Telangana Deputy CM
-
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం
-
కడియం శ్రీహరి తీవ్ర అసంతృప్తి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎన్డీయే ప్రభుత్వం ఒక్క విద్యాసంస్థను కూడా ఇవ్వలేదన్నారు. ప్రాథమిక, ఉన్నత విద్యపై రెండు రోజుల పాటు ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తూతూ మంత్రంగా సమావేశాలు జరుపుతున్నారని విమర్శించారు. ఇలాంటి సమావేశాల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని నిరసన వ్యక్తం చేసినట్టు చెప్పారు. అన్ని రాష్ట్రాలకు ట్రిపుల్ ఐటీలను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మాత్రం ఇవ్వలేదని కడియం శ్రీహరి వాపోయారు. కొత్త జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు కావాలని అడిగినా స్పందించలేదన్నారు. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు కేజీబీవీ స్కూళ్లను 12వ తరగతి వరకు కొనసాగించాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం స్థలం కేటాయించినా ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడే నాటికి 296 గురుకుల పాఠశాలలు ఉండేవని, వాటిని తాము 470కి పెంచామని తెలిపారు. కొత్తగా 53 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజిలు కూడా ప్రారంభించామని, రెసిడెన్షియల్ విద్యా విధానం ద్వారా డ్రాపవుట్లు తగ్గాయని కేంద్రానికి వివరించినట్టు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కొనియాడారని తెలిపారు. బయోమెట్రిక్ విధానంతో హాజరు శాతం పెరిగిందని, తద్వారా విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయన్నారు. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. -
'మనిషికైతే ఒకసారి చెబుతారు'
హైదరాబాద్: తన పుట్టుక, కులంపై టీడీపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. వారి దగ్గర వాస్తవాలు ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... టీడీపీ నేతల ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం ఉన్నా పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఎర్రబెల్లి దయాకర రావు తీరు బండి కింద కుక్క సామెతలా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు దామోదర నర్సింహ, మల్లు భట్టివిక్రమార్క కూడా మాది ఉప కులాలకు చెందినవారేనని చెప్పారు. తనపైనే విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మనిషికైతే ఒకసారి చెబుతారు, సంస్కారహీనులకు ఎలా చెప్పాలని వాపోయారు. -
మంద కృష్టవి నిలకడలేని ప్రకటనలు
కేసీఆర్‌ను విమర్శించడమే ఆయన పని మీట్‌ది ప్రెస్‌లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సాక్షి ప్రతినిధి, వరంగల్: మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలనే దండోర ఉద్యమ అజెండాను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేశారని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. మాదిగ ఉప కులాలకు ముందుగా న్యాయం జరగాలని దండోర ఉద్యమం ఆరంభంలో మంద కృష్ణ చెప్పారని... ఇప్పుడు అదే జరిగిందని అన్నారు. వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన మీట్‌ది ప్రెస్‌లో కడియం శ్రీహరి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించడమే మంద కృష్ణ పనిగా పెట్టుకొన్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం ఉద్యమించిన కేసీఆర్‌ను విమర్శించారే తప్ప... తెలంగాణ సాధన కోసం మంద కృష్ణ ఏమీ చేయలేదని విమర్శించారు. మంద కృష్ణ నిలకడలేని ప్రకటనలతో ఎమ్మార్పీఎస్ చీలకలు, పేలికలు అయ్యిందని అన్నారు. ఎమ్మార్పీఎస్‌లో మొదట ఉన్న వారు ఎవరు ఇప్పుడు లేరని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీలపై, నాయకులపై విమర్శలు చేసే ముందు మంద కృష్ణ తన గురించి వెనక్కి తిరిగి పరిశీలించుకోవాలని కడియం శ్రీహరి అన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి కులంపై టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలను ఓ విలేకరి గుర్తు చేయగా... ‘కొందరు ఆశ్చర్యకరంగా నా కులం గురించి మాట్లాడుతున్నారు. మీరు ఎన్నో పరిశోధనాత్మక కథనాలు రాస్తారు. నేను పుట్టిన పర్వతగిరికి వెళ్లి ఈ విషయంపై పరిశోధనాత్మక స్టోరీ రాయండి’ అన్నారు. వచ్చే ఏడాది కేజీ టు పీజీ ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టపరుస్తానని కడియం చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం మిగిల్చిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 862 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. రాష్ట్రంలో 289 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని ఇందులో 125 కాలేజీలకు మాత్రమే అఫ్లియేషన్ వచ్చిందని పేర్కొన్నారు. అఫిలియేషన్ రాని కాలేజీలను మరోసారి తనిఖీ చేసి నివేదికను కోర్టుకు సమర్పించామని చెప్పారు. తెలంగాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికీ కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. -
'నమ్మకాన్ని వమ్ము చేయను'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'కేటినెట్‌లో అవకాశం కల్పించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు. నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిబద్ధతతో పనిచేస్తా. కేజీ టు పీజీపై పరిశీలన చేసి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తా' అని చెప్పారు. -
బాధ్యతలు స్వీకరించిన కడియం శ్రీహరి
హైదరాబాద్ : తెలంగాణ డిప్యూటీ సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా కడియం శ్రీహరి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అలాగే పార్లమెంట్ సెక్రటరీగా వి.సతీష్ కుమార్, తెలంగాణ సాంస్కృతిక సారధి ఛైర్మన్‌గా రసమయి బాలకిషన్ ఈరోజు ఉదయం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. కాగా వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో రాజయ్యపై వేటు పడిన విషయం తెలిసిందే. అనంతరం డిప్యూటీ సీఎంగా కడియం శ్రీహరిని నియమించిన విషయం తెలిసిందే. -
ఆదివారాల్లో కూడా రిజిస్ట్రేషన్లు!
హైదరాబాద్: తెలంగాణలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేస్తామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు. అవసరమున్న చోట ఆదివారాల్లో కూడా రిజిస్ట్రేషన్లు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రెండు షిప్టుల్లో పనిచేయనున్నాయని వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక షిప్టు ఉంటుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మరో షిప్టు ఉంటుందని తెలిపారు. నిజాం ప్రభువును ఉద్దేశించి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని సమర్థించారు. నిజాం చేసిన మంచి గురించి చెబితే తప్పెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. -
ఏపీ అభివృద్ధిపై ఎందుకు దృష్టి పెట్టరు?
హైదరాబాద్: ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌పై కుట్రలు చేస్తున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య ఆరోపించారు. ఏపీ అభివృద్ధిపై చంద్రబాబు ఎందుకు దృష్టి సారించడంలేదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ లో శాంతి భద్రతల పర్యవేక్షణకు అధికారాలను గవర్నర్ కు అప్పగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో బీజేపీకి చిత్తశుద్ధిలేదని విమర్శించారు. మంత్రివర్గ విస్తరణలో సీఎం కేసీఆర్‌దే తుది నిర్ణయంమని చెప్పారు. -
డాక్టరుగా మారిన డిప్యూటీ సీఎం