చిత్తూరు : చిత్తూరు జిల్లాలో గజరాజులు మరోసారి బీభత్సం సృష్టించాయి. జిల్లా పరిధిలోని రామకుప్పం మండలం ఏనుగుల దాడికి తరచూ గురవుతున్న విషయం తెలిసిందే. తాజాగా నారాయణపురం తండా శివారులో పొలాలపై గురువారం రాత్రి దాడులు చేశాయి. పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు చిక్కుడు, వరి, మొక్కజొన్న పంటను తొక్కి, డ్రిప్ పైపులను ధ్వంసం చేశాయి.
దాదాపు రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు రైతలు తెలిపారు. ఏనుగుల గుంపు రోజూ పంటలపై దాడులకు దిగుతుండడంతో ఇక్కడి రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
( రామకుప్పం)