పెళ్లి చేసుకున్న స్టార్‌ కమెడియన్‌.. | Yogi Babu Ties The Knot With Manju Bhargavi At Murugan Temple In Thiruttani | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకున్న స్టార్‌ కమెడియన్‌..

Feb 5 2020 10:37 AM | Updated on Feb 5 2020 11:22 AM

Yogi Babu Ties The Knot With Manju Bhargavi At Murugan Temple In Thiruttani - Sakshi

తమిళ స్టార్‌ కమెడియన్‌ యోగిబాబు పెళ్లి చేసుకున్నారు. తిరుత్తణిలోని మురుగన్‌ ఆలయంలో బుధవారం ఉదయం మంజు భార్గవితో ఆయన వివాహం జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతోపాటు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే సినీ పరిశ్రమలోని తన సన్నిహితుల కోసం యోగి త్వరలోనే చెన్నైలో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. కాగా, యోగి, భార్గవిలది పెద్దలు కుదిర్చిన వివాహమని తెలుస్తోంది.

యోగికి కమెడీయన్‌గా తమిళనాట విశేషమైన క్రేజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. మంచి కామెడీ టైమింగ్‌తో తనకంటూ స్పెషల్‌గా అభిమానులను ఏర్పరుచుకున్నారు. పలు డబ్బింగ్‌ సినిమాల ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచతమే. ఇటీవల రజనీకాంత్‌ దర్బార్‌ చిత్రంలో యోగి ముఖ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో ధనుష్‌ హీరో తెరకెక్కుతున్న కర్ణన్‌ చిత్రంలో యోగి నటిస్తున్నారు. అలాగే పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement