చిత్తూరు: చిత్తూరు జిల్లాలో గజరాజుల బీభత్సం రోజురోజుకీ తారస్థాయికి చేరుకుంటోంది. జిల్లా పరిధిలోని రామకుప్పం మండలం ఏనుగుల దాడికి తరచూ గురవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మండల పరిధిలోని ననియాల, రామాపురం, పెద్దూరులో పంట పొలాలపై శుక్రవారం రాత్రి దాడులు చేశాయి.
ఆ ప్రాంతాల్లోని పొలాల్లో టమాట, బీన్స్, మామిడి, అరటి పంటలకు తీవ్రనష్టం కలిగిస్తున్నాయి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తులంతా భయాందోళనకు గువవుతున్నారు.