trial postponed
-
సూర్యనారాయణకు దెబ్బ మీద దెబ్బ..
సాక్షి, అమరావతి: వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణకు గురువారం న్యాయస్థానాల్లో దెబ్బ మీద దెబ్బ తగిలింది. వ్యాపారులతో కుమ్మక్కై ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయానికి గండికొట్టారంటూ విజయవాడ పటమట పోలీసులు నమోదు చేసిన కేసులో మధ్యంతర ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. ఈ కేసు కొట్టేయాలని తన అరెస్ట్‌తో సహా తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలన్న సూర్యనారాయణ అభ్యర్థనను తోసిపుచ్చింది. సూర్యనారాయణ తమతో కుమ్మక్కయినట్లు వ్యాపారులు ఇచ్చిన వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీకి విముఖత వ్యక్తంచేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సూర్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్ట్‌తో సహా తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని కోరుతూ ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అనుబంధ పిటిషన్‌పై జస్టిస్ శ్రీనివాసరెడ్డి గురువారం విచారణ జరిపారు. పోలీసుల తరఫున పబ్లిక్ పీపీ యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ సూర్యనారాయణ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారని, తద్వారా అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. వ్యాపారులతో కుమ్మక్కై నోటీసుల ప్రకారం వారు చెల్లించాల్సిన పన్ను కన్నా తక్కువ వసూలు చేశారన్నారు. ఈ ప్రక్రియలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారిందన్నారు. సూర్యనారాయణ ఏ రకంగా లబ్ధి చేకూర్చారో వ్యాపారులు వాంగ్మూలం రూపంలో పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పారని నాగిరెడ్డి కోర్టుకు నివేదించారు. పోలీసులు నమోదు చేసిన ఆ వాంగ్మూలాలను కోర్టు ముందుంచారు. సూర్యనారాయణ చాలా తీవ్రమైన నేరానికి పాల్పడ్డారన్నారు. అందుకు అన్ని ఆధారాలున్నాయని వివరించారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని ఆయన కోర్టును అభ్యర్థించారు. అంతకు ముందు సూర్యనారాయణ తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్, న్యాయవాది పీవీజీ ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ఈ కేసులోని మిగిలిన నిందితులతో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసు నమోదైందన్నారు. పిటిషనర్‌ను అరెస్ట్ చేసి సస్పెండ్ చేసేందుకే ఆయనకు బెయిల్ రాకుండా అవినీతి నిరోధక చట్టం కింద కూడా కేసు పెట్టారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి.. వ్యాపారుల వాంగ్మూలాలను పరిశీలించిన తరువాత ఈ కేసులో పిటిషనర్ కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కృతి ఇదిలా ఉంటే, పటమట పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సూర్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టు తోసిపుచ్చింది. సూర్యనారాయణపై అవినీతి నిరోధక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో, అతని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపే పరిధి ఈ కోర్టుకు లేదని న్యాయాధికారి స్పష్టం చేశారు. -
ఉగ్రవాది తుండా కేసు విచారణ వాయిదా
-
రమ్య కేసు విచారణ వాయిదా
హైదరాబాద్: రమ్య కేసు విచారణ వచ్చే నెల 2 కు వాయిదా పడింది. రమ్య తండ్రి వెంకటరమణ మాట్లాడుతూ ఈ కేసులో మాకు న్యాయం జరుగుతుందని అనుకోవడం లేదు. ఇప్పుడు ట్రైల్స్ ప్రారంభమైతే ఈ కేసు ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. సెకండ్ ఛార్జ్‌షీట్ ఇంత వరకు కోర్ట్‌లో ఫైల్ చేయలేదు. ఈ కేసు ఫాస్ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపడతాం అన్నారు. కానీ ఇప్పుడు సెషన్కోర్ట్ అంటున్నారు. సెషన్కోర్ట్కి ఈ కేసు వెళ్తే కాలయాపన తప్ప న్యాయం జరగుతుందని మేం భావించడం లేదు. గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి రమ్య చట్టం తీసుకురావాలని విన్నవించాం. కానీ ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఈ కేసులో మైనర్లకు మద్యం అమ్మిన వారి పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నా, అయినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘కృష్ణా’ పంపిణీపై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాలను ఏపీ, తెలంగాణ మధ్య పంచే అంశంపై కృష్ణా ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ మార్చి 23కు వాయిదా పడింది. పునర్వ్యవస్థీకరణ చ ట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ఉమ్మడి రా ష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను 2 కొత్త రాష్ట్రాల మధ్య పంచాలని ఇటీవల కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు వెలువ రించింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలు తమ అభిప్రా యాలు, అభ్యంతరాలు, వివరణల ను స మర్పించాలని ఆదేశించింది. అయితే 2 రాష్ట్రాల నుంచి ఎలాంటి స్పందన రాకపో వడంతో మార్చి 20లోపు వాటిని దాఖలు చేయాలంటూ ట్రిబ్యునల్ ఆదేశించింది. -
తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
-
కొత్తపల్లి గీత గైర్హాజరుతో విచారణ వాయిదా!
విశాఖపట్నం: ఎంపి కొత్తపల్లి గీత గైర్హాజరవడంతో ఫోర్జరీ సంతకాలపై విచారణ వాయిదాపడింది. గత ఎన్నికలలో నామినేషన్ పత్రాలపై గీత ఫోర్జరీ సంతకాలు చేసినట్లు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఆదేశాల ప్రకారం జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఈరోజు విచారణ నిర్వహించారు. ఈశ్వరి, గిరిజనులు విచారణకు హారజయ్యారు. గీత హాజరుకాకపోవడంతో విచారణను వాయిదావేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈశ్వరి మాట్లాడుతూ కొత్తపల్లి గీత ఎన్నిక ప్రక్రియను అపహాస్యం చేసిందని విమర్శించారు. సభ్యత,సంస్కారం, ఆత్మగౌరవం ఉంటే ఎంపి పదవికి వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఫోర్జరీ చేసినవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈశ్వరి డిమాండ్ చేశారు. ** -
ఢిల్లీ అసెంబ్లీ రద్దుపై త్వరగా తేల్చండి
కేంద్రానికి ఐదు వారాల గడువిచ్చిన సుప్రీంకోర్టు ఖాళీగా ఉంటున్న ఎమ్మెల్యేలకు జీతాలెందుకివ్వాలని ప్రశ్న ఎన్నికలు నిర్వహించాలన్న ఆప్ వ్యాజ్యంపై విచారణ వాయిదా న్యూఢిల్లీ: ఢిల్లీలో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని ఐదు వారాల్లోగా పరిష్కరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆలోగా అసెంబ్లీ రద్దు విషయమై తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గద్దె దిగిన తర్వాత రాష్ర్టంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ ముందుకు రాకపోవడంతో ఢిల్లీ అసెంబ్లీని ప్రస్తుతం సుప్తచేతనావస్థలో ఉంచిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రాష్ర్టపతి పాలన రాజ్యాంగ విరుద్ధమని, అసెంబ్లీని రద్దు చేసి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఆప్ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది. ‘తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదలచుకోవడం లేదని ఒక పార్టీ అంటోంది. తమకు చేతకాదని మరో పార్టీ అంటోంది. మూడో పార్టీకి బలం లేదు. ఈ పరిస్థితిలో ప్రజలెందుకు ఇబ్బందులు పడాలి?’ అని జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. అసెంబ్లీ సుప్తచేతనంగా ఉన్నందున ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చుంటున్న ఎమ్మెల్యేలకు ప్రజాధనాన్ని జీతంగా ఎందుకు చెల్లించాలని కూడా ఘాటుగా ప్రశ్నించింది. ఈ వ్యాజ్యాన్ని పార్టీ కోణంలో కాకుండా సగటు ఢిల్లీ వాసి దృష్టితో చూస్తున్నట్లు పేర్కొంది. కోర్టు అభిప్రాయాన్ని కేంద్రానికి తెలపాలని అదనపు సొలిసిటర్ జనరల్ పీఎల్ నరసింహను కోరింది. గత ఐదు నెలల్లో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టిందని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రజలిచ్చిన తీర్పు ఆరు నెలల్లోనే వృథా కాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు కేంద్రం తెలిపినప్పటికీ కోర్టు సంతృప్తి చెందలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన బీజేపీ తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశం లేదంటోందని, మరోపక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు తగిన బలం లేదని ఆప్ చెబుతోందని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో ఎంతకాలం అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచుతారని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఢిల్లీ అసెంబ్లీ విషయంలో ఐదు వారాల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. సుప్రీం వ్యాఖ్యలపై ఆప్ హర్షం వ్యక్తం చేసింది. కోర్టు అభిప్రాయంతో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఏకీభవించారు. అనిశ్చితిని తొలగించవలసిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వీలుకాకపోతే ఎన్నికలు జరిపించక తప్పదని వ్యాఖ్యానించారు. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీ బలం ముగ్గురు బీజేపీ సభ్యుల రాజీనామాతో 67కు చేరింది. బీజేపీకి ప్రస్తుతం మిత్రపక్షమై అకాలీదళ్ ఎమ్మెల్యే ఒకరితోపాటు 28 మంది సభ్యులున్నారు. ఎన్నికల్లో 28 సీట్లు గెల్చుకుని ఎనిమిది మంది కాంగ్రెస్ సభ్యుల మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్ బలం ఒక స్వపక్ష సభ్యుడి బహిష్కరణతో 27కు పరిమితమైంది.