రిజిస్ట్రేషన్ ఆదాయ లక్ష్యం రూ.4 వేల కోట్లు
- సబ్ రిజిస్ట్రార్ల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఈ ఏడాది రూ.4వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రజలకు మెరుగైన సేవలందించడం ద్వారా లక్ష్యా న్ని చేరుకోవాలని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ సబ్- రిజిస్ట్రార్లను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర సబ్-రిజిస్ట్రార్ల సంఘం రూపొందించిన కరదీపికను బుధవారం ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఈ ఆర్థిక సంవత్సరంలోనే సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపా రు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద బ్రోకర్లను నియంత్రించి, ప్రజలకు అవసరమైన సమాచారం అందించేందు కు ‘హెల్ప్’ డెస్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.