flood losses
-
తెలంగాణలో ముగిసిన సెంట్రల్ కమిటీ పర్యటన
-
Heavy Rains: విజయవాడ విలవిల
సాక్షి విజయవాడ: ముంచెత్తిన అతి భారీ వర్షాలపై అప్రమత్తంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చోవడంతో విజయవాడలో మూడున్నర లక్షల మందికిపైగా వరదల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. చుట్టుముట్టిన నీళ్ల నుంచి బయటకు రాలేక, కనీసం తాగునీరు కూడా అందక అల్లాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తిందనే అభిప్రాయం అధికారవర్గాల్లోనే బలంగా వ్యక్తమవుతోంది. అతి భారీ వర్షాలు కురవడం.. కృష్ణా, ఉప నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో పల్లపు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం కనీసం అప్రమత్తం చేయలేదు. కృష్ణా నదికి భారీ వరద వస్తున్న సమయంలోనే బుడమేరు ఉప్పొంగింది. కృష్ణా వరద ప్రవాహం ఎగదన్నడంతో బుడమేరు కరకట్టలకు పలు చోట్ల గండ్లు పడ్డాయి. దీంతో బుడమేరు కరకట్ట తెగిపోతుందనే భయంతో వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ 11 లాకులను ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎత్తేశారు. ఫలితంగా వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ లాకుల నుంచి బుడమేరు వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. 30 వేల క్యూసెక్కుల ప్రవాహం సింగ్ నగర్, ఇందిరా నాయక్ నగర్, వాంబే కాలనీ, దేవీనగర్, పాయకాపురం, రాజీవ్ నగర్, న్యూరాజరాజేశ్వరిపేట, కండ్రిగ, వైఎస్సార్ కాలనీసహా పలు ప్రాంతాలను ముంచేసింది. నగరంలో 12 డివిజన్లు పూర్తిగా మునిగాయి. మరోవైపు రాజధాని అమరావతి ప్రాంతంలో పోటెత్తిన వాగులతో వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసి తగినంత నిధులు, సహాయ సామగ్రిని అందించాల్సిన సీఎం చంద్రబాబు తన కరకట్ట నివాసం వరదలో చిక్కుకోవడంతో దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కార్యాలయాల్లో గడుపుతూ బస్సులో బస పేరుతో డ్రామాకు తెర తీశారు. సీఎం నివాసాన్ని వరద నుంచి కాపాడేందుకు దాదాపు 25 ట్రక్కుల ఇసుకను తరలించినా లాభం లేకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. మోటార్లతో నీటిని తోడాల్సి వచ్చిందంటే సీఎం ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. చట్టాలను తుంగలో తొక్కి తాను నివాసం ఉంటున్న అక్రమ సౌధం కృష్ణా వరదలో మునిగిపోయిందనే వాస్తవాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో అర్థరాత్రి పూట పర్యటన పెట్టుకున్నారు. వరద బాధితులకు సహాయం అందించడంలో నిమగ్నం కావాల్సిన అధికారులు సీఎం పర్యటిస్తుండడంతో ఆయన చుట్టూ చేరిపోయారు. దాంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. తాగునీరు, ఆహారం అందకం పిల్లలు, గర్భిణీలు, వృద్ధుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రపంచంలో ఎక్కడైనా మహా విపత్తు సంభవించినప్పుడు ఆ దేశ అధినేతలు, ప్రధానులు సహాయక చర్యలపై సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయడం సాధారణం. సహాయ చర్యలు ముగిశాక క్షేత్ర స్థాయిలో బాధితులను పరామర్శించి సంతృప్తికరంగా సాయం అందిందో లేదో ప్రధానులు, ముఖ్యమంత్రులు తెలుసుకుంటారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా ఐఎండీ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా ప్రజలను అప్రమత్తం చేయకుండా ఉదాసీనంగా వ్యవహరించారు.అర్ధరాత్రి హడావుడివరద సహాయ చర్యల్లో విఫలమవడంతో ఆ విషయం గురించి చర్చ జరగకుండా శనివారం మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు చంద్రబాబు డ్రామా నడుపుతూనే ఉన్నారు. వరదలో చిక్కుకున్న బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించకుండా తాను మాత్రం అక్కడే ఉండి వరుస సమీక్షలు, మీడియా సమావేశాలు, పర్యటనలతో హడావుడి చేశారు. మూడుసార్లు మీడియా సమావేశాలు పెట్టి రెండుసార్లు సింగ్‌నగర్‌లో పర్యటించారు. ఒకవైపు లక్షలాది మంది వరద నీటిలో చిక్కుకుపోయి ఉంటే సాయంత్రం ఒకసారి వెళ్లి రెండు గంటలు షో చేశారు. మళ్లీ రాత్రి 11.30 గంటలకు సింగ్‌నగర్ వెళ్లి హంగామా నడపడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. షో చేయడం మినహా బాధితులను ఆదుకోవడంలో విఫలమయ్యారు. నగరంలో ముంపు ప్రాంతాలు.. బుడమేరు పొంగటంతో అజిత్‌సింగ్‌నగర్, నందమూరి నగర్, ఆంధ్రప్రభ కాలనీ, ఎల్బీఎస్నగర్, వాంబేకాలనీ, అయోధ్యనగర్, మధురానగర్, రామకృష్ణాపురం, మధురానగర్, న్యూ రాజరాజేశ్వరిపేట, నున్న, ఓల్డ్ రాజరాజేశ్వరిపేట, పైపులరోడ్డు, కండ్రిక, పాయకాపురం, శాంతినగర్, ప్రశాంతినగర్, జక్కంపూడి, పాతపాడు, నైనవరం, చిట్టినగర్, మిల్క్ ప్రాజెక్ట్ ఏరియా, వించిపేట, భవానీపురం హెచ్‌బీ కాలనీ, ఉర్మిళానగర్, విద్యాధరపురం, గొల్లపూడి, రాయనపాడు, నల్లకుంట, గుంటుపల్లి నీట మునిగాయి. సంబంధాలు పూర్తిగా తెగిన కాలనీలుసింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, నందమూరినగర్, భరతమాత కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ వాంబే కాలనీ, అయోధ్యనగర్, ఊర్మిళా నగర్ ప్రాంతాలకు చేరుకోలేని పరిస్థితి ఉంది. ఇక్కడ 1.5 లక్షల మంది వరద నీటిలో చిక్కుకున్నారు. మొత్తంమ్మీద సుమారు మూడున్నర లక్షల మందికి పైగా వరద ముంపు బారిన పడ్డారు.కళ్లెదుటే కొట్టుకుపోయాయి..మంచాలు.. టీవీలు.. కార్లు.. బైకులు.. కళ్లముందే క్షణాల్లో కొట్టుకుపోవడంతో నిర్వేదంగా మిగిలిపోయారు. సింగ్‌నగర్, ఇందిరానాయక్ నగర్, పాయకాపురం, న్యూరాజరాజేశ్వరీపేట, వాంబేకాలనీ, రాజీవ్‌నగర్, కండ్రిక, రామకృష్ణాపురం, దేవినగర్, మధ్యకట్ట, దావుబుచ్చయ్యకాలనీ, గద్దెవారి పొలాల పరిసర ప్రాంతాల్లో ఆదివారం కనిపించిన దయనీయ పరిస్థితి ఇదీ!! బుడమేరు ఉప్పొంగడంతో పరిసర ప్రాంతాలన్నీ పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. పైనుంచి వరద రావడంతో శనివారం రాత్రే కొత్తూరు సమీపంలోని బుడమేరు గేట్లను ఎత్తివేశారు. ఈ సమాచారాన్ని బుడమేరు పరిసర ప్రాంతాల నివాసితులకు చేరవేయడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో లక్షలాది మంది కట్టుబట్టలతో రోడ్ల పాలయ్యారు.సీఎం ఎదుట బాధితుల ఆక్రోశంవిజయవాడలో ముంపు ప్రాంతాల ప్రజలు ఆదివారం ఉదయం నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. రహదారులు మునిగిపోవడంతో జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. ప్రభుత్వం వారిని బయటికి తెచ్చే ప్రయత్నం చేయకుండా వారి ఖర్మకు వదిలేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో భోజనం, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయలేకపోయారు. ఇంత మంది వరదలో చిక్కుకుంటే ఏడు మాత్రమే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సాయంత్రం వరకు రెస్క్యూ టీములు, పడవలు లేవు. కొంత మంది ట్రాక్టర్ల సహాయంతో బయటపడ్డారు. వరద ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా తమను పట్టించుకున్న నాథుడే లేడని, కనీసం తాగునీరు కూడా అందలేదని స్వయంగా సీఎం చంద్రబాబు ఎదుట బాధితులు ఆక్రోశించారు. విజయవాడలో వరదలో చిక్కుని ఇద్దరు మరణించగా మరొకరు గల్లంతు అయ్యారు.పిల్లల కోసం ఉరుకులు.. పరుగులు..సింగ్‌నగర్, న్యూరాజరాజేశ్వరీపేట, వాంబేకాలనీ పరిసర ప్రాంతాల్లో వారంతా దాదాపుగా కూలి పనులు చేసుకునేవారే. తెల్లవారుజామున పిల్లలను ఇంట్లో వదిలిపెట్టి పనులకు వెళ్లిపోయారు. సింగ్‌నగర్ పరిసర ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నట్లు తెలియడంతో ఉరుకులు పెట్టారు. సీఎం బందోబస్తు పేరుతో అధికారులు వారిని అడ్డుకున్నారు. సాయంత్రానికి నీటి ప్రవాహం పెరిగిపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వారిని లోపలకు వెళ్లకుండా నిలిపివేశారు. దీంతో పిల్లల జాడ తెలియక తల్లిదండ్రులు.. కన్నవారి కోసం చిన్నారులు తల్లడిల్లారు. న్యూ రాజరాజేశ్వరీపేట, ఇందిరా నాయక్‌నగర్, నందమూరినగర్, సింగ్‌నగర్ ప్రాంతాలన్నీ నీట మునిగినా మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఎలాంటి సహాయ చర్యలు చేపట్టలేదు. దీంతో బాధితులు పూర్తిగా నీటిలో చిక్కుకుపోయారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యటనతో అధికార యంత్రాంగం అంతా సహాయ చర్యలను పక్కనబెట్టి అక్కడకు చేరుకుంది. -
అలస్కాలో పగిలిన హిమానీనదం.. కేదార్నాథ్ విపత్తును తలపించేలా..
అమెరికాలోని అలస్కాలో ఒక నది ప్రవహిస్తుంటుంది. దాని పేరు మెండెన్‌హాల్. ఇదే పేరుతో హిమానీనదం(అతి పెద్ద మంచు దిబ్బ) ఉంది. ఇది జనెవు నగరానికి సమీపంలో కొండల నడుమ ఉంది. ఇక్కడ ఈ హిమానీనదం కారణంగా ఒక సరస్సు ఏర్పడింది. ఈ సరస్సు గుండా నది ప్రవహిస్తుంటుంది. సరస్సుకు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అడ్డుకట్టు తెగిపోవడంతో నదికి హఠాత్తుగా వరద పోటెత్తింది. ఫలితంగా ఉపద్రవం ముంచుకొచ్చింది. ఇది 2013లో మనదేశంలోని కేదార్‌నాథ్‌లో సంభవించిన విపత్తును తలపించేలా ఉంది. జనెవు నగర డిప్యూటీ సిటీ మేనేజర్ రాబ్ బర్న్ ఈ విపత్తుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. మెండెన్‌హాల్ నదికి అకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా పలు రోడ్లు నీట మునిగాయి. రెండు భవనాలు ధ్వంసం అయ్యాయి. పలువురు నిరాశ్రయులయ్యారు. కొందరు వరదల్లో కొట్టుకుపోయారు. పలు భవనాలు ప్రమాదం అంచున ఉన్నాయి. నదీ తీరప్రాంతమంతా కోతకు గురయ్యింది. దీంతో అక్కడ ముప్పు మరింతగా పెరిగింది. నది నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వృక్షాలతో పాటు మట్టికూడా కొట్టుకువస్తోంది. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో ఎమర్జెన్సీ ప్రకటించామని రాబ్ బర్న్ తెలిపారు. కాగా శాస్త్రవేత్తలు చాలా కాలంగా ఈ హిమానీనదం గురించి పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఈ హిమానీనదం పగిలిపోయే అవకాశాలు ఒక శాతం మాత్రమే ఉన్నాయని చెబుతూవస్తున్నారు. అయితే ఉన్నట్టుండి ఈ విపత్తు సంభవించడం ఆశ్చర్యం కలిగిస్తున్నదన్నారు. ఇది గ్లోబల్ వార్మింగ్ పరిణామాలను సూచిస్తున్నదన్నారు. జనెవుకు చెందిన శామ్ నోలన్ ఈ నది ఒడ్డున ఒక భవనం పడిపోతున్న దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. నదిలోని నీరు ఉధృతంగా రావడానికి తోడు, నదిలోని మట్టి కోతకు గురి కావడంతో భవనం అమాంతం కూలిపోయిందన్నారు. ప్రకృతి ప్రకోపాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన తెలిపారు. ఈ వరదల కారణంగా పలు రోడ్లు తెగిపోయాయి. వంతెనలు కూలిపోయాయి. రెస్క్యూ సిబ్బంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇది కూడా చదవండి: డాక్టర్ vs పేషెంట్.. ఏది న్యాయం? ఏది అన్యాయం? -
డబ్బులు మిగుల్చుకోవాలని కాదు.. అర్హులు మిగలకూడదనే తపన!
సాక్షి, విశాఖపట్నం: ‘మనందరి ప్రభుత్వానికి డబ్బులు ఎలా మిగుల్చుకోవాలనే తాపత్రయం లేదు. అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకూడదనే తపన మాత్రమే ఉంది. మీ జగన్‌లో కల్మషం లేదు.. ఎప్పుడైనా సరే మంచి చేయడం కోసమే ఆరాట పడతాడని, పోరాటం చేస్తాడని తెలియజేస్తున్నా. దేవుడు ఆశీర్వదిస్తే ఎన్నికలకు వెళ్లేలోపు ఆరేడు నెలల్లో పోలవరం నిర్వాసితులకు కేంద్రం నుంచే కాకుండా రాష్ట్రం నుంచి కూడా ప్యాకేజీ అందుతుంది. మీ బిడ్డ మీకోసం గట్టిగా కృషి చేస్తున్నాడు. లైడార్ సర్వేతో కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాడు. గత పాలకులకు జ్ఞానోదయం కలిగిస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్ బాధితులను కలుసుకుని పరామర్శించారు. క్షేత్రస్థాయిలో సహాయ చర్యలను స్వయంగా పరిశీలించారు. సీఎం జగన్ తొలుత ఉదయం 10.50 గంటలకు కూనవరం మండలం కోతులగుట్టకు హెలికాప్టర్లో చేరుకున్నారు. వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. సహాయక చర్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. అనంతరం కూనవరం బస్టాండ్ సెంటర్‌కు వెళ్లి కూనవరం, వీఆర్‌పురం మండలాల వరద బాధితులతో సమావేశమయ్యారు. ఆ తరువాత పోలవరం నియోజకవర్గం కుకునూరు మండలంలో పూర్తిగా దెబ్బతిన్న గొమ్ముగూడెం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఫొటోల కోసం నా చుట్టూ తిప్పుకోకుండా.. వారం క్రితం గోదావరి పొంగి ప్రవహించడంతో దాదాపు 16 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. కలెక్టర్ సుమిత్కుమార్ను ముందుగానే అప్రమత్తం చేశాం. అధికారులకు కావాల్సిన వనరులను సమకూర్చి వారం పాటు సహాయ కార్యక్రమాలను ఏమాత్రం అలసత్వం లేకుండా నిర్వహించాలని చెప్పాం. కలెక్టర్లకు సదుపాయాలు కల్పించి గ్రామ సచివాలయాల నుంచి వలంటీర్ల దాకా అందరినీ యాక్టివేట్ చేశాం. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా సహాయం అందేలా చర్యలు తీసుకున్నాం. వరదలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు హడావుడిగా పర్యటించి ఫొటోలు దిగి వెళ్లిపోవడం కాకుండా కలెక్టర్లకు తగినన్ని నిధులు, సమయం ఇచ్చి సహాయ చర్యల్లో యంత్రాంగాన్ని పూర్తిగా నిమగ్నం చేశాం. వారం రోజుల్లో వారంతా ప్రతి గ్రామంలోకి వెళ్లి ఏ ఒక్క ఇల్లూ మిగిలిపోకుండా బాధితులందరికీ సహాయం అందించే కార్యక్రమాలు జరిగాయి. అధికార యంత్రాంగాన్ని నా చుట్టూ తిప్పుకోకుండా బాధితుల వద్దకు పంపించి సహాయ చర్యలను సమర్థంగా పర్యవేక్షించాం. ఇంతకు ముందూ ఇదే చేశాం.. ఇప్పుడూ చేస్తున్నాం. సాయం అందకుంటే చెప్పండి మీ కలెక్టర్ బాగా పని చేశారా? అని మిమ్మల్నందరినీ అడుగుతున్నా. ఎవరైనా నిర్భయంగా ముందుకు రావచ్చు. మీకు జరగాల్సిన మంచి జరగని పరిస్థితి ఎక్కడైనా ఉంటే నేరుగా నాకు చెప్పవచ్చు. ఇంత గొప్పగా, పారదర్శకంగా ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని తాపత్రయపడే ప్రభుత్వం మనది. మనందరి ప్రభుత్వానికి డబ్బులు ఎలా మిగుల్చుకోవాలనే తాపత్రయం లేదు. అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకూడదనే తపన, తాపత్రయమే ఉంది. ఇళ్లలోకి నీళ్లు వస్తే బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులన్నీ ఇవ్వడమే కాకుండా రూ.2 వేలు చొప్పున అందించాం. అలా జరగకపోతే నాకు చెప్పవచ్చు. ఇళ్లలోకి నీళ్లు రాకపోయినప్పటికీ గ్రామాలు కటాఫ్ అయిపోయి ఉంటే ఆ ఇళ్లకు రేషన్ ఇవ్వాలని ఆదేశాలిచ్చాం. 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, పాలు, కూరగాయలు లాంటి ఐదు రకాలు కలిపి ఇవ్వాలని సూచించాం. బాధితులు ఎవరికైనా అందకపోతే చెప్పవచ్చు. ప్రభుత్వం దానికి జవాబుదారీతనం తీసుకుంటుంది. పొరపాటున పేరు లేకపోతే.. కచ్చా ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బ తిన్నాయనే వ్యత్యాసం ఉండకూడదని చెప్పాం. పేదల పట్ల ఎలాంటి వ్యత్యాసం చూపవద్దని, నష్టపోయిన ప్రతి ఇంటికీ రూ.10 వేలు చొప్పున ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. గ్రామ సచివాలయాల్లోనే అర్హుల జాబితాలు పెడుతున్నాం. ఒకవేళ ఎన్యుమరేషన్ ఖాతాలోకి రాకపోయి ఉంటే అది కూడా తప్పే అవుతుంది. నష్టం జరిగినా పొరపాటున జాబితాలో పేరు లేకపోతే వెంటనే అందులో చేర్చి మంచి జరిపించే కార్యక్రమం చేయడం కోసమే మీ జగన్ మీ దగ్గరకు వచ్చాడు. ఏ ఒక్కరికి ఏ కష్టమొచ్చినా.. ఈ ప్రభుత్వం మీది అని తెలియజేస్తున్నా. మీరంతా తోడుగా ఉన్నారు కాబట్టే మీ బిడ్డ ఈరోజు సీఎం స్థానంలో కూర్చున్నాడు. మీలో ఏ ఒక్కరికి ఏ కష్టమొచ్చినా దాన్ని తీర్చడం కోసం ఎల్లవేళలా కృషి చేస్తా. పోలవరానికి సంబంధించిన విషయాలన్నీ ఈ పద్ధతిలోనే జరిగిపోతాయి. వరద సమయంలో మీకు ఎలా సాయం అందింది? కలెక్టర్ ఎలా చేశారో మీరే చెప్పారు. కూనవరం ఎస్ఐ వెంకటేశ్ గురించి మంచి విషయాలు విన్నా. గొప్పగా ఆదుకున్నారని విన్నా. ఆగస్టు 15న ఇచ్చే పతకాల్లో ఆయన పేరు ఉండాలని కలెక్టర్‌కు సూచించా. అధికారులను నిలదీసేందుకు రాలేదు నేను ఇక్కడకు అధికారులను నిలదీయడానికి రాలేదు. అధికారులను శభాష్ అని వెన్ను తట్టేందుకు, మీ దగ్గర నుంచి మంచి సమాధానాలు వస్తాయని వినడం కోసం వచ్చా. కలెక్టర్ మాత్రమే కాకుండా ఎస్పీ నుంచి ఎస్ఐ దాకా సచివాలయ సిబ్బంది నుంచి వలంటీర్ దాకా రెవెన్యూ సిబ్బంది నుంచి మొత్తం అందరూ బాగా కష్టపడ్డారు. సకాలంలో స్పందించిన అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా. ఇంత కష్టాల్లో ఉన్నప్పటికీ నాపై ప్రేమాభిమానాలు చూపుతున్న ప్రతి అక్కకు చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు తాతకు, ప్రతి సోదరుడికి స్నేహితుడికీ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. సీఎం పర్యటనలో హోంమంత్రి తానేటి వనిత, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్షి్మ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు, కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ తుహిన్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. -
