ప్రాణాలు కోల్పోయిన వెంకట్రామన్ (ఫైల్)
సాక్షి, చెన్నై : టిక్‌టాక్ సరదా యువకుడి ప్రాణాలు తీసిన ఘటన తిరుత్తణి ప్రాంతంలో చోటుచేసుకుంది. తిరుత్తణి శివారులోని కార్తికేయపురం చెరువుకట్ట వద్ద గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని మంగళవారం పోలీసులు స్వాధీనం చేశారు. చెరువు పక్కనే ఉన్న బైకును సైతం స్వాధీనం చేశారు. సంఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో మృతి చెందిన యువకుడు తాళవేడు గ్రామానికి చెందిన కన్నియప్పన్ అనే వ్యక్తి కుమారుడు వెంకటరామన్(30) అని తెలిసింది. వెంకట్రామన్ ఫిబ్రవరి 21న తన స్నేహితుడితో కలిసి టిక్‌టాక్ వీడియోలో అదే ప్రాంతంలోని ఒక సామాజిక వర్గాన్ని హేళన చేసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశాడు. అది అప్పట్లో వైరల్‌గా మారడంతో సంబంధిత వర్గం వారు ధర్నా చేపట్టారు.
పైగా వెంకట్రామన్, విజి అనే యువకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల అరెస్ట్‌కు భయపడి పరారైన స్నేహితులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని విజిని వెంకట్రామన్ హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. హత్య, టిక్‌టాక్ వీడియో వైరల్, కేసులు పెండింగ్‌లో ఉన్నందున ఈ రెండు కేసుల్లో శిక్ష ఖరాకు కానున్న నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న వెంకట్రామన్ మంగళవారం పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. టిక్‌టాక్ అత్యుత్యాహం స్నేహితుడిని హత్యతో ప్రారంభమై తనను తానే ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకెళ్లడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment