ఆదివారాల్లో కూడా రిజిస్ట్రేషన్లు!
హైదరాబాద్: తెలంగాణలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేస్తామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు. అవసరమున్న చోట ఆదివారాల్లో కూడా రిజిస్ట్రేషన్లు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రెండు షిప్టుల్లో పనిచేయనున్నాయని వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక షిప్టు ఉంటుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మరో షిప్టు ఉంటుందని తెలిపారు.
నిజాం ప్రభువును ఉద్దేశించి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని సమర్థించారు. నిజాం చేసిన మంచి గురించి చెబితే తప్పెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.