అన్నమయ్య డ్యామ్‌ను పరిశీలిస్తున్న సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా
రాజంపేట: వైఎస్సార్ జిల్లా చెయ్యేరు వరద బాధితులపై కేంద్రప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. శుక్రవారం పులపుత్తూరు, మందపల్లెల్లో ఆయన పర్యటించారు. పులపుత్తూరులో మీడియాతో మాట్లాడారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కేంద్రమంత్రులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బాధితులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. బాధితులను ఆదుకోవాలని ప్రధాని మోదీ, అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామన్నారు.
తుపాను బాధితులకు సాయం చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. పునరావాసం, పరిహారం లాంటి విషయంలో ఉదారంగా వ్యవహరించాలని కేంద్రాన్ని కోరారు. వరద ప్రళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఇక్కడ ఇంత విపత్తు జరిగినా కేంద్ర మంత్రులు కన్నెత్తి చూడలేదని విమర్శించారు. అనంతరం నేతలు అన్నమయ్య డ్యామ్‌ను పరిశీలించారు. వరద పీడిత ప్రాంతాల్లో సీపీఐ తరఫున బాధితులకు బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేశారు. కాగా బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తమైంది.
Comments
Please login to add a commentAdd a comment