లక్కిరెడ్డిపల్లి(వైఎస్సార్ జిల్లా):
లక్కిరెడ్డిపల్లి మండల సబ్‌రిజిస్ట్రార్ సర్వేశ్వర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. రామాపురం మండలం గోపగూడపల్లెకు చెందిన రేఖం నారాయణ అనే రైతు ఇటీవల 46 సెంట్ల భూమిని కొనుగోలు చేశాడు. ఈ భూమి రోడ్ల విస్తరణలో కొంత భాగం పోనుంది. రిజిస్ట్రేషన్ కాకపోతే ప్రభుత్వం నుంచి పరిహారం రాదని చెప్పడంతో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు లక్కిరెడ్డిపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చాడు.
రూ.10 వేల లంచం ఇస్తేనే పని జరుగుతుందని చెప్పడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రైతు నుంచి లంచం తీసుకుంటుండగా సర్వేశ్వర్ రెడ్డిని అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్‌రిజిస్ట్రార్
Published Thu, Feb 9 2017 7:08 PM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM
Advertisement
Advertisement