కాకినాడ లీగల్ :రిజిస్ట్రేషన్ల శాఖలో జిల్లాలో పని చేస్తున్న సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ సబ్ రిజిస్ట్రార్ జాయింట్-1 ఎం.విజయజీవన్‌బాబును రాజమండ్రి సబ్ రిజిస్ట్రార్ జాయింట్-1గా, రాజమండ్రి సబ్ రిజిస్ట్రార్ జాయింట్-1 జయమణిని ఏలూరు డీఐజీ కార్యాలయ సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. రాజానగరం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసబాబును రాజమండ్రి సబ్‌రిజిస్ట్రార్-2గా, పిడింగొయ్యి సబ్ రిజిస్ట్రార్ రమేష్‌బాబు రాజానగరానికి బదిలీ అయ్యారు.
కొత్తపేట సబ్ రిజిస్ట్రార్ జేవీవీ ప్రసాద్ పిడింగొయ్యికి, కాకినాడ సబ్ రిజిస్ట్రార్-2 డి.సుబ్రహ్మణ్యం మచిలీపట్నానికి బదిలీ కాగా, కొవ్వూరు నుంచి కాకినాడ సబ్ రిజిస్ట్రార్-2గా రామారావు రానున్నారు. తుని సబ్ రిజిస్ట్రార్ కె.సుందరరావు సామర్లకోట బదిలీ కాగా, అమలాపురం సబ్ రిజిస్ట్రార్ సుబ్బారెడ్డి తునికి బదిలీ అయ్యారు. అనపర్తి సబ్ రిజిస్ట్రార్ రమేష్‌బాబుకు అమలాపురం బదిలీ అయింది. తాళ్లరేవు నుంచి కేవీఎస్ కుమారి సర్పవరం సబ్‌రిజిస్ట్రార్‌గా, సర్పవరం సబ్‌రిజిస్ట్రార్ డి.నరసింహరాజు పశ్చిమ గోదావరి గునుపూడికి బదిలీయ్యారు. కాకినాడ డీఐజీ కార్యాలయ సూపరింటెండెంట్ పీఎస్‌ఆర్ మూర్తి తాళ్లరేవు సబ్‌రిజిస్ట్రార్‌గా, కొత్తపేట సబ్‌రిజిస్ట్రార్ జేవీవీ ప్రసాదరావు పిడింగొయ్యికి, పెద్దాపురం సబ్ రిజిస్ట్రార్ సుబ్రహ్మణ్యం అంబాజీపేటకు బదిలీపై వెళ్లనున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా అనంతపల్లి సబ్‌రిజిస్ట్రార్ శేఖర్‌బాబు పెద్దాపురానికి, సామర్లకోట నుంచి లక్ష్మి సీతానగరానికి బదిలీ అయ్యారు. పిడింగొయ్యి సబ్ రిజిస్ట్రార్ రమేష్ రాజానగరానికి, ప్రత్తిపాడు సబ్ రిజిస్ట్రార్ ఇ.లక్ష్మి కాకినాడ చిట్స్ రిజిస్ట్రార్‌గా బదిలీపై వెళ్లనున్నారు. పిఠాపురం నుంచి కె.శ్రీనివాస్ ప్రత్తిపాడుకు, పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి సబ్ రిజిస్ట్రార్ కె.దుర్గారాణి పిఠాపురానికి, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్‌రిజిస్ట్రార్ ఎ.ఆదినారాయణ బిక్కవోలుకు, ఇక్కడి నుంచి ఎన్‌ఎన్‌వీ త్రినాథరావు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి వెళ్లనున్నారు. అంబాజీపేట సబ్ రిజిస్ట్రార్ కేఎస్‌ఎస్ ప్రసాద్ రాజోలుకు, అల్లవరం నుంచి రత్నాబాయి జగ్గంపేటకు, జగ్గంపేట నుంచి సూర్యనారాయణ అనపర్తికి బదిలీ అయ్యారు.
సబ్ రిజిస్ట్రార్లకు స్థాన చలనం
Published Wed, Oct 1 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM
Advertisement
Advertisement