ఎల్.ఎన్.పేట: వ్యవసాయ బావి వద్ద ఉన్న వడ్ల రాశిపై ఏనుగులు దాడిచేసి సుమారు 20 బస్తాల ధాన్యం తిని.. మిగతా ధాన్యంతో పాటు వరికుప్పలను ధ్వంసం చేశాయి. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనర్సుపేట మండలం గొట్టిపల్లి గ్రామ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
బుధవారం ఉదయం బావి వద్దకు వెళ్లిన రైతు ఇది గుర్తించి ఏనుగులను అక్కడి నుంచి తరమడానికి ప్రయత్నించగా.. అవి తిరగబడి అతన్ని తరిమిశాయి.. దీంతో అప్రమత్తమైన గ్రామస్థులు బాణాసంచా, డప్పుల చప్పుడు చేయడంతో.. ఏనుగుల మంద అటవీ ప్రాంతం వైపు పరుగులు తీసీంది.