అరెస్టయిన సబ్ రిజిస్ట్రార్
పళ్లిపట్టు: ల్యాండ్ వ్యాల్యుయేషన్ రిపోర్టు కోసం రూ. 35 వేలు లంచం తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రార్‌తో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఆర్కేపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్‌గా విరుదాచలంకు చెందిన సెల్వరామచంద్రన్(39) విధులు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో ఆర్కేపేట విలక్కనాంపూడి పుదూర్‌కు చెందిన ఆంజనేయన్ అతని కుటుంబీకులకు చెందిన 70 సెంట్ల భూమిని రాణిపేట జిల్లా మలైమేడు ప్రాంతానికి చెందిన నరసింహన్ అనే వ్యక్తి తిరుత్తణి మండలం మద్దూరుకు చెందిన జయశంకర్(53) మధ్యవర్తిగా వ్యవహరించి జనవరి 22న ఆర్కేపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. 70 సెంట్ల ఖాళీ స్థలానికి సంబంధించి ల్యాండ్ వ్యాల్యుయేషన్ రిపోర్ట్ కోసం సబ్‌రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం సెల్వ రామచంద్రన్ రూ. 50 వేలు లంచం డిమాండ్ చేసినట్లు, చివరికి రూ. 35 వేలకు అంగీకరించినట్లు తెలిసింది.
అయితే అంత డబ్బులు లంచంగా ఇచ్చేందుకు ఇష్టం లేని స్థలం కొనుగోలు చేసిన వ్యక్తి తిరువళ్లూరులోని ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ కలైసెల్వన్ సూచనల మేరకు మంగళవారం సాయంత్రం మధ్యవర్తి జయశంకర్ రూ. 35 లంచం నగదు తీసుకుని రిజిస్ట్రార్‌కు ఇస్తుండగా పక్కనే వున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ వద్ద ఇవ్వమని చెప్పగా అతను ఆ డబ్బును తీసుకుంటున్న సమయంలో అక్కడే వేచివున్న ఏసీబీ సీఐ తమిళ్‌సెల్వి సిబ్బంది ఆధ్వర్యంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని రిజిస్ట్రార్‌తో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment