పోలీసుల అదుపులో గుట్ట సబ్ రిజిస్ట్రార్.
నయీమ్ అక్రమ రిజిస్ట్రేషన్లలో పాత్రపై విచారణ
భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు అక్రమ భూ రిజిస్ట్రేషన్లు చేయడానికి సహకరించాడన్న ఆరోపణలతో నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ ఎండీ వహీద్‌ను సిట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ నుంచి అనుమతి తీసుకున్నట్టు తెలిసింది. నయీ మ్ అతని అనుచరులకు అనుకూలంగా రిజి స్ట్రేషన్లు చేయడంలో వహీద్ పాత్రపై అనుమానాలున్నారుు. భువనగిరి, మోత్కూరు, యాదగిరిగుట్ట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వహీద్ వివిధ హోదాల్లో పనిచేస్తూ నయీమ్ అనుచరుల అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించాడని ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో అతడిపై వచ్చిన అభియోగాల్ని విచారించడానికి సిట్ రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖలు రాసింది. పూర్తి సమాచారంతో విచారణకు రావాలన్న సిట్ ఆదేశంతో రికార్డులను తీసుకుని ఆయన పోలీసులకు లొంగి పోయారు. దీంతో సిట్, స్థానిక పోలీసులు వహీద్‌ను సోమవారం నుంచి విచారిస్తున్నారు. బక్రీద్ పండుగ ప్రార్థనల కోసం మంగళవారం ఉదయం పోలీస్ ఎస్కార్ట్‌తో అతడిని వదిలిపెట్టారు. తిరిగి అదుపులోకి తీసుకుని నల్లగొండకు తరలించారు.
వెలుగు చూస్తున్న వాస్తవాలు
నయీమ్ ప్రధాన నేరాల్లో ఒకటైన భూ రిజిస్ట్రేషన్లలో పలు అంశాలు వెలుగు చూస్తున్నారుు. విశ్వసనీయంగా తెలిసిన వివరాల ప్రకారం.. డాక్యుమెంట్ రైటర్ సహకారంతో భూముల క్రయవిక్రయ వివరాలను ఎప్పటికప్పుడు నయీమ్ అనుచరులకు తెలపడం, వాటి మార్కెట్ విలువ వివరాలు, ఎకరాల్లో, ప్లాట్లలో కొన్న భూముల యజమానుల వివరాలు అందజేయడం వంటి విషయాలపై ఆరోపణలున్నాయి.
దీంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయడంలో వహీద్ సహకరించాడని రికార్డుల్లో తేలినట్లు సమాచారం. ఉన్నతాధికారులు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయకుంటే వార్ని నయాన్నో, భయాన్నో బెదిరించి పను లు పూర్తి చేరుుంచినట్టు తెలుస్తోంది. కాగా నయీమ్ కుటుంబసభ్యులను సిట్ పోలీ స్‌లు విచారిస్తున్నారు. భువనగిరి పోలీస్ స్టేషన్‌కు వారిని రప్పించినట్టు తెలుస్తోంది.