిసారిగా అన్ని విభాగాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో జపాన్, జర్మనీ, యునెటైడ్ స్టేట్స్, సింగపూర్, దుబాయ్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. స్టీల్ ప్లాంట్ అవసరాలకు నెలకొల్పిన 236 మెగావాట్ల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిచిపోయింది. రెండువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సింహాద్రి (ఎన్టీపీసీ) ధర్మల్ పవర్ కేంద్రం పూర్తిగా పనిచేయడం మానేసింది. విశాఖ పోర్టులో దాదాపు ఐదువేల మెట్రిక్ టన్నుల యూరియా నీటమునిగింది. దీంతో భారీగా యూరియా కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. -
వి‘ధ్వంసం’
హుదూద్ తుపానుకు ధ్వంసమైన చెట్లు నేలకూలిన విద్యుత్ స్తంభాలు గాలికి ఎగిరిపోయిన రేకులు ద్వారకానగర్ : హుదూద్ తుపాను పచ్చని చెట్లతో అందంగా అలరారుతున్న విశాఖ స్వరూపాన్ని మార్చేసింది. కేవలం 48 గంటల్లో సృష్టించిన బీభత్సంతో సమాచారం, రవాణా, విద్యుత్ వ్యవస్థను అతులాకుతలం చేసేసింది. నగరంలో రెండు రోజులుగా అంధకారం రాజ్యమేలుతోంది. నగరంలోని రోడ్ల్లకిరువైపులా ఉన్న చెట్లన్నీ నేలకూలాయి. కొన్ని చెట్లు ఇళ్లపై పడటంతో ధ్వంసమయ్యాయి. రోడ్లపై విరిగిపడిన చెట్లను తొలగించకపోవడంతో సిటీ బస్సులు నిలిచిపోయాయి. విశాఖనగర పరిధి సముద్రతీరాన్ని ఆనుకొని ఉన్న కాలనీలన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. పలుచోట్ల మంచినీటి పైపులు శిథిలమయ్యాయి. జగదాంబ, పూర్ణమార్కెట్, కురుపాం మార్కెట్, ద్వారకానగర్, దొండపర్తి, మద్దిలపాలెం, ఎంవీపీకాలనీ, ఆశీల్‌మెట్ట జంక్షన్, వీఐపీ రోడ్డు, సిరిపురం జంక్షన్, పెదవాల్తేరు తదితర ప్రాంతాల్లోని వ్యాపార సంస్థలకు తీవ్రనష్టం వాటిల్లింది. దొండపర్తిలో ఉన్న బీఈ షాపింగ్‌మాల్, ఎస్మార్ట్ వ్యాపార సముదాయాల అద్దాలు పగిలిపోయాయి. షాపింగ్‌లో ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులు, ఎల్సీడీ టీవీలు ధ్వంసమయ్యాయి. ద్వారకానగర్‌లో గల వస్త్ర దుకాణాల అద్దాలు పగిలిపోయాయి. తీవ్ర ఈదురుగాలులకు ఇళ్లపై ఉన్న నీటి ట్యాంక్‌లు ఎగిరిపోయాయి. ఆశీల్‌మెట్ట జంక్షన్, రేసవానిపాలెం, వెంకోజీపాలెం, రవీంద్రనగర్‌లో పెట్రోల్‌బంక్‌ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఈ బంకుల్లో పెట్రోల్ సరఫరా బంద్ చేశారు. చెట్లు కనుమరుగు హనుమంతవాక నుంచి జాతీయ రహదారి కిరువైపులా ఉన్న చెట్లు నేలకొరిగాయి. ద్వారకానగర్, అమర్‌నగర్, ఎంవీపీకాలనీ, విశాలాక్షినగర్, మధురానగర్, నెహ్రూనగర్, లలితానగర్, దొండపర్తి, శంకరమఠం, సీతంపేట, రైల్వే కాలనీ, తాటిచెట్లపాలెం, హెచ్‌బీకాలనీ తదితర ప్రాంతాల్లో ఇళ్లపై, రోడ్లపై చెట్లు పడిపోయాయి. రోడ్డుకు అడ్డంగా చెట్లు కూలిపోవడంతో లలితానగర్, శంకరమఠం రోడ్డు, దొండపర్తి, మధురానగర్ ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. -
విశాఖ విలవిల
తీరమా..ఘోరమా.. చెదిరిన విశాఖ ముఖచిత్రం విశాఖ చరిత్రలో కనీవినీ ఎరుగని ప్రకృతి విలయం హుదూద్ ప్రభావంతో ఉక్కిరి బిక్కిరి పెనుగాలులతో బీభత్సం,కుండపోతగా వర్షం జల దిగ్బంధంలో జిల్లా, నగరం పూడిమడక వద్ద తీరం దాటిన తుఫాన్ కరెంటు లేక అంతటా చిమ్మ చీకట్లే ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు ముగ్గురు వ్యక్తులు మృత్యువాత వేలాదిగా వృక్షాలు నేల మట్టం,భారీ విధ్వంసం బస్సు,రైలు, విమాన సర్వీసులన్నీ రద్దు హైవేలో ఎక్కడి వాహనాలు అక్కడే.. ‘పయోధర ప్రచండ ఘోష, ఝంఝానిల షడ్జధ్వానం’ విశాఖను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ‘హుదూద్’ పెను తుఫాన్ రూపంలో ప్రకృతి విసిరిన జల ఖడ్గం సుందర సాగర తీరాన్ని ఛిన్నాభిన్నం చేసింది. జిల్లా యావత్తూ అతలాకుతలం అయింది. దాదాపు 24 గంటలకుపైగా జనజీవనం స్తంభించి, జల జీవనంగా మారింది. ఎటు చూసినా చెట్లు కూలిన దృశ్యాలు, కరెంటు తీగలు తెగిపడిన విద్యుత్ స్తంభాలు, మొండి గోడలుగా మారిన పూరిళ్లు, శ్లాబులతో సహా నేల వాలిన పక్కా గృహాలు, ధ్వంసమైన వందలాది కార్లు, ద్విచక్రవాహనాలు..దర్శనమిస్తున్నాయి. రోడ్లపై వందలాది మూగజీవాల మృత కళేబరాలు పడి ఉన్నాయి. జిల్లాలోని తీరప్రాంతమంతా ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలతో, హోరు గాలులతో భీకరాకారం దాల్చింది. శనివారం అర్ధరాత్రి మొదలైన ‘హుదూద్’ ప్రభావం ఆదివారం తెల్లవారుజామయ్యే సరికి విలయంగా మారింది. కాళరాత్రిగా మారి చెవులు చిల్లులు పడేలా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన గాలులకు తోడు కుండపోతగా భారీ వర్షం కురిసింది. ఈ భయానక వాతావరణం దాదాపు 20 గంటలకుపైగా కొనసాగింది. విశాఖ చరిత్రలో తొలిసారిగా ఇలాంటి ప్రకృతి బీభత్సం చోటు చేసుకుంది. ముందే అధికార యంత్రాంగం మేలుకోవటంతో జననష్టం నివారించగలిగినా, ఆస్తి నష్టంభారీగానే జరిగింది. బంగాళాఖాతంలో జిల్లా నడిబొడ్డు పూడిమడకలో తీరం దాటిన వేళ ప్రచండ గాలులు భయకంపితుల్ని చేశాయి. సాక్షి, విశాఖపట్నం : గంటా, రెండు గంటలా? ఏకంగా 20 గంటల పాటు విశాఖ వణికిపోయింది. చెవులు చిల్లులుపడేలాంటి హోరుగాలులు, కుంభవృష్టితో హుదూద్ తుపాన్ విలయతాండవం చేసింది. చెట్లు, విద్యుత్ స్థంభాలను నేలకూల్చింది. అడుక్కో చెట్టు, స్తంభం కూల్చేసి అడుగు ముందుకు పడకుండా అడ్డుకట్టవేసింది. ఎన్నో ఇళ్లు, భవనాలను నేలమట్టం చేసేసింది. ముగ్గురిని మింగేసింది. అందరినీ ప్రాణభీతిలో అల్లాడించింది. ఒక్కమాటలో చెప్పాలంటే విశాఖ చరిత్రలోనే కనీవినీ ఎరుగనంత బీభత్సాన్ని సృష్టించింది. అందాల నగరాన్ని కకావికలం చేసింది. ఇది మన వైజాగేనా? అనుకునేంత అందవిహీనంగా మార్చేసింది. వెరసి విశాఖ వాసులకు హర్రర్ సినిమాలో సన్నివేశాలను ప్రత్యక్షంగా చూపించింది! శనివారం అర్థరాత్రి నుంచే మొదలైన హదూద్ వికృతరూపం ఆదివారం ఉదయానికి మరింత ఉధృతమైంది. గంటగంటకూ ఉగ్రరూపం దాల్చడం మొదలైంది. మధ్యాహ్నానికి తీరం దాటే సమయంలో మరింత బీభత్సం సృష్టించింది. తీరం దాటాక ఫర్వాలేదనుకున్న వారికి ఆ ఆశలు తల్లకిందులు చేస్తూ విధ్వంసకాండను కొనసాగించింది. పెనుగాలులు ఒకపక్క చెట్లు, స్తంభాలు కూలుతుండగా, మరోపక్క ఇళ్ల పైకప్పుల రేకులు అరటి ఆకుల్లా ఎగిరిపడ్డాయి. ఎక్కడ చూసినా ఇవి ఆకాశంలో నాట్యం చేస్తూ కనిపించాయి. కిటికీల అద్దాలు, తలుపులు, ఇళ్లలోని వస్తువులు ధ్వంసమయ్యాయి. ఈ బీభత్సానికి పిల్లాపాపలతో ప్రాణాలరచేతిలో పెట్టుకుని ఇళ్లలోనే బందీలయ్యారు. శనివారం అర్థరాత్రి నుంచే విద్యుత్ సరఫరా లేక బయట ఏం జరుగుతుందో టీవీల ద్వారా తెలుసుకోలేకపోయారు. ఫోన్ల ద్వారానైనా తెలుసుకుందామంటే నెట్వర్క్ సమస్యతో అవికూడా మూగబోయాయి. కానీ విశాఖలో హదూద్ సృష్టిస్తున్న విలయానికి తమ వారికి ఏంజరుగుతుందోనన్న భయంతో దూర ప్రాంతాల్లో ఉన్న వారు అతికష్టంపై క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. దుకాణాలు, హోటళ్లు, సినిమాహాళ్లు, మూతపడ్డాయి. ముందస్తు హెచ్చరికలతో రైళ్లు, బస్సు సర్వీసులు ఎక్కడివక్కకే నిలిచిపోయాయి. రైల్వే, బస్స్టేషన్లు బోసిపోయాయి. ఆటోలు, ఇతర వాహనాలు తిరిగే సాహసం చేయలేకపోయాయి. రోడ్లపై మనుషులకు బదులు చెట్లు, స్తంభాలే కనిపించాయి. మరోవైపు అడుగడుగుకీ చెట్లు కూలిపోయాయి. అనేకచోట్ల రోడ్లు తెగిపోయాయి. అత్యవసర పనులపై బయటకు వచ్చిన ఎంతదూరమైనా కాలినడకే శరణ్యమైంది. అయినా ఏ ముప్పు ముంచుకొస్తుందోనన్న భయం వెంటాడింది. ఇక హైవేపై కూలిన చెట్లు పడకేసినట్టుగా కనిపించాయి. ఒక్క వాహనం కూడా వెళ్లకుండా అడ్డుకట్టవేశాయి. ఇలా అన్ని వైపులా హుదూద్ విజృంభించి విశాఖను అష్టదిగ్బంధనం చేసింది. విద్యుత్ సరఫరా లేక ఇటు నగరం, అటు జిల్లా అంధకారంలో మగ్గిపోయి శతాబ్దం కిందటి రోజులను మళ్లీ గుర్తుకు తెచ్చింది. జిల్లాలో పరిస్థితి కూడా భయానకంగానే ఉంది. హుదూద్ ధాటికి అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేల ఎకరాల్లో వరిపంట నీట మునగగా, చెరకు పంట పెనుగాలుల తీవ్రతకు నేలవాలింది. తుపాన్ తీరం దాటినట్టుగా భావిస్తున్న అచ్యుతాపురం మండలం పూడిమడక ప్రాంతంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. తీరం దాటే సమయానికి తుపాను ఉధృతికి అక్కడ స్థానికులు, సహాయక చర్యల్లో ఉన్న అధికారులు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఎన్నో తుపాన్లను చవిచూసిన విశాఖ నగర, జిల్లా వాసులు హుదూద్ తుపాన్ అంతటి విపత్కర పరిస్థితిని ఎన్నడూ చవిచూడలేదంటూ ఆవేదన చెందుతున్నారు. ముగ్గురు మృత్యువాత కాగా హుదూద్ తుపాను కారణంగా ఆదివారం ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో విశాఖ నగరంలోని రామ్‌నగర్ ప్రాంతంలో గాలులకు ఎగిరిపడ్డ రేకు పడి గుర్తు తెలియని వ్యక్తి మృత్యువాతపడ్డాడు. పద్మనాభం మండలం బీఆర్ పాలవలసలో వర్షం నీటిలో జారిపడి ఎర్రయ్య (58) మరణించాడు. అనకాపల్లి మండలం కూండ్రంగిలో చంద్రవతి అనే మహిళ మరణించింది. -
ముంచుకొస్తున్న కోసీ.. నాలుగు జిల్లాలు ఖాళీ
కోసీ నది వరద భారీ స్థాయిలో ముంచుకుని వస్తుండటంతో దాని ఒడ్డున ఉన్న నాలుగు జిల్లాల ప్రజలను వెంటనే ఖాళీ చేయాల్సిందిగా బీహార్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నేపాల్‌ను ఇప్పటికే అతలాకుతలం చేసిన కోసీనది వరద శనివారం రాత్రికల్లా బీహార్‌ను కూడా ముంచెత్తుతుందని వాతావారణ శాఖ హెచ్చరించింది. ఇది అత్యంత ప్రమాదకరంగా ఉంటుందని బీహార్ విపత్తు నివారణ శాఖ ముఖ్య కార్యదర్శి వ్యాస్జీ తెలిపారు. సుపాల్, సహర్సా, మాధేపురా, మధుబని జిల్లాలపై దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఏకంగా పది మీటర్ల ఎత్తున కోసీనది వరద వస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం తెలిపిందని, దారిలో ఉపనదులతో కలిసి ఇది మరింత తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉందని వ్యాస్జీ అన్నారు. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందన్నారు. సుపాల్ పట్టణంలో నీటిమట్టం చాలా ఎక్కువగా వచ్చేలా ఉందని, ఇక్కడ పరిస్థితిని అదుపు చేయడం కూడా అత్యంత కష్టమని ఆయన అన్నారు. గతంలో 2008లో కూడా కోసీ నది ఉధృత రూపం దాల్చడంతో బీహార్‌లో భారీ నష్టం సంభవించింది. అప్పట్లో కూడా ఆగస్టు నెలలోనే 18వ తేదీన నేపాల్ నుంచి తీవ్రస్థాయిలో వరద రావడంతో కోసీ నది గట్లు తెగిపోయాయి. దాంతో వందలాది మంది మరణించగా, దాదాపు 30 లక్షల మంది నిర్వాసితులయ్యారు. 8 లక్షల ఎకరాల్లో పంట సర్వనాశనం అయ్యింది. -
దొంగల బీభత్సం
పోలీసులపై రాళ్ల దాడి ఇద్దరికి గాయాలు తబొల్లారం రైతుబజార్‌కు ఎదురుగా ఉన్న ఓంసాయి కాలనీలోని మాజీ సైనికుడి ఇంట్లో దుండగులు బీభత్సం సృష్టించారు. బొల్లారం ఇన్స్పెక్టర్ జగన్ తెలిపిన వివరాల ప్రకారం.. సాయికాలనీలో మాజీ బ్రిగేడియర్ జీబీ రెడ్డి, రక్ష దంపతులు నివాసం ఉంటున్నారు. బుధవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో దొంగలు జీబీ రెడ్డి ఇంటి కిటికీ గ్రిల్స్ తొలగించి చొరబడి ఇళ్లంతా చిందరవందర చేశారు. అదే సమయంలో అటుగా వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు, కొందరు వ్యక్తులను చూసి వారు గోడకు ఆనుకొని నిల్చున్నారు. అనుమానంతో పోలీసులు వారిని ఆరా తీశారు. దీంతో ఆ వ్యక్తులు పారిపోయారు. వారిలో ఒకరిని పోలీసులు పట్టుకున్నారు. తప్పించుకు వెళ్లిన వారు వెనుదిరిగి పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. గాయాలపాలైన పోలీసులు తాము పట్టుకున్న వ్యక్తిని వదిలేశారు. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ సిబ్బందితో అక్కడికి చేరుకొని దుండగుల కోసం గాలించారు. గాయపడిన పోలీసులు వెంకటేష్, రంగస్వామిని ఆస్పత్రిలో చేర్పించారు. నార్త్ జోన్ డీసీపీ జయలక్ష్మి, మహంకాళి ఏసీపీ మనోహర్, దుండిగల్ ఏసీపీ, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. -
బీభత్సం
గురజాల/దాచేపల్లి, న్యూస్‌లైన్: భీకర ఉరుములు గుండెల్లో దడపుట్టించాయి. మిరుమిట్లు గొలిపే మెరుపులు భయాందోళనకు గురిచేశాయి. పెనుగాలులు విధ్వసం సృష్టించాయి. పలు చోట్ల వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు భారీగా నీరుచేరింది. ప్రధాన రహదారులు, రైలు మార్గాల్లో చెట్లు నేలకూలడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మట్టిమిద్దెలు కుప్పకూలాయి. పల్లెల్లో విద్యుత్ సరఫరా లేక అంధకారం నెలకొంది. పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. మొత్తంమీద ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఈదురు గాలులతో కూడిన వర్షం జిల్లాను అతలాకుతలం చే సింది. ఈదురుగాలుల ధాటికి దాచేపల్లి-మాచర్ల ప్రధాన రహదారిలోని రైల్వే ఓవర్బ్రిడ్జివద్ద భారీగా పెరిగిన చింతచెట్లు నేలకొరిగాయి. ఆర్అండ్ అధికారులు చెట్ల తొలగింపు చర్యలు తీసుకున్న తరువాత వాహనాలు రాకపోకలు ప్రారంభమయ్యాయి. నడికుడి రైల్వేస్టేషన్లో ఒకటి, మూడవ నంబర్ ప్లాట్‌ఫాంలపై ఉన్న చెట్లు విరిగి పట్టాలపై పడ్డాయి. అతికష్టం మీద రైల్వే సిబ్బంది వాటిని తొలగించారు. చెట్టు విరిగి పడటంతో గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లే రైళ్లన్నీ రెండవ నంబర్ ప్లాట్‌ఫాం నుంచే వెళ్లటంతో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఈ స్టేషన్లో రైల్వేసిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తాయి. దీంతో పలు రైళ్లు నడికుడి రైల్వేస్టేషన్లో కొద్దిసేపు ఆపివేశారు. తాత్కాలిక మరమ్మతుల అనంతరం రైళ్లు పునరుద్ధరించారు.ధాటికి నడికుడి గ్రామంలో వేల్పుల రాజారావుకు చెందిన రేకుల ఇల్లు నేలమట్టం అయింది. ఇంటిపైకప్పు లేచింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవటంతో ప్రమాదం తప్పింది. అదే గ్రామంలో చెందిన మంగళగిరి మరియదాసుకు చెందిన రేకుల ఇల్లు కూడా కూలిపోయింది. కార్యాలయాల్లో తడిచిన రికార్డులు గురజాల మండలం గొట్టిముక్కల గ్రామంలో నాలుగు మట్టిమిద్దెలు కూలినట్టుగా రెవెన్యూ వర్గాలు గుర్తించాయి.స్థానిక ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలోకి వర్షపు నీరు చేరడంతో కార్యాలయంలో రికార్డులు, ఫర్నిచర్లు తడిసిపోయాయి. లోపల నీరు నిలవడంతో సిబ్బంది ఆరుబయటే విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. మండలంలో 7.4 సెం,మీ వర్షపాతం నమోదు జరిగినట్లు తహశీల్దార్ కార్యాలయం వర్గాలు తెలిపాయి. వృద్ధుల మృతి..: భీకర శబ్ధంతో కూడిన ఉరుముల ధాటికి జిల్లాలో ఇద్దరు వృద్ధులు గుండె ఆగి మృతిచెందారు. అచ్చంపేట మండలం హసనాబాద్ ఎస్సీ కాలనీకి చెందిన ఆపత్తుల చిట్టెమ్మ (50) ఉరుముల ధాటికి గుండెపోటుతో మరణించింది. దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వృద్ధురాలు మద్దురి కాశమ్మ(75) ఉరుములకు భయపడి బంధువుల ఇంటికి వెళ్తూ దారిలోనే మృతిచెందింది.