‘కృష్ణా’ పంపిణీపై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాలను ఏపీ, తెలంగాణ మధ్య పంచే అంశంపై కృష్ణా ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ మార్చి 23కు వాయిదా పడింది. పునర్వ్యవస్థీకరణ చ ట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ఉమ్మడి రా ష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను 2 కొత్త రాష్ట్రాల మధ్య పంచాలని ఇటీవల కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు వెలువ రించింది.
ఈ మేరకు ఇరు రాష్ట్రాలు తమ అభిప్రా యాలు, అభ్యంతరాలు, వివరణల ను స మర్పించాలని ఆదేశించింది. అయితే 2 రాష్ట్రాల నుంచి ఎలాంటి స్పందన రాకపో వడంతో మార్చి 20లోపు వాటిని దాఖలు చేయాలంటూ ట్రిబ్యునల్ ఆదేశించింది.