భర్తతో గొడవల కారణంగా పుట్టింటికి.. మద్యం మత్తులో | Husband Brutally Murdered his Wife in Pallipattu Tamil Nadu | Sakshi
Sakshi News home page

భర్తతో గొడవల కారణంగా పుట్టింటికి.. మద్యం మత్తులో

Published Tue, Dec 28 2021 7:24 AM | Last Updated on Tue, Dec 28 2021 7:24 AM

Husband Brutally Murdered his Wife in Pallipattu Tamil Nadu - Sakshi

చెన్నై(పళ్ళిపట్టు): మద్యం మత్తులో భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్తను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆర్‌.కే పేట సమీపం బాలాపురానికి చెందిన తమిళ్‌మణి (42) తాపీమేస్త్రి. అతని భార్య మంగళ. ఈ దంపతులకు శరవణన్‌ (14), ప్రతీప్‌ (12) అనే కుమారులున్నారు. భర్తతో గొడవల కారణంగా.. అయ్యనేరిలోని పుట్టింటికి వెళ్లి అక్కడే టైలర్‌ షాపు నిర్వహిస్తోంది. భార్యను కాపురానికి రావాలని అయ్యనేరికి వెళ్లి తమిళ్‌మణి గొడవ పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం మద్యం మత్తులో టైలర్‌ దుకాణం వద్దకు వెళ్లిన తమిళ్‌మణి భార్య మంగళపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. 

చదవండి: (ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement