రమ్య కేసు విచారణ వాయిదా
Published Wed, Apr 12 2017 2:00 PM | Last Updated on Tue, Sep 5 2017 8:36 AM
హైదరాబాద్: రమ్య కేసు విచారణ వచ్చే నెల 2 కు వాయిదా పడింది. రమ్య తండ్రి వెంకటరమణ మాట్లాడుతూ ఈ కేసులో మాకు న్యాయం జరుగుతుందని అనుకోవడం లేదు. ఇప్పుడు ట్రైల్స్ ప్రారంభమైతే ఈ కేసు ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. సెకండ్ ఛార్జ్‌షీట్ ఇంత వరకు కోర్ట్‌లో ఫైల్ చేయలేదు.
ఈ కేసు ఫాస్ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపడతాం అన్నారు. కానీ ఇప్పుడు సెషన్‌కోర్ట్ అంటున్నారు. సెషన్‌కోర్ట్‌కి ఈ కేసు వెళ్తే కాలయాపన తప్ప న్యాయం జరగుతుందని మేం భావించడం లేదు. గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి రమ్య చట్టం తీసుకురావాలని విన్నవించాం. కానీ ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఈ కేసులో మైనర్లకు మద్యం అమ్మిన వారి పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నా, అయినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement