ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండలంలో మంగళవారం గాలితో కూడిన వడగళ్ల వాన బీభత్సం సష్టించింది.
సారంగాపూర్ : ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండలంలో మంగళవారం గాలితో కూడిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన గాలి కారణంగా మండలంలోని బీరవెల్లి గ్రామంలో సుమారు 100 ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. వీటిలో రేకుల ఇళ్లు , పెంకుటిళ్లు ఉన్నాయి. అలాగే పలు గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా మొక్కజొన్న, నువ్వుల పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక సమాచారం.