సాక్షి, చెన్నై : అమ్మ మరణంపై నిజాలు తేల్చేందుకు తమిళనాడు ప్రభుత్వం కమిటీ ఏర్పాటుకు అంగీకరించిన విషయం తెలిసిందే. విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ను పన్నీర్ వర్గం లేవనెత్తగా.. దానికి పళని ఓకే చెప్పటంతోనే ఆ రెండు వర్గాలు ఒకయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ ఏ ఆర్ముగస్వామి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు శుక్రవారం ప్రకటించింది.
జయ ఆస్పత్రిలో చేరేందుకు దారితీసిన పరిస్థితుల దగ్గరి నుంచి ప్రతీ విషయాన్ని ఈ మాజీ న్యాయమూర్తి ఒక్కడిగానే దర్యాప్తు చేయనుందన్న మాట. అయితే కీలకమైన ఈ అంశంలో ఆయన ఒక్కడే ఏం చేయబోతున్నారన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు ప్రతిపక్ష డీఎంకే.. అమ్మ మృతి వ్యహారంలో అనుమానాలు నివృత్తి చేయటంపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది.
అయితే తాను మాత్రం విచారణను చాలా పారదర్శకంగా చేపడతానని అర్ముగస్వామి చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మూడు నెలలో ఆయన తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. అమ్మ అనారోగ్యం, ఆస్పత్రిలో 75 రోజుల చికిత్సకు సంబంధించిన పూర్తి విషయాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment