ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌లో కోతకు గురైన రహదారి
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వాగులు, ఉప నదులు పొంగిపొర్లడంతో పెద్ద సంఖ్యలో రోడ్లు కోతకు గురయ్యాయి. కల్వర్టులు, అప్రోచ్ రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. గోదావరి వరదలతో పరీవాహక ప్రాంతం వెంబడి రహదా రులు దెబ్బతిన్నాయి. జాతీయ రహదారులు కూడా కోతకు గురయ్యాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నష్టం ఎక్కువగా ఉంది. చాలా చోట్ల రోడ్లకు మరమ్మతులు చేయాల్సి ఉంది.
మంచిర్యాల జిల్లా తోటపల్లి మండలంలో దెబ్బతిన్న రోడ్డు
గోదావరి పరీవాహకం వెంట..
కరీంనగర్ జిల్లాలో 40 ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతుల కోసం అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. పెద్దపల్లి జిల్లాలో 42 కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 56 చోట్ల, జగిత్యాల జిల్లాలో 32 చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలకుతోడు గోదావరి వరదలతో భారీ ఎత్తున రోడ్లు, కల్వర్టులు ధ్వంసమయ్యాయి. నిర్మల్ జిల్లాలో 40 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, వంతెనల మరమ్మతులకు రూ.18 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఆదిలాబాద్ జిల్లాలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం రూ.15 కోట్ల మేర అవసరమని అధికారులు అంచనా వేశారు. మంచిర్యాల జిల్లాలో గోదావరి తీర ప్రాంతాలతోపాటు మంచిర్యాల పట్టణంలోనూ రోడ్లు దెబ్బతిన్నాయి.
చదవండి: గోదావరి మహోగ్ర రూపం.. రంగంలోకి హెలికాప్టర్లు.. సైన్యం
Comments
Please login to add a commentAdd a comment