పళ్లిపట్టు, న్యూస్‌లైన్:గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. వేడుకల్లో భాగంగా కాంచీపురం జిల్లా నందంపాక్కం ప్రాంతంలో డీఎంకే ఆధ్వర్యంలో సమత్తువ పొంగల్ వేడుకలు నిర్వహించారు. ఇందులో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు పాల్గొని సంక్రాంతి వేడుకులను ఘనంగా జరుపుకున్నారు. వేడుకల్లో ముఖ్యఅతిథిగా డీఎంకే కోశాధికారి స్టాలిన్ తన కుటుంబంతో పాల్గొని సమత్తువ పొంగల్‌ను కోలాహలంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రతి తమిళుడు జరుపుకునే పండుగ పొంగల్ అని అన్నారు. అనంతరం పేదలకు సహయకాలు పంపిణీ చేశారు. వేడుకల్లో భారీ సంఖ్యలో అన్ని మతాల సభ్యులు పాల్గొని పొంగల్ వేడుకలు విజయవంతం చేశారు. పళ్లిపట్టు, ఆర్‌కే.పేట ప్రాంతాల్లోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు సంక్రాంతి పండగ సందర్భంగా కళకళలాడాయి. జనం పొంగళ్లు పెట్టి పూజలు చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ప్రతి ఇంటి ముందు వేసిన రంగురంగుల రంగోలీలు కనువిందు చేశాయి. పొంగళ్లు పెట్టి వేడుకలు జరుపుకున్నారు.