Railway Safety Commission
-
మానవ తప్పిదం వల్లే
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ స్టేషన్లో నవంబర్ 11న ఎంఎంటీఎస్–ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని రైల్వే సేఫ్టీ కమిషనర్ రామ్ క్రిపాల్ తేల్చారు. సిగ్నల్‌ను పట్టించుకోకుండా ఎంఎంటీఎస్ లోకోపైలట్ రైలును ముందుకు తీసుకెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే బోర్డుకు తాజాగా నివేదిక సమర్పించారు. ఈ ప్రమాదంలో రెండు రైళ్ల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. ప్రమా దం తర్వాత రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో అధికారులు ఘటనాస్థలిలో రెండు రోజుల పాటు పరీక్షించారు. సిగ్నల్ వ్యవస్థ, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి.. సిబ్బంది, అధికారులను ప్రశ్నించారు. ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థ లోపం కారణం కాదని తేల్చారు. లోకోపైలట్ చంద్రశేఖరే ప్రమాదానికి కారణమని గుర్తించి రైల్వే బోర్డు చైర్మన్, రైల్వే సేఫ్టీ చీఫ్ కమిషనర్‌కు నివేదిక ఇచ్చారు. కాగా, ఈ ఘటనలో లోకోపైలట్ మృతి చెందగా, రైలు గార్డు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నాటి నుంచి ఆయన సెలవులోనే ఉన్నా రు. గార్డు కోలుకున్న తర్వాత దీనిపై ప్రశ్నిం చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. -
ప్రమాదం ఎలా జరిగింది..?
సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ రైలు ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కమిటీ బుధవారం కాచిగూడ రైల్వేస్టేషన్లో సమావేశమైంది. ప్రమాదం జరిగిన తీరు, తీవ్రత, తదనంతర పరి ణామాలపై అధికారులు విచారణ చేపట్టారు. రైల్వే భద్రత కమిషనర్ రాంకృపాల్ నేతృత్వంలో జరి గిన ఈ సమావేశంలో హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ సీతారాం, వివిధ విభాగాలకు చెంది న ఉన్నతాధికారులు, ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారు లు పాల్గొన్నారు. ప్రమాద సమయంలో నమోదైన సీసీటీవీ ఫుటేజీలను అధికారులు పరిశీలించారు. ఆ సమయంలో ఎంఎంటీఎస్ ట్రైన్ కనీసం 50 కిలోమీటర్లపైనే వేగంతో వెళ్తున్నట్లు గుర్తించారు. వేగం వల్లే ఎక్కువ బోగీలు ధ్వంసమైనట్లు తేల్చా రు. ప్రమాద సమయంలో లూప్లైన్లో నెమ్మదిగా క్రాస్ చేస్తున్న హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ వాకిం గ్ స్పీడ్‌తో ముందుకెళ్లడం వల్ల కూడా ప్రమాద తీవ్రత తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ప్రమాద సమయంలో విధి నిర్వహణలో ఉన్న కాచిగూడ స్టేషన్ మేనేజర్ దశరథ్, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది, సిగ్నలింగ్ స్టాఫ్‌ను విచారించారు. ప్రయాణికులు, ప్రత్యక్ష సాక్షుల నుంచీ వివరాలు సేకరించారు. హంద్రీ ఎక్స్‌ప్రెస్ లోకోపైలట్ బాలకిషన్‌తోనూ ఉన్నతస్థాయి విచారణ కమిటీ సమావేశమైంది. ఎంఎంటీఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ మానసిక స్థితిని అంచనా వేసేందుకు అధ్యయనం చేపట్టారు. అతడితో పనిచేస్తున్న సహోద్యోగులు, పైఅధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కేవలం ఏమరుపాటుగానే సిగ్నల్‌ను గమనించకుండా ముందుకు వెళ్లి ఉంటే ఆ ఏమరుపాటుకు దారితీసిన అంశాలేంటీ అనే దానిపైనా దృష్టి సారించారు. గురువారం కూడా విచారణ కొనసాగనున్న దృష్ట్యా లోకో పైలట్‌కు సన్నిహితులైన వ్యక్తుల నుంచి అదనపు సమాచారం సేకరించాలని భావిస్తున్నారు. విషమంగానే లోకోపైలట్ పరిస్థితి లోకోపైలట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. నాంపల్లి కేర్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉంచి డాక్టర్లు అత్యవసర వైద్య చికిత్సలు అందిస్తున్నారు. మరో 24 గంటలు గడిస్తే తప్ప అతడి ఆరోగ్యంపై ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు. -
సొరంగ మార్గం రెడీ
► పెరిగిన ట్రయల్ రన్ వేగం ► సంక్రాంతి నాటికి సేవలు సాక్షి, చెన్నై: ఎగ్మూర్- కోయంబేడు మధ్య సొరంగ మార్గంలో మెట్రో సేవలు సంక్రాంతి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ మార్గంలో పనులు ముగిశాయి. ఇక, ట్రయిల్ రన్ వేగ వంతం చేసి, భద్రతా కమిషన్ పరిశోధనకు తగ్గ చర్యల్లో ఆ ప్రాజెక్టు వర్గాలు నిమగ్నమయ్యాయి. చెన్నైలో మెట్రో రైలు సేవలకు తగ్గ పనులు వేగంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విమానాశ్రయం- ఆలందూరు- చిన్నమలై, కోయంబేడు- ఆలందూరు- సెయింట్ థామస్ మౌంట్ మార్గాల్లో పనులు ముగిసి రైలు సేవలకు శ్రీకారం చుట్టి ఉన్నారు. ఇక, చిన్న మలై నుంచి కూత వేటు దూరం వంతెన మీద తదుపరి పూర్తి స్థాయిలో సెంట్రల్ వరకు సొరంగ మార్గంలో రైలు పయనించేందుకు తగ్గ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వాషర్ మెన్ పేట నుంచి సెంట్రల్, ఎగ్మూర్‌ల మీదుగా కోయంబేడుకు సొరంగం మార్గం పనులు రెట్టింపు వేగంతో జరుగుతున్నాయి. ఎగ్మూర్ నుంచి నెహ్రూపార్క్, సొరంగ మార్గం రెడీ కీల్పాకం, పచ్చయప్ప కళాశాల, షెనాయ్ నగర్, అన్నానగర్, తిరుమంగళం మీదుగా కోయంబేడు వరