సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. ప్రధాన నిందితులు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావుల అరెస్ట్‌లకు రంగంసిద్దం చేశారు. విదేశాల నుంచి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు వేగవంతం చేశారు. అమెరికాలో ఉన్న నిందితులకు రెడ్‌కార్నర్ నోటీసులను జారీ చేసేందుకు ఇంటర్ పోల్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఈ కేసు దర్యాప్తు బృందం నేషనల్ సెంట్రల్ బ్యూరో అధికారులు, సీబీఐ అధికారులతో సమన్వయం చేసుకుంటోంది. అమెరికా, భారత్ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం నిందితులను అరెస్టకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని దర్యాప్తు బృందం కోర్టుకు తెలియజేసింది. వీలైనంత త్వరగా నిందితులను ఇండియాకు తీసుకువచ్చి ఫోన్ టాపింగ్ కేసులో విచారించనున్నారు పోలీసులు. కేసులో ఉన్న మరి కొంతమందికి సంబంధించిన దర్యాప్తు బృందం ఆధారాలను సేకరించింది. త్వరలోనే మరి కొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనుంది.
చదవండి: ప్రభాకర్‌రావును రప్పించేందుకు రెడ్‌కార్నర్ నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment