నెల్లూరు: టిక్‌టాక్‌లో స్టార్‌గా ఉన్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఓ అమ్మాయి విషయంలో జరిగిన సంఘటనలే అతడి ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా రంగనాయకుపేటకు చెందిన షేక్ రఫీ టిక్‌టాక్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. రోజూ టిక్‌టాక్‌లో వీడియోలు అప్‌లోడ్ చేసి నెటిజన్లు.. ఫాలోవర్లను ఆకట్టుకునేవాడు. అయితే అతడి స్నేహితుడితో జరిగిన వివాదంలో మనస్ఫార్థానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు.
నెల్లూరులో కెమెరామెన్‌గా పని చేస్తున్న రఫీ టిక్‌టాక్ వీడియోలు కూడా చేస్తూండేవాడు. అయితే అతడి స్నేహితుడు ముస్తఫా ప్రేయసి రఫీతో చనువుగా ఉండేది. రఫీతో ప్రేమగా ఉండటం.. సన్నిహితంగా ఉండటంతో తట్టుకోలేకపోయాడు. ఈ విషయమై ముస్తాఫా ఆగ్రహం వ్యక్తం చేశాడు. రఫీపై దాడి చేయించాడు. ప్రణాళిక ప్రకారం స్నేహితులతో రఫీపై దాడి చేయించాడు. తీవ్ర గాయాల పాలైన రఫీని తండ్రి రియాజ్ ఆస్పత్రిలో చేర్పించాడు. అనంతరం పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు.
అయితే ఈ విషయంలో రఫీపై వేధింపులు తీవ్రమయ్యాయి. ఈ సమయంలో ఆ వేధింపులు తట్టుకోలేక జనవరి 22వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడిన రఫీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయమై తండ్రి రియాజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వేధింపుల కారణంగా తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. దీనిక కారణమైన ముస్తాఫాపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment