
అపాయింట్‌మెంట్‌పై రిజిస్ట్రేషన్
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ
హైదరాబాద్: భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఇకపై ఒకరోజు ముందుగా సబ్ రిజిస్ట్రార్ అపాయింట్‌మెంట్ తీసుకోవాలి... మరుసటి రోజు సరిగ్గా సమయానికి వెళితే క్షణాల్లో రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకుని రావచ్చు... రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖల మంత్రి. ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మధ్యవర్తులను నియంత్రించేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నదని పేర్కొన్నారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్కులను ఏర్పాటు చేసి వినియోగదారులకు డాక్యుమెంట్‌ల తయారీలో సహాయం అందిస్తామని, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన 21 రకాల నమూనా డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రజల సౌకర్యార్థం ఇకపై తపాలా కార్యాలయాల్లోనూ స్టాంపు పేపర్లను విక్రయిస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.