'మనిషికైతే ఒకసారి చెబుతారు'
హైదరాబాద్: తన పుట్టుక, కులంపై టీడీపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. వారి దగ్గర వాస్తవాలు ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... టీడీపీ నేతల ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం ఉన్నా పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
ఎర్రబెల్లి దయాకర రావు తీరు బండి కింద కుక్క సామెతలా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు దామోదర నర్సింహ, మల్లు భట్టివిక్రమార్క కూడా మాది ఉప కులాలకు చెందినవారేనని చెప్పారు. తనపైనే విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మనిషికైతే ఒకసారి చెబుతారు, సంస్కారహీనులకు ఎలా చెప్పాలని వాపోయారు.