హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'కేటినెట్లో అవకాశం కల్పించిన కేసీఆర్కు కృతజ్ఞతలు. నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిబద్ధతతో పనిచేస్తా. కేజీ టు పీజీపై పరిశీలన చేసి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తా' అని చెప్పారు.