Thiruttani
-
ప్రేమ పేరుతో దగ్గరై మూడు సార్లు అబార్షన్.. చివరకు పెళ్లి..
సాక్షి, తిరుత్తణి (చెన్నై): యువతిని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన యువకుడిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. తిరుత్తణి సమీపంలోని బుచ్చిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన బాలనాగమ్మ(29) తిరుత్తణి పోలీస్‌స్టేషన్‌లో ఫ్రెండ్లీ పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పళ్లిపట్టు మండలం ఎగువ నెడిగళ్లు కాలనీకి చెందిన ఆదిమూలం(30)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకుంటానని నమ్మించడంతో శారీరకంగా దగ్గరయ్యారు. ఇప్పుడే పెళ్లి వద్దని చెప్పడంతో అతని మాటలు నమ్మిన బాలనాగమ్మ మూడుసార్లు అబార్షన్ చేయించుకుంది. చివరికి తనకు వేరొక అమ్మాయితో పెళ్లి కుదిరిందని చెప్పాడు. దీంతో న్యాయం కోసం తిరువళ్లూరు ఎస్పీ కల్యాణ్‌ను ఆశ్రయించింది. ఎస్పీ ఆదేశాల మేరకు తిరుత్తణి డీఎస్పీ విగ్నేష్ సూచనలతో తిరుత్తణి మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం సాయంత్రం ఇరు కుటుంబాలను పిలిపించారు. పోలీస్‌స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించిన యువతి, బంధువులు చదవండి: (ఆ యువతితో ఉన్న 10 రోజులు మరుపురానివి.. తల్లిదండ్రులు..) ఈ క్రమంలో ఆ యువకుడు తాను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పడంతో యువతి బంధువులతో కలిసి అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. తిరుత్తణి–పొదటూరుపేట రోడ్డులో వాహనాలు ఆగిపోవడంతో డీఎస్పీ ఇరు వర్గాలతో చర్చించారు. అయినా పెళ్లికి యువకుడు అనాసక్తి వ్యక్తం చేయడంతో అతన్ని న్యాయస్థానంలో హజరుపరిచి జైలుకు తరలించారు. యువతిని కించపరిచేలా వ్యవహరించిన డీఎస్పీ తనకు న్యాయం చేయాలని నిరసన తెలిపిన యువతిని డీఎస్పీ కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. ఉన్నత పదవుల్లో ఉంటూ బాధితురాలికి న్యాయం చేయాల్సిన అధికారి ఏకవచనంలో అసభ్య పదజాలంతో మాట్లాడడం విమర్శలకు దారి తీసింది. -
ఆ నిండు ప్రాణాలు పోవడానికి కారణం అదే!
తిరుత్తణి: బైకును, కారు ఢీకొన్న ప్రమాదంలో తండ్రీ కొడుకు ప్రాణాలు కోల్పోయిన ఘటన తిరుత్తణి శివారులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. తిరుత్తణి సమీపంలోని మురుక్కంపట్టు గ్రామానికి చెందిన లోకనాథన్(42) ప్రభుత్వ బస్సు కండెక్టర్. మంగళవారం రాత్రి తిరుత్తణి నుంచి గ్రామానికి బైకులో తండ్రి దేశప్పరెడ్డితో కలిసి వెళ్తుండగా చెన్నై – తిరుపతి జాతీయ రహదారి మురుక్కంపట్టు వద్ద తిరుపతి నుంచి తిరుత్తణి వైపు వేగంగా వెళ్తున్న కారు బైకును ఢీకొంది. ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న తండ్రీ కొడుకులిద్దరూ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కారు డ్రైవర్ పరారయ్యాడు. అయితే తమ గ్రామం వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోక పోవడంతోనే రెండు ప్రాణాలు పోయాయని, వెంటనే కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేయాలని గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. దీంతో చెన్నై–తిరుపతి జాతీయ రహదారిలో దాదాపు రెండు గంటల పాటు వాహన రాకపోకలు స్తంభించాయి. పోలీసుల హామీతో గ్రామస్తులు ధర్నా విరమించారు. -
పెళ్లి చేసుకున్న స్టార్ కమెడియన్..
తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు పెళ్లి చేసుకున్నారు. తిరుత్తణిలోని మురుగన్ ఆలయంలో బుధవారం ఉదయం మంజు భార్గవితో ఆయన వివాహం జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతోపాటు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే సినీ పరిశ్రమలోని తన సన్నిహితుల కోసం యోగి త్వరలోనే చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. కాగా, యోగి, భార్గవిలది పెద్దలు కుదిర్చిన వివాహమని తెలుస్తోంది. యోగికి కమెడీయన్‌గా తమిళనాట విశేషమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. మంచి కామెడీ టైమింగ్‌తో తనకంటూ స్పెషల్‌గా అభిమానులను ఏర్పరుచుకున్నారు. పలు డబ్బింగ్ సినిమాల ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచతమే. ఇటీవల రజనీకాంత్ దర్బార్ చిత్రంలో యోగి ముఖ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధనుష్ హీరో తెరకెక్కుతున్న కర్ణన్ చిత్రంలో యోగి నటిస్తున్నారు. అలాగే పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. -
ప్రాణం తీసిన టిక్‌టాక్
సాక్షి, చెన్నై : టిక్‌టాక్ సరదా యువకుడి ప్రాణాలు తీసిన ఘటన తిరుత్తణి ప్రాంతంలో చోటుచేసుకుంది. తిరుత్తణి శివారులోని కార్తికేయపురం చెరువుకట్ట వద్ద గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని మంగళవారం పోలీసులు స్వాధీనం చేశారు. చెరువు పక్కనే ఉన్న బైకును సైతం స్వాధీనం చేశారు. సంఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో మృతి చెందిన యువకుడు తాళవేడు గ్రామానికి చెందిన కన్నియప్పన్ అనే వ్యక్తి కుమారుడు వెంకటరామన్(30) అని తెలిసింది. వెంకట్రామన్ ఫిబ్రవరి 21న తన స్నేహితుడితో కలిసి టిక్‌టాక్ వీడియోలో అదే ప్రాంతంలోని ఒక సామాజిక వర్గాన్ని హేళన చేసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు. అది అప్పట్లో వైరల్‌గా మారడంతో సంబంధిత వర్గం వారు ధర్నా చేపట్టారు. పైగా వెంకట్రామన్, విజి అనే యువకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల అరెస్ట్‌కు భయపడి పరారైన స్నేహితులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని విజిని వెంకట్రామన్ హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. హత్య, టిక్‌టాక్ వీడియో వైరల్, కేసులు పెండింగ్‌లో ఉన్నందున ఈ రెండు కేసుల్లో శిక్ష ఖరాకు కానున్న నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న వెంకట్రామన్ మంగళవారం పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. టిక్‌టాక్ అత్యుత్యాహం స్నేహితుడిని హత్యతో ప్రారంభమై తనను తానే ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకెళ్లడం గమనార్హం. -
హరోం..హర..
-
సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో చోరీ
పళ్లిపట్టు, న్యూస్‌లైన్ : అరక్కోణం పట్టణంలోని నివాసముంటున్న తిరుత్తణి సబ్‌రిజిస్ట్రార్ ఇంట్లో చోరీ జరి గింది. గురువారం మధ్యాహ్నం గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బంగారు నగలు, నగదును చోరీ చేశారు. తిరుత్తణి సబ్‌రిస్ట్రార్ రాజేంద్రన్ అరక్కో ణం మాధవన్ నగర్లో నివాసముంటున్నారు. గురువారం ఆయన విధులకు వెళ్లారు. ఆయన భార్య మీనాక్షి ఉదయం పదిగంటలకు పక్కింటికి వెళ్లారు. రెండు గంటలు తర్వాత ఆమె ఇంటికి వచ్చారు. ఆసమ యంలో ఇంటి వెనుక తలుపులు తీసి ఉన్నాయి. గదిలో బీరువా తాళాలు పగులగొట్టి అందులోని వస్తువులు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. బీరువాలో 13 సవర్ల బంగారు నగలు,కేజీ వెండి వస్తువులు, రూ. 3లక్ష లు నగదు చోరీ అయ్యాయి. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు తెలిపారు. వెంటనే సబ్‌రిస్ట్రార్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. క్లూస్ టీం,పోలీసులు పరిశీలించారు. పట్ట పగలే చోరీ జరగడం కలకలం రేపింది. బంగారు నగల అపహరణ తిరుత్తణి, న్యూస్‌లైన్ : తిరుత్తణి అరక్కోణం రోడ్డులోని జెజెనగర్లో నివాసముంటున్న లోకనాథన్ ఇంట్లో చోరీ జరిగింది. చెన్నైలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఈయన జమున బుధవారం మధ్యాహ్నం స్కూలులో చదువుకునే తన పిల్లలకు అన్నం తీసుకుని వెళ్లింది. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి దూరి తొమ్మిది సవర్ల బంగారు నగలను, అరకిలో వెండి వస్తువులు అపహరించుకుపోయారు. ఈ విషయమై తిరుత్తణి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.