సాక్షి, కొవ్వూరు: పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరు సబ్ రిజిస్టార్‌గా పనిచేస్తున్న ఆకాశం శారదాదేవి మంగళవారం విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో మరణించారు. ఆమె గత డిసెంబర్‌లో చింతలపూడి నుండి కొవ్వూరుకు బదిలీపై వచ్చారు. రానున్న ఏప్రిల్ నెలలో ఆమె పదవీవిరమణ చేయనున్నారు.
మంగళవారం ఉదయం 10 గంటలకు కార్యాలయానికి వచ్చిన శారదాదేవి.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వస్తుంది అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సిబ్బంది ఆమెను వెంటనే పక్కనే ఉన్న ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శారదాదేవికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా. శారదాదేవి మాత్రం కొవ్వూరులో ఉంటూ సబ్ రిజిస్టార్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమెకు గుండెపోటు రావడంతో చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఆపరేషన్ చేయాలంటూ వైద్యులు చెప్పినట్లు కుమారులు చెప్పారు. ఆమె ఆకస్మిక మృతిపట్ల సబ్ రిజిస్టార్ కార్యాలయ సిబ్బంది విచారం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment