
హద్దు మీరొచ్చి..హతమైంది!
ఓడీ చెరువు : మండలంలోని వంచిరెడ్డిపల్లిలో శుక్రవారం ఓ ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. ఉదయం తొమ్మిదికే గ్రామంలోకి ప్రవేశించి..స్థానికులపై దాడికి తెగబడింది. భోంచెర్వు రంగరామప్ప, గుడిసె చిన్నవెంకటరమణ అనే వ్యక్తులను తీవ్రంగా గాయపర్చింది. వీరికి చేతులు విరిగాయి. తల, గొంతు, పలు చోట్ల ఎలుగు బంటి కరవడంతో తీవ్రగాయూలై.. అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ద్విచ్రవాహనంపై గ్రామానికి వస్తున్న రత్నాకర్, మరో వ్యక్తిపైనా దాడి చేయడంతో అదుపు తప్పి కింద పడ్డారు.
వారికి స్వల్ప గాయూలయ్యూరుు. దీంతో గ్రామస్తులు కుక్కల సాయంతో దాన్ని తరిమేందుకు ప్రయత్నించారు. అది ఎదురుదాడికి దిగింది. గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాలైన ఎంబీ క్రాస్, నందివారిపల్లి, సున్నంపల్లి, శెట్టివారిపల్లి గ్రామస్తులకు ఫోన్ చేయడంతో వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి ఎలుగుబంటిని హతమార్చారు.
గాయపడ్డ వారిని 108 వాహనంలో కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నెల రోజుల నుంచి పొలాల్లోకి ఎలుగుబంట్లు వస్తున్నాయని ఫారెస్ట్ అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని గ్రామస్తులు వాపోయూరు. ఎలుగుబంటి కళేబరానికి ఘటనా స్థలం వద్దనే డాక్టర్ శ్రీరాములు నాయక్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ షరీఫ్, గార్డు తిమ్మారెడ్డి సమక్షంలో పోర్ట్‌మార్టం నిర్వహించారు.
మంత్రి పల్లె పరామర్శ
ఎలుగు బంటి దాడిలో తీవ్రంగా గాయపడి కదిరి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రంగరామప్ప , చిన్న వెంకటరమణతో పాటు వంచిరెడ్డిపల్లి గ్రామస్తులను రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
అడవి జంతువులు పల్లెల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనల గురించి కనీసం తెలుసుకోలేదంటే ఎంత అశ్రద్ధగా పని చేస్తున్నారో అర్థమవుతోందని మండిపడ్డారు. ఇలాగే వ్యవహరిస్తే సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.