DIG office
-
బదిలీ..
మంగళవారం రేంజ్ పరిధిలో 101 మంది సీఐలను బదిలీ చేస్తూ ఉత్వర్వులు విడుదల చేశారు. ఇందులో భాగంగా జిల్లాలో 26 మందికి స్థానచలనం కలిగింది. ఇందులో 10 మందిని డీఐజీ కార్యాలయానికి అటాచ్డ్ చేశారు. ఆదిలాబాద్‌కు కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి 11 మంది రాగా, జిల్లాలోనే ఐదుగురిని ఇక్కడే ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, పరిపాలనా సౌలభ్యంతోపాటు దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న పలువురు సీఐలను బదిలీ చేసేందుకు అప్పటి ఎస్పీ గజరావు భూపాల్ ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. దీంతో అక్టోబర్ 17న జిల్లాలో ఎనిమిది మంది సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ మరుసటి రోజే అవి రద్దు చేశారు. ఆ బదిలీలపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేయడంతో బదిలీలకు బ్రేక్ పడింది. తమకు అనుకూలమైన సీఐలు కావాలని ప్రజాప్రతినిధులు అధినేత దృష్టికి తీసుకెళ్లడంతో బదిలీ ఉత్తర్వులు నిలిచిపోయాయి. బదిలీలపై ప్రజాప్రతినిధుల ముద్ర.. జిల్లాలో జరిగిన సీఐల బదిలీల్లో ప్రజాప్రతినిధుల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో తమకు అనుకూలమైన వారు లేక ఇబ్బందులు పడ్డామని, ఈ సారీ ఎలాగైన తమవారికే పోస్టింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు పైరవీలు చేసినట్లు విమర్శలు ఉన్నాయి. ఎలాంటి పారదర్శకత లేకుండానే బదిలీలు రాజకీయంగా మారాయి. గతంలో జిల్లాలో పనిచేసి ప్రస్తుతం ఇతర జిల్లాలో ఉన్న సీఐలు పెద్ద మొత్తంలో ఆదిలాబాద్‌కు బదిలీ అయ్యారు. వీరిని రప్పించేందుకు ఇక్కడి ప్రజాప్రతినిధుల పెద్ద ఎత్తున పైరవీలు చేసి తమ పంతం నెగ్గించుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 17న ఉత్తర్వులను రద్దు చేసినప్పటి నుంచి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ అనుకూలమైన పోస్టింగ్ కోసం పైరవీలు చేశారనే విమర్శలు ఉన్నాయి. ఒక పక్క ప్రజాప్రతినిధులకు అనుకూలమైన వారితో పాటు.. అధికారులు కోరుకున్న చోటికి బదిలీ చేసేందుకు ఈ బదిలీల్లో భారీగా మార్పులు జరిగాయి. -
సబ్ రిజిస్ట్రార్లకు స్థాన చలనం
కాకినాడ లీగల్ :రిజిస్ట్రేషన్ల శాఖలో జిల్లాలో పని చేస్తున్న సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ సబ్ రిజిస్ట్రార్ జాయింట్-1 ఎం.విజయజీవన్బాబును రాజమండ్రి సబ్ రిజిస్ట్రార్ జాయింట్-1గా, రాజమండ్రి సబ్ రిజిస్ట్రార్ జాయింట్-1 జయమణిని ఏలూరు డీఐజీ కార్యాలయ సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. రాజానగరం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసబాబును రాజమండ్రి సబ్‌రిజిస్ట్రార్-2గా, పిడింగొయ్యి సబ్ రిజిస్ట్రార్ రమేష్‌బాబు రాజానగరానికి బదిలీ అయ్యారు. కొత్తపేట సబ్ రిజిస్ట్రార్ జేవీవీ ప్రసాద్ పిడింగొయ్యికి, కాకినాడ సబ్ రిజిస్ట్రార్-2 డి.సుబ్రహ్మణ్యం మచిలీపట్నానికి బదిలీ కాగా, కొవ్వూరు నుంచి కాకినాడ సబ్ రిజిస్ట్రార్-2గా రామారావు రానున్నారు. తుని సబ్ రిజిస్ట్రార్ కె.సుందరరావు సామర్లకోట బదిలీ కాగా, అమలాపురం సబ్ రిజిస్ట్రార్ సుబ్బారెడ్డి తునికి బదిలీ అయ్యారు. అనపర్తి సబ్ రిజిస్ట్రార్ రమేష్‌బాబుకు అమలాపురం బదిలీ అయింది. తాళ్లరేవు నుంచి కేవీఎస్ కుమారి సర్పవరం సబ్‌రిజిస్ట్రార్‌గా, సర్పవరం సబ్‌రిజిస్ట్రార్ డి.నరసింహరాజు పశ్చిమ గోదావరి గునుపూడికి బదిలీయ్యారు. కాకినాడ డీఐజీ కార్యాలయ సూపరింటెండెంట్ పీఎస్ఆర్ మూర్తి తాళ్లరేవు సబ్‌రిజిస్ట్రార్‌గా, కొత్తపేట సబ్‌రిజిస్ట్రార్ జేవీవీ ప్రసాదరావు పిడింగొయ్యికి, పెద్దాపురం సబ్ రిజిస్ట్రార్ సుబ్రహ్మణ్యం అంబాజీపేటకు బదిలీపై వెళ్లనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అనంతపల్లి సబ్‌రిజిస్ట్రార్ శేఖర్‌బాబు పెద్దాపురానికి, సామర్లకోట నుంచి లక్ష్మి సీతానగరానికి బదిలీ అయ్యారు. పిడింగొయ్యి సబ్ రిజిస్ట్రార్ రమేష్ రాజానగరానికి, ప్రత్తిపాడు సబ్ రిజిస్ట్రార్ ఇ.లక్ష్మి కాకినాడ చిట్స్ రిజిస్ట్రార్‌గా బదిలీపై వెళ్లనున్నారు. పిఠాపురం నుంచి కె.శ్రీనివాస్ ప్రత్తిపాడుకు, పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి సబ్ రిజిస్ట్రార్ కె.దుర్గారాణి పిఠాపురానికి, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్‌రిజిస్ట్రార్ ఎ.ఆదినారాయణ బిక్కవోలుకు, ఇక్కడి నుంచి ఎన్ఎన్వీ త్రినాథరావు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి వెళ్లనున్నారు. అంబాజీపేట సబ్ రిజిస్ట్రార్ కేఎస్ఎస్ ప్రసాద్ రాజోలుకు, అల్లవరం నుంచి రత్నాబాయి జగ్గంపేటకు, జగ్గంపేట నుంచి సూర్యనారాయణ అనపర్తికి బదిలీ అయ్యారు. -
ఆయనంటే హడల్
- ఆస్తిపాస్తుల కిరికిరి - ఎస్సైలకు చార్జిమెమోలు - వివరణ ఇచ్చినా బేఖాతరు - రాష్ట్రస్థాయికి పేచీ సాక్షి ప్రతినిధి, కరీంనగర్:‘కనీసం సమాచారం ఇవ్వకుండా విలువైన అస్తులు కొనుగోలు చేశారు. ఎందుకు మీపై చట్టప్రకారం చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ... ’ ఇటీవల జిల్లాలో దాదాపు 43 మంది ఎస్సైలకు డీఐజీ కార్యాలయం నుంచి చార్జీమెమోలు జారీ అయ్యాయి. వీరిలో చాలామంది రెండేళ్ల కిందటే పోస్టింగ్‌లు పొందారు. డ్యూటీలో జాయిన్ అయ్యే కొత్తలో అవగాహనలోపంతో కొందరు ఎస్సైలు తమ ఆస్తులు ఉన్నవి, లేనివి చూపించారు. గతేడాది ఆరంభంలో డీఐజీ కార్యాలయం నుంచి వీరందరికీ ఆస్తులపై వివరణ ఇవ్వాలని మెమోలు జారీ అయ్యాయి. ఈ మధ్య వ్యవధిలో కొందరు ఎస్సైలు పెళ్లి చేసుకున్నారు. కట్నకానుకలు, డబ్బులు, బంగారం, వాహనాలు ఇతర విలువైన అస్తులు అదనంగా వచ్చిచేరాయి. ఆస్తుల వివరాల్లో తప్పులుంటే మన్నించాలని, ముందుగా అనుమతి తీసుకోవాలని తమకు తెలియదని ఎస్సైలు వివరణ ఇచ్చుకున్నారు. కొన్ని జిల్లాల్లో తమ ఉద్యోగులు నిజాయితీగా సమాధానం ఇచ్చారని భావించి అక్కడి అధికారులు మానవతా దృక్పథంతో మెమోలు పక్కన బెట్టారు. కానీ.. మన జిల్లాలో ఎస్సైల వేడుకోలు బుట్ట దాఖలైంది. గతంలో చేసిన పొరపాటు మళ్లీ చేయబోమని, కొత్తగా ఉద్యోగంలోకి వచ్చినందున దయతో మన్నించాలని ప్రొబేషనరీ ఎస్సైలు సంజాయిషీ ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మీపై చట్టరీత్యా చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ 15 రోజుల కిందట చార్జిమెమోలు జారీ అయ్యాయి. దీంతో ఎస్సైలు హడలెత్తిపోయారు. ప్రొబేషనరీ సమయం కావటంతో... ఇప్పుడు చార్జిమోమోలు ఇస్తే రెగ్యులర్ పోస్టింగ్ ఇచ్చేటప్పుడు ఏం కిరికిరి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అదే అదనుగా సదరు ఉన్నతాధికారి కార్యాలయంలో చక్రం తిప్పే ఉద్యోగి రంగప్రవేశం చేసి... ఎంతోకొంత సమర్పిస్తే సమస్యను పరిష్కరిస్తానంటూ అసలు కబురు అందరికీ జారవేశారు. దీంతో మెమోల జారీ వెనుక లోగుట్టు బయట పడినట్లయింది. ఎలాగైతేనేం.. అడిగినంత ఇచ్చి చేతులు దులుపుకోవటం నయమని కొందరు, అంత భారీ మొత్తం సమర్పించుకోలేమని కొందరు.. ఈ రాయ‘బేరం’పై మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ ఉద్యోగి చెప్పిన ‘ఫిగర్' విన్నాక కొందరు ఎస్సైలు బిత్తరపోయారు. దీంతో ఆస్తుల మెమోల వ్యవహారానికి తాత్కాలికంగా పీటముడి పడింది. లూప్లైన్లో పని చేస్తున్న ఎస్సైలు అంత ‘భారం' భరించలేమంటూ చేతులెత్తేశారు. చార్జిమెమోల సాకుతో తెరవెనుక జరుగుతున్న వసూళ్ల పర్వంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. మరో రెండు రోజుల్లో స్వయానా సీఎం, హోంమంత్రి, డీజీపీని కలిసి తమ గోడు వెళ్లబోసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో ఎస్సైల ఆస్తిపాస్తులు, అధికారి వసూళ్ల పేచీ రాష్ట్ర స్థాయికి చేరనుంది. గతంలోనూ ఇదే అధికారిపై జిల్లాలో పలు ఆరోపణలు వెల్లువెత్తటం గమనార్హం. పోస్టింగ్‌ల్లో తల దూర్చడం, పోలీస్‌స్టేషన్ తనిఖీకి వెళ్లి బేరమాడటం, మాట వినకుంటే తనిఖీల పేరుతో వేధింపులకు గురిచేయటం, అదే కార్యాలయంలో పాతుకుపోయిన ఓ ఉద్యోగిని అడ్డుగా పెట్టుకొని ఇష్టారాజ్యంగా చక్రం తిప్పుతున్న ఫిర్యాదులన్నీ మళ్లీ తెరపైకి వచ్చినట్లయింది.