కోటు వేసుకోవడానికి నానా పాట్లు పడ్డ బైడెన్: వీడియో వైరల్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లాడు. అక్కడ బాధితులకు ధైర్యం చెప్పడమే కాక పలు వాగ్దానాలు కూడా చేశాడు. ఈ ప్రకృతి వైపరిత్యం కుటుంబాలను ఎలా చిద్రం చేస్తోందో తనకు తెలుసునని అన్నారు. ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిన బాధ్యత తన పై ఉందని అన్నారు. మీరు ఫెడరల్ ప్రభుత్వ పాలనలో ఉన్నారు. మీరంతా మీరు ఉన్న చోటు ...రాష్ట్రం, కౌంటీ లేదా నగరాలకు చేరుకునేవారకు తాము తోడుగా ఉంటామని చెప్పాడు. ఆయన కరోనా వచ్చి రెండు వారాలు హోం క్యారంటైన్లో గడిపిన అనంతరం చేసిన అధికారిక పర్యటన ఇది. ఈ మేరకు ఆ పర్యటన అనంతరం వెనుతిరిగి వస్తున్న సందర్భంలో కెంటుకీ విమానాశ్రయంలో ఒక అనుహ్య ఘటన చోటు చేసుకుంది. బైడెన్ హెలికాప్టర్ దిగి వస్తూ సూట్ వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎంతసేపటికి వేసుకోలేకపోతాడు. దీంతో సహాయం కోసం తన భార్య బిల్ బైడెన్ వైపు తిరిగితాడు. చివరి ఆమె సాయంతో వేసుకుంటాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా లుక్కేయండి. What's going on here? pic.twitter.com/ICzLGFH0bn — RNC Research (@RNCResearch) August 8, 2022 (చదవండి: చెట్టు గాలి పీల్చుకోవడం చూశారా? వీడియో వైరల్) -
విద్యుత్ శాఖకు వరద నష్టం రూ.1.53 కోట్లు
సాక్షి, అమరావతి: గోదావరి వరద ప్రభావానికి గురైన అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, జిల్లాల్లో విద్యుత్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఏపీ ఈపీడీసీఎల్ చేపట్టిన పునరుద్ధరణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ జిల్లాల్లోని 12 మండలాల పరిధిలో 415 గ్రామాల్లో 33/11 కేవీ సబ్స్టేషన్లు, 250 కిలోమీటర్ల మేర 33 కేవీ లైన్లు, 11 కేవీ ఫీడర్లు 46, 4,022 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 5,453 వ్యవసాయ, 71,443 వ్యవసాయేతర సర్వీసులపై వరద ప్రభావం పడింది. ఈ కారణంగా డిస్కంకు ఏర్పడిన నష్టం ఇప్పటివరకు రూ.1.53 కోట్లుగా అంచనా వేశారు. కష్టంగా మారిన పునరుద్ధరణ గడచిన మూడు రోజుల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో 35,936 కంటే ఎక్కువ గృహ కనెక్షన్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పూర్తిగా నీట మునిగిన చింతూరు, వీఆర్ పురం, కూనవరం, ఏఎస్ఆర్ జిల్లాలోని ఎటపాక, ఏలూరు జిల్లాలోని కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో దాదాపు 35,507 గృహ సర్వీసులకు నేటికీ విద్యుత్ ఇచ్చే అవకాశం లభించడం లేదని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. విద్యుత్‌ను పునరుద్ధరించడానికి ప్రతి డివిజన్‌కు ఏపీ ఈపీడీసీఎల్ 24 గంటలూ అందుబాటులో ఉండేలా కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఐదు జిల్లాల్లో దెబ్బతిన్న 33 కేవీ ఫీడర్లన్నిటినీ తిరిగి ప్రారంభించారు. వరద ప్రభావిత గ్రామాల్లో నీరు తగ్గిన 24 గంటల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని సమయాల్లో అధికారులు, సిబ్బందిని సిద్ధం చేయడంతో పాటు, పనుల అమలుకు అవసరమైన మనుషులు, సామగ్రిని అందుబాటులో ఉంచారు. రంపచోడవరం, జంగారెడ్డిగూడెం డివిజన్లలో ముంపు ఎక్కువగా ఉన్న చోట్ల మినహా నీటిమట్టం తగ్గిన అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పూర్తయింది. బోట్లపై వెళ్లి పోల్ టు పోల్ సర్వే, లైన్ క్లియరింగ్ నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల లైన్లు దాదాపు 12 అడుగుల మేర నీటిలో మునిగిపోయాయి. వాటిపై చెట్ల కొమ్మలు, చెత్త, బురద మేట వేయడంతో పునరుద్ధరణ కష్టంగా మారింది. 800 మందికి పైగా సిబ్బంది 65 బ్యాచ్‌లుగా పగలు రాత్రి అనే తేడా లేకుండా వాటిని తొలగించే పని చేస్తున్నారు. త్వరగా పూర్తి చేయండి వీలైనంత త్వరగా విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తిచేయాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఏపీ ఈపీడీసీఎల్‌కు ఆదేశాలిచ్చారు. డిస్కమ్ సీఎండీ కె.సంతోషరావు, ఇతర అధికారులతో విజయానంద్ బుధవారం సమీక్ష నిర్వహించారు. వరద తీవ్రత తగ్గడంతో నీటిమట్టం తగ్గుముఖం పట్టిందని, వీలైనంత త్వరగా విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని సీఎండీ వివరించారు. విద్యుత్ సరఫరాను త్వరగా పునరుద్ధరించడానికి ఆపరేషన్ వింగ్ ఇంజనీర్లతో పాటు ఇతర విభాగాల నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను, స్థానిక అధికారులను పంపించాలని డిస్కమ్‌లను విజయానంద్ ఆదేశించారు. సమావేశంలో ట్రాన్స్‌కో సీఎండీ బీ శ్రీధర్, డిస్కమ్‌ల సీఎండీలు జె.పద్మా జనార్దనరెడ్డి, హెచ్.హరనాథరావు పాల్గొన్నారు. ఇదీ చదవండి: శాంతించిన గోదావరి -
రోడ్లన్నీ ఛిద్రం.. దెబ్బతిన్న రహదారులు
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వాగులు, ఉప నదులు పొంగిపొర్లడంతో పెద్ద సంఖ్యలో రోడ్లు కోతకు గురయ్యాయి. కల్వర్టులు, అప్రోచ్ రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. గోదావరి వరదలతో పరీవాహక ప్రాంతం వెంబడి రహదా రులు దెబ్బతిన్నాయి. జాతీయ రహదారులు కూడా కోతకు గురయ్యాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నష్టం ఎక్కువగా ఉంది. చాలా చోట్ల రోడ్లకు మరమ్మతులు చేయాల్సి ఉంది. మంచిర్యాల జిల్లా తోటపల్లి మండలంలో దెబ్బతిన్న రోడ్డు గోదావరి పరీవాహకం వెంట.. కరీంనగర్ జిల్లాలో 40 ఆర్అండ్బీ రోడ్లు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతుల కోసం అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. పెద్దపల్లి జిల్లాలో 42 కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 56 చోట్ల, జగిత్యాల జిల్లాలో 32 చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలకుతోడు గోదావరి వరదలతో భారీ ఎత్తున రోడ్లు, కల్వర్టులు ధ్వంసమయ్యాయి. నిర్మల్ జిల్లాలో 40 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, వంతెనల మరమ్మతులకు రూ.18 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఆదిలాబాద్ జిల్లాలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం రూ.15 కోట్ల మేర అవసరమని అధికారులు అంచనా వేశారు. మంచిర్యాల జిల్లాలో గోదావరి తీర ప్రాంతాలతోపాటు మంచిర్యాల పట్టణంలోనూ రోడ్లు దెబ్బతిన్నాయి. చదవండి: గోదావరి మహోగ్ర రూపం.. రంగంలోకి హెలికాప్టర్లు.. సైన్యం -
వరద బాధితులపై కేంద్రానిది బాధ్యతారాహిత్యం
రాజంపేట: వైఎస్సార్ జిల్లా చెయ్యేరు వరద బాధితులపై కేంద్రప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. శుక్రవారం పులపుత్తూరు, మందపల్లెల్లో ఆయన పర్యటించారు. పులపుత్తూరులో మీడియాతో మాట్లాడారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కేంద్రమంత్రులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బాధితులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. బాధితులను ఆదుకోవాలని ప్రధాని మోదీ, అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామన్నారు. తుపాను బాధితులకు సాయం చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. పునరావాసం, పరిహారం లాంటి విషయంలో ఉదారంగా వ్యవహరించాలని కేంద్రాన్ని కోరారు. వరద ప్రళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఇక్కడ ఇంత విపత్తు జరిగినా కేంద్ర మంత్రులు కన్నెత్తి చూడలేదని విమర్శించారు. అనంతరం నేతలు అన్నమయ్య డ్యామ్‌ను పరిశీలించారు. వరద పీడిత ప్రాంతాల్లో సీపీఐ తరఫున బాధితులకు బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేశారు. కాగా బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తమైంది. -
ఎస్బీఐ జనరల్: వరద సహాయక క్లెయిములకు రెడీ
హైదరాబాద్, సాక్షి: రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఇటీవల వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతవాసులకు చేయూత నందించేందుకు బీమా రంగ కంపెనీ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వరదల వల్ల నష్టపోయిన రైతులు, వ్యాపారస్తులు తదితర వ్యక్తులకు త్వరితగతిన బీమా క్లెయిములను పరిష్కరించనున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆస్తులు, వ్యాపారాలు, పంటలు తదితరాలలో ఏర్పడిన నష్టాలకుగాను బీమా ప్రయోజనాలను వేగంగా అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేసింది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, సిద్ధపేట, కరీమ్నగర్, యాదాద్రి భువనగిరి జిల్లాలలో వరదవల్ల నష్టాలు సంభవించినట్లు పేర్కొంది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్టణం జిల్లాలు వరదవల్ల ప్రభావితమైనట్లు అభిప్రాయపడింది. ఈ ప్రాంతాలలోని కస్టమర్లకు వరద నష్టంకింద పరిహారం అందించేందుకు అక్టోబర్ నుంచి సన్నాహాలు చేస్తున్నట్లు తెలియజేసింది. వరదల కారణంగా చిన్నతరహా పరిశ్రమల(ఎస్ఎంఈలు) యూనిట్లు, ఫ్యాక్టరీలు, గోదాములు, దుకాణాలు తదితర కార్యకలాపాలకు విఘాతం ఏర్పడినట్లు పేర్కొంది. ఇప్పటికే 120 క్లెయిములను పరిష్కరించినట్లు ఈ సందర్భంగా ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో పీసీ కంద్పాల్ వెల్లడించారు. వీటిలో అత్యధికం ఎస్‌ఎంఈలుకాగా.. వివిధ మార్గాల ద్వారా తమ పాలసీదారులకు క్లెయిముల సెటిల్మెంట్పై అవగాహన కల్పించినట్లు తెలియజేశారు. ఆస్తులు, బిజినెస్‌లు నష్టపోయినట్లు 120కుపైగా క్లెయిమ్‌లు అందగా.. 100 మోటార్ క్లెయిములు వచ్చినట్లు పేర్కొన్నారు. వీటిలో అత్యధికం హైదరాబాద్, చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వచ్చినట్లు తెలియజేశారు. కస్టమర్లకు వాటిల్లిన నష్టాలను దృష్టిలో ఉంచుకుని క్లెయిములను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. -
ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించాం: నీలం సాహ్ని
-
కృష్ణా, అనంతలో కేంద్ర బృందం పర్యటన
సాక్షి, కృష్ణా జిల్లా : రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన పంట నష్టంపై సమీక్షించేందుకు కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాలైన ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంత జిల్లాల్లో పర్యటిస్తోంది. సోమవారం కృష్ణా జిల్లాలోని కొటికల పూడికి చేరుకున్న బృందం వరదల వలన నష్టపోయిన ప్రత్తి, మినుము, బెండ, వంగ పంటలను పరిశీలించింది. కలెక్టర్ ఇంతియాజ్, జేసీ మాధవీ లతలు వరద వలన నష్టపోయిన పంట వివరాలను వారికి వివరించారు. వరదలతో కష్టాల్లో కూరుకుపోయిన తమను ఆదుకోవాలని ఈ సందర్భంగా రైతులు కేంద్ర బృందాన్ని వేడుకున్నారు. అనంతరం, కంచికచర్లకు వెళ్లే మార్గంలో నేల కొరిగిన వరిపంటను సైతం కేంద్ర బృందం పరిశీలించింది. వర్షాల కారణంగా కొంత, పంట కాలువ పొంగటం వల్ల మరికొంత వరికి నష్టం జరిగిందని కలెక్టర్ వివరించారు. వర్షానికి దెబ్బతిన్న రోడ్లలో కేంద్ర బృందం ముందుకు సాగింది. కాగా, వరదల కారణంగా కొటికల పూడిలో దాదాపు 351 ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. ( సీఎస్‌తో కేంద్ర బృందం భేటీ.. వరద నష్టంపై సమీక్ష ) అనంతపురం : జిల్లాలోనూ కేంద్ర బృందం పర్యటించింది. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. ఉరవకొండ, గుంతకల్లు, రాగులపాడు, వజ్రకరూరు, గూళ్యపాల్యం నియోజకవర్గాల్లో వారు పర్యటించారు. పంట నష్టానికి సంబంధించిన వివరాలతో పాటు రైతుల నుంచి మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
సీఎస్‌తో కేంద్ర బృందం భేటీ.. వరద నష్టంపై సమీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాల కారణంగా సంభవించిన నష్టాలపై సమీక్షించేందుకు గాను రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర బృందం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో సమావేశమయ్యింది. వివిధ శాఖల వారీగా అధికారులు జరిగిన నష్టంపై కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భారీ వరదల కారణంగా రాష్ట్రంలో 6,368 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అధికారులు కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చారు. ఈ సందర్భంగా నీలం సాహ్ని మాట్లాడుతూ.. ‘2లక్షల 12వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 24వేల 515 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయి. రాష్ట్రంలో 5వేల 583 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. తాత్కాలిక పునరుద్ధరణ చర్యలకు గాను తక్షణమే 840 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. శాశ్వత పునరుద్ధరణ చర్యలకు రూ.4,439 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. తడిసిన, రంగు మారిన ధాన్యం కొనుగోలుకు కేంద్రం సడలింపులు ఇవ్వాలి. దెబ్బతిన్న వేరుశెనగ పంటకు కూడా నిబంధనలు సడలించాలి. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఉపశమనం కల్పించాం. ప్రభుత్వం తక్షణ చర్యలతో ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించాం’ అని తెలిపారు. (చదవండి: సంక్షోభం నుంచి సంక్షేమంలోకి..) వరద నష్టం ఫోటో ఎగ్జిబిషన్ సందర్శన సాక్షి,విజయవాడ: నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోవరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ని సౌరవ్ రే నేతృత్వంలోని కేంద్ర బృందం సందర్శించింది. జిల్లాలో సంభవించిన నష్టంపై కలెక్టర్ ఇంతియాజ్ కేంద్ర బృందానికి వివరించారు. వరదనష్టంపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాధమికంగా అగ్రికల్చర్లో 17000 హెక్టార్లు, హార్టీ కల్చర్‌లో 8,000 హెక్టార్ల పంటనష్టం జరిగిందని తెలిపారు. దెబ్బతిన్న ఆర్ అండ్ బీ, పంచాయితీ రాజ్ రోడ్ల అంచనాలను కూడా వివరించారు. జిల్లాలోని మూడు మండలాల్లో కేంద్రకమిటీ పంట నష్టాన్ని పరిశీలించనుందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. -
ఎగసిపడ్డ జ్వాల.. తిరగబడ్డ వరద బిడ్డ
వరద పరిహారం పంపిణీ పరిహాసమైంది. నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగలేదని శనివారం నగరవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తింది. నిండా మునిగిన వారిని వదిలేసి తమ అనుచరగణానికే డబ్బులు పంపిణీ చేశారంటూ ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులపై ఆగ్రహం పెల్లుబికింది. రెండు, మూడో అంతస్తుల్లో ఉన్నవారికి రూ.10 వేలు ఇచ్చి..నాలాల పక్కన ఉండి..నీటమునిగిన ఇళ్లలోని వారిని విస్మరించడం న్యాయమేనా అంటూ బాధితులు నిలదీశారు. సికింద్రాబాద్ నామాల గుండులోని డిప్యూటీ స్పీకర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అంబర్‌పేటలో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అబిడ్స్‌లోని జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేపట్టగా..ఆఫీసుకు తాళం వేయాల్సి వచ్చింది. నచ్చిన వారికి పరిహారం ఇచ్చి...అర్ధంతరంగా పంపిణీ ఎలా నిలిపివేస్తారని పాతబస్తీలో బాధితులు ఆగ్రహించారు. నగరం నలుమూలలా ఈ రకమైన నిరసనలు, ఆందోళనలు చోటుచేసుకోవడంతో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు బిత్తరపోవాల్సి వచ్చింది. – సాక్షి, సిటీబ్యూరో సాక్షి, సిటీబ్యూరో : నగరంలో వరద సాయం రూ.10 వేలు అందని వేలాది మంది పేద ప్రజలు తిరగబడ్డారు. నిజమైన బాధితులకు పరిహారం ఇవ్వలేదంటూ రోడ్డెక్కారు. వీరి వేదన..ఆగ్రహ జ్వాలలకు అధికారుల తీరుతోపాటు రాజకీయ జోక్యం, స్థానిక పరిస్థితులు కారణంగా కనిపిస్తున్నాయి. బాధితులందరికీ వరదసాయం అందించాలని భావించిన ప్రభుత్వం.. ఒక్కరే రెండుసార్లు పొందకుండా ఉండేందుకు ప్రత్యేక యాప్‌ను, అందులో ఆధార్‌ను నమోదు చేయడాన్ని తప్పనిసరి చేసింది. బాధితుల వద్దకు వెళ్లే ప్రభుత్వ యంత్రాంగం బాధితుల పేరు వంటి వివరాలతోపాటు ఆధార్‌నెంబర్, ఫొటో అప్లోడ్ చేయగానే బాధితుల ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేస్తే సక్సెస్ అనే సందేశం వస్తుంది. అంటే బాధితులకు నగదు అందజేయవచ్చు. ఆటోమేటిక్‌గా సమాచారం ఆన్లైన్లో నమోదవుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నా..నగదు పంచే ఉద్యోగుల వెంట ఉన్న స్థానిక నేతలు తాము ఇవ్వాలనుకునే వారికే ప్రాధాన్యత నివ్వడం.. తాము చెప్పిన ప్రాంతాలకే అధికారులను తీసుకువెళ్లారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితులకు ఇళ్లవద్దే సాయం అందిస్తారు కనుక జియో కోఆర్డినేట్స్ ఆధారంగా అన్నీ నమోదవుతాయని, అవకతవకలకు తావుండదని అధికారులు చెబుతున్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో గంపగుత్తగా ఆధార్ నెంబర్లు తీసుకువెళ్లి అప్లోడ్ చేయించడం వంటివి చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఫోన్ నెంబర్లకు వచ్చిన ఓటీపీని తీసుకున్న వారు బాధితుల్లో నగదు మొత్తం ఇవ్వకుండా çసగం మాత్రమే ఇచ్చి మిగతా సగం నేతలు, అధికార యంత్రాంగం మిలాఖతై పంచుకున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు దక్కిందే చాలనుకుంటూ అంతటితోనే సంతృప్తి చెందగా, తమ పొరుగు వారికి అంది తమకు అందకపోవడం.. పై అంతస్తుల్లోని వారికి అంది నీళ్లలో మునిగిన గ్రౌండ్‌ఫ్లోర్‌లోని వారికి అందకపోవడం, ఇంట్లో లేకపోయినా ఓనర్లకు అంది.. నష్టపోయిన కిరాయిదార్లకు అందకపోవడం వంటి ఘటనలు పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానికేతరులకు కూడా సాయమందిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈనేపథ్యంలో నగరవ్యాప్తంగా బాధితులు నిరసనకు దిగారు. సిబ్బంది మొత్తం బస్తీల్లోనే... తొలుత ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్న వారికి లక్షరూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్నవారికి రూ.50 వేల సాయంతో పాటు ఇళ్లు నీళ్లలో ఉన్న బస్తీలు, కాలనీల్లోని వారికి రూ.10 వేల వంతున అందజేయాలనుకున్నారు. అధికారులు సేకరించిన వివరాల మేరకు 1572 కాలనీలు, బస్తీలు ముంపునకు గురయ్యాయి. అక్కడ దాదాపు 3.92 లక్షల కుటుంబాలున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని రూ.400 కోట్లు నిధులు అందజేశారు. వాటిల్లో శుక్రవారం వరకు రూ.342 కోట్లు పంపిణీ జరిగింది. జీహెచ్ఎంసీ యంత్రాంగం మొత్తం ఈపనిలోనే నిమగ్నమవడంతో వాన అనంతరం జరగాల్సిన ఇతరత్రా అత్యవసర పనులకు ఆటంకం ఏర్పడింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందునే..సాయాన్ని ప్రస్తుతానికి నిలిపివేయమన్నారని సమాచారం. జోనల్ ఆఫీసు ఎదుట ధర్నా.. పాతబస్తీలోని ఉప్పుగూడ, రాజీవ్వగాంధీనగర్, శివాజీనగర్, సాయిబాబానగర్, క్రాంతినగర్, అరుంధతి కాలనీ, గౌలిపురా, పార్వతీనగర్, లలితాబాగ్లకు చెందిన వందలాది మంది మహిళలు ఉదయం 9 గంటలకే నర్కీపూల్బాగ్లోని జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. నిజమైన బాధితులకు కాకుండా..నచ్చిన వారికి పరిహారం అందించి అర్ధాంతరంగా పరిహారం ఎలా నిలిపివేస్తారంటూ ఆగ్రహించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోడ్డెక్కిన బాధితులు ఖైరతాబాద్ నియోజక వర్గ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమాయత్‌నగర డివిజన్లలోని ఏ గల్లీలో చూసినా రూ.పది వేల పంచాయితీనే కనిపించింది. బంజారాహిల్స్ రోడ్ నెం.11 ఉదయ్‌నగర్ బస్తీలో సుమారు ఎనిమిది గల్లీల్లో డబ్బులు అందలేదంటూ బడుగులు రోడ్డెక్కారు. ఫిలింనగర్‌లోని గౌతంనగర్ బస్తీలో సుమారు 280 మందిని సాయం కోసం ఎంపిక చేయగా 90 మందికి మాత్రమే సాయం అందింది. జూబ్లీ హిల్స్గురుబ్రహ్మనగర్ బస్తీతో పాటు వెంకటేశ్వరకాలనీ డివిజన్లోని దేవరకొండ బస్తీ, గౌరీశంకర్ నగర్ బస్తీ, బీఎస్ మక్తా తదితర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పంపిణీ జరగలేదని ఆందోళనలు కనిపించాయి. స్తంభించిన ట్రాఫిక్ ఎల్బీనగర్ జోనల్, సర్కిల్ కార్యాలయాలతోపాటు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు చౌరస్తాలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. సర్కిల్ కార్యాలయం ముందు సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించగా, చంపాపేట డివిజన్ పరిధిలోని కర్మన్‌ఘాట్ చౌరస్తాలో లింగోజిగూడ డివిజన్‌కు చెందిన తపోవన్ కాలనీ, శ్రీరాంనగర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. హస్తినాపురం డివిజన్లోని నందనవనం కాలనీలో మహిళలు భారీ సంఖ్యలో ధర్నా నిర్వహించారు. మన్సురాబాద్ చౌరస్తాలో సాయం కోసం మహిళలు రోడ్డుపైన ధర్నా నిర్వహించారు. మహిళల బైఠాయింపు కుత్బుల్లాపూర్ పరిధిలోని రాజీవ్‌గాంధీనగర్, సాయిబాబానగర్, సంజయ్‌గాంధీనగర్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు నర్సాపూర్ రాష్ట్ర రహదారిపై ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున మహిళలు భైఠాయించడంతో నర్సాపూర్రాష్ట్ర రహదారి ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది. మహిళలు శాపనార్ధాలు పెడుతూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. బన్సీలాల్‌పేట్ డివిజన్ బోలక్పూర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మహిళలు నిరసన వ్యక్తం చేశారు. బోలక్పూర్, ముషీరాబాద్ రహదారిపై బైఠాయించారు. అదేవిధంగా తార్నాక డివిజన్లోని మాణికేశ్వరినగర్, ఇందిరానగర్ బి కాలనీ, వినోబానగర్ కమ్యూనిటీహాలు ప్రాంతాల్లో వరద బాధితులు ధర్నాకు దిగారు. ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో బాధితులతో పాటు స్థానిక నేతలు ఆందోళనకు దిగారు. దాదాపు మూడు గంటల పాటు కార్యాలయం ఆవరణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్లమ్స్‌లోని పేదలకూ సాయమందాలని... నీట మునిగిన అన్ని ప్రాంతాల్లోని వారితోపాటు స్లమ్స్, పేదలెక్కువగా ఉండే ప్రాంతాల్లో వర్షాల వల్ల బాగా దెబ్బతిన్న వారికి కూడా సాయం అందజేయాల్సిందిగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రజాప్రతినిధులను, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఆదేశించింది. స్థానికంగా అవగాహన ఉన్న వారుంటే అనర్హులకు సాయం అందకుండా చూడవచ్చని, ఇతరత్రా పలు విధాలుగా ఉపయోగపడతారని ప్రభుత్వం సూచించింది. – లోకేశ్‌కుమార్, కమిషనర్, జీహెచ్ఎంసీ తీవ్ర నష్టమెక్కడో తెలుసు.. పల్లెచెరువు, గుర్రం చెరువు, అప్పా చెరువులు తెగిపోయిన ప్రాంతాల్లోని పూల్‌బాగ్, అల్‌జుబేల్ కాలనీ, ఘాజి మిల్లత్ కాలనీ, బాలాపూర్, హఫీజ్‌బాబానగర్, గగన్‌పహాడ్‌లో నష్టం భారీగా జరిగింది. ఎల్బీనగర్ జోన్‌లోని చెరువులు పొంగిపొర్లి నాగోల్, బండ్లగూడ, మన్సూరాబాద్, లింగోజిగూడ, సాగర్‌రింగ్‌రోడ్, చంపాపేటలు నీట మునిగాయి. మీర్‌పేట, బైరామల్‌గూడ చెరువుల నాలాల ఉధృతితో ఉదయ్‌నగర్, మల్రెడ్డి రంగారెడ్డి నగర్, తపోవన్ కాలనీల్లో వేల ఇళ్లు నీటమునిగాయి. టోలిచోకి ప్రాంతంలోని నదీమ్ కాలనీ, విరాసత్ నగర్, బాల్‌రెడ్డి నగర్, జమాలికుంట, నీరజకాలనీ, వలీకాలనీ, అల్హస్నాత్కాలనీ తదితర ప్రాంతాలు ముంపు వల్ల తీవ్రంగా దెబ్బతినడం తెలిసిందే. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అందరికీ సాయం అందకపోవడంతో పాటు తక్కువ నష్టపోయిన ప్రాంతాల్లోని వారికి అందడం విమర్శలకు తావిచ్చింది. ఆ ప్రాంతాల్లో వారం పదిరోజుల వరకు ఇళ్లలో రోడ్లపై నీరు నిలిచింది. బోట్లతో సహాయక కార్యక్రమాలు చేపట్టడం తెలిసిందే. ఇళ్లలో వర్షపు నీరు చేరి ఒక్కో ఇంట్లో లక్షలాది రూపాయల విలువైన వస్తువులు పాడైపోయాయి. నష్టపోయిన వారికీ, పేదలకూ సాయం అందజేసేందుకు ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించినప్పటికీ, రాజకీయ జోక్యం కారణంగానే అభాసుపాలైందని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాధితులందరికీ సాయం అందజేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో ఈ సమస్యకు తెర పడగలదని భావిస్తున్నారు. -
కృష్ణమ్మ వరద నష్టపరిహారం రూ.11.11కోట్లు
కృష్ణా వరదల వల్ల నష్టపోయిన అన్నదాతలను ఉదారంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్కేల్ ఆఫ్ రిలీఫ్ కంటే 15శాతం అదనంగా పరిహారం ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సాధ్యమైనంత త్వరగా రైతుల ఖాతాల్లోకి ఈ మొత్తాన్ని జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాక్షి, అమరావతి : పదేళ్ల తర్వాత కృష్ణా నదికి వచ్చిన వరదలతో జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆగస్టు 13వ తేదీన ప్రారంభమైన వరదలు ఏకంగా వారం రోజుల పాటు కొనసాగడంతో నదీ పరీవాహక ప్రాంతంలోని 14 మండలాల్లో వేలాది మంది రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. వరదల అనంతరం అధికారులు దాదాపు 15 రోజుల పాటు ప్రత్యేక బృందాలతో క్షేత్ర స్థాయి పరిశీలన జరిపి.. 33 శాతానికి మించి వాటిల్లిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని తుది అంచనాలను రూపొందించారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 11 మండలాల్లో 2,423 మంది రైతులకు చెందిన 1,426 హెక్టార్లలో రూ.2.06 కోట్ల విలువైన వ్యవసాయ పంటలు దెబ్బతినగా, 14 మండలాల్లో 7,051 మంది రైతులకు చెందిన 4021.872 హెక్టార్లలో రూ.7.60కోట్ల విలువైన ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టుగా లెక్కతేల్చారు. పత్తికి పెద్ద దెబ్బ వ్యవసాయ పంటల్లో పత్తికే అపార నష్టం వాటిల్లింది. చందర్లపాడు, జగ్గయ్యపేట, కంచికచర్ల మండలాల్లో 960.596 హెక్టార్లలో పత్తిపంట దెబ్బతిన్నట్టుగా అధికారులు లెక్క తేల్చారు. ఆ తర్వాత పెనుమలూరు, మోపిదేవి, కంకిపాడు, తొట్లవల్లూరు మండలాల్లో 141.811 హెక్టార్లలో చెరకు, 11 మండలాల్లో 134.986 హెక్టార్లలో వరి, 82.369 హెక్టార్లలో మొక్కజొన్న, 67.971 హెక్టార్లలో మినుము, 18.438 హెక్టార్లలో పెసలు, 12.339హెక్టార్లలో ఉలవ పంట దెబ్బ తిన్నట్టుగా గుర్తించారు. మరో ఐదు రకాల పంటలకు స్వల్ప నష్టం వాటిల్లింది. కాగా స్కేల్ ఆఫ్ రిలీఫ్ కింద ఈ పంటలకు రూ.2కోట్ల 6లక్షల 38వేల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని అంచనావేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం అదనంగా ఇవ్వనున్నట్టుగా ప్రకటించడంతో ఆ మేరకు రూ.2 కోట్ల 37 లక్షల 33వేల 700లు చెల్లించాలని లెక్క కట్టారు. ఉద్యాన పంటలకు అపార నష్టం వ్యవసాయ పంటల కంటే ఉద్యానç పంటలకే అపార నష్టం వాటిల్లింది. తోట్లవల్లూరు, మోపిదేవి, చల్లపల్లి, పమిడిముక్కల, ఇబ్రహీంపట్నం, పెనుమలూరుతో సహా ఇతర మండలాల్లో 843.682 హెక్టార్లలో అరటి, తోట్లవల్లూరు, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, పెనుమలూరు, కంచికచర్ల తదితర మండలాలో 1,665.908 హెక్టార్లలో పసువు.. తోట్లవల్లూరు, అవనిగడ్డ, చల్లపల్లి, పెనుమలూరు మండలాల్లో 678.514 హెక్టార్లలో కంద పంట.. అవనిగడ్డ, మోపిదేవి, తోట్లవల్లూరు, కంచికచర్ల మండలాల్లో 5,84,312 హెక్టార్లలో కూరగాయల పంటలు.. తోట్లవల్లూరు, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, పమిడిముక్కల, కంచికచర్ల మండలాల్లో 89.6 హెక్టార్లలో బొబ్బాయి.. చందర్లపాడు, కంచికచర్ల మండలాల్లో 89.648 హెక్టార్లలో మిరప.. తోట్లవల్లూరు, అవనిగడ్డ, పెనుమలూరు, కంచికచర్ల మండలాల్లో 14.59 హెక్టార్లలో జామ.. తోట్లవల్లూరు, కంకిపాడు, పెనుమలూరు మండలాల్లో 2.4 హెక్టార్లలో తమలపాకు.. తోట్లవల్లూరు, అవనిగడ్డ పెనుమలూరు మండలాల్లో 2.4 హెక్టార్లలో మామిడి పంటలు దెబ్బతిన్నాయి. -
గోదావరి ఉగ్రరూపం
-
నష్టపోయిన పంటలకు అదనంగా 15 శాతం సాయం
సాక్షి, అమరావతి: వరదలు, భారీ వర్షాలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పంటలకు ప్రస్తుతం ఇస్తున్న పరిహారానికి అదనంగా 15 శాతం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. కృష్ణా, గోదావరి తదితర నదులకు వచ్చిన వరదల వల్ల ఆహార, ఉద్యాన, వాణిజ్య పంటలకు జరిగిన నష్టం, తీసుకున్న చర్యలు, అందించాల్సిన సాయం తదితర అంశాలపై మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు. వరదల కారణంగా నష్టపోయిన వివరాలను సమీక్ష ప్రారంభంలో మంత్రులు, వ్యవసాయ, ఉద్యాన సహా వివిధ శాఖల అధికారులు సీఎంకు నివేదించారు. కృష్ణా నది వరదలతో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం బాగా దెబ్బతిందని, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, పామర్రు, పెనమలూరులో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. విజయవాడ, మరికొన్ని ప్రాంతాల్లో పంట ముంపు బారిన పడిందని అధికారులు నివేదించారు. సాయం నేరుగా రైతులకు మాత్రమే అందాలి పంట నష్టాన్ని బ్యాంకులు మినహాయించుకోకుండా రైతుల అన్ ఇన్‌కంబర్డ్ ఖాతాలకే ఇన్పుట్ సబ్సిడీ వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రస్తుతం వివిధ పంటలకు ఇస్తున్న పరిహారాన్ని (తక్షణ సాయాన్ని) 15 శాతం పెంచాలని ఆదేశించారు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమని నిరూపించాలన్నారు. భూసార పరీక్షలు జరగాలని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. వీటి నాణ్యతను గుర్తించడానికి ప్రతి నియోజకవర్గంలో పరీక్ష కేంద్రాలు (ల్యాబ్స్) ఏర్పాటు చేయాలని, గ్రామ సచివాలయాల్లో కౌలు రైతులకు కార్డులు ఇవ్వాలని, కౌలు రైతుల చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. దీనిపై వలంటీర్లకు ముందుగా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. కల్తీ, నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమాలన్నీ వచ్చే నాలుగైదు నెలల్లో కార్యరూపం దాల్చాలన్నారు. పంటల సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణమే సలహాలు, పరిష్కారాల కోసం కాల్‌సెంటర్, ఒక యాప్‌ను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్, మోపిదేవి వెంకటరమణ, పేర్నినాని, మేకతోటి సుచరిత, కొడాలి నాని, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మధుసూదన్‌రెడ్డి, హెచ్.అరుణ్‌కుమార్, చిరంజీవి చౌదరి, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ధనుంజయరెడ్డి, ప్రకృతి విపత్తుల విభాగం అధికారులు పాల్గొన్నారు. సబ్సిడీపై మినుములు, పెసలు రాష్ట్రంలో తొలిసారిగా మినుములు, పెసలు పూర్తి సబ్సిడీపై రైతులకు సరఫరా చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యాన పంటలకు సుమారు రూ.228 కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. రైతులకు నిరంతరం సేవలందించే కాల్ సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా, వరద ప్రాంతాల్లో సబ్సిడీపై సరఫరా చేసే మినుము, పెసర, వరి వంగడాలను ఇప్పటికే ఆయా ప్రాంతాలకు పంపామని వ్యవసాయాధికారి అరుణ్‌కుమార్ వివరించారు. -
వరద తగ్గింది.. బురద మిగిలింది !
-
ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
-
19, 20 తేదీల్లో కేంద్ర బృందం పర్యటన
శ్రీకాకుళంకలెక్టరేట్,న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలు, ప్రభుత్వ ఆస్తులను పరిశీలించేందుకు.. నష్టాలను అంచనా వేసేందు కు ఈ నెల 19, 20 తేదీల్లో కేంద్ర బృందం జిల్లాలో పర్యటించనుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి శంభుసింగ్ నేతృత్వంలో హోం, అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్, ప్లానింగ్ కమిషన్, రోడ్స్ అండ్ హైవేస్, వాట ర్‌సప్లై, ఫైనాన్స్ శాఖలకు చెందిన ఐఏఎస్ అధికారులు ఆర్.పి.సింగ్, వి.కె.భట్ల, కె.రాంవర్మ, ఎ.చంద్రశేఖర్, ఎ.కృష్ణప్రసాద్, పి.జి.ఎస్.రావులతో కూడిన ఈ బృం దం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. ఇదీ షెడ్యూల్ 19వ తేదీ: మధ్యాహ్నం 3 గంటలకు రణస్థలం మండలం బంటుపల్లిలో దెబ్బతిన్న చెరువులు, కాలువలు, రోడ్లను పరిశీలిస్తుంది. 3.30 గంటలకు లావేరు మండలం ఆదపాక, బుడుమూరుల్లో జరిగిన పంట నష్టం, చెరువులకు పడిన గండ్లు, దెబ్బతిన్న ఇళ్లను పరిశీలిస్తుంది. అనంతరం బుడుమూరు ఎస్సీ కాలనీని సందర్శిస్తుంది. 4.10 గంటలకు పొందూరు మండలం లోలుగులోని కుమ్మరి గుంట చెరువు, ఇరిగేషన్ కాలువలకు పడిన గండ్లను పరిశీలిస్తుంది. అనంతరం ఎచ్చెర్ల టీటీడీసీలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకిస్తుంది. అనంతరం ఫరీద్‌పేట వద్ద నాగావళి కుడి కాలువ గట్టుకు పడిన గండిని పరిశీలించి ఆక్కడ వరి పంటకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తుంది. రాత్రికి శ్రీకాకుళం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేస్తుంది. 20వ తేదీ: ఉదయం 10.30 గంటలకు సోంపేట మండలం ఇస్కలపాలెంలో పర్యటిస్తుంది. అనంతరం కవిటి మండలం రాజపురం ప్రాంతంలో కొబ్బరి తోటలకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తుంది. తర్వాత పలాస మండలం సున్నాదేవి గ్రామంలో పర్యటిస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు పలాస నుంచి బయలుదేరి కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, బోరుభద్ర మీదుగా పోలాకి మండలం డీఎల్ పురం, సుసరాం వరకు వరి పంటకు జరిగిన నష్టాన్ని, వంశధార కాలువలకు పడిన గండ్లను పరిశీలిస్తుంది. అనంతరం నరసన్నపేట మండలం కోమర్తిలో అరటి తోటలకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఎచ్చెర్ల మండలం ముద్దాడకు వెళ్లి అక్కడ వరి పంటకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తుంది. అనంతరం కేంద్ర బృందం విశాఖపట్నం వెళుతుంది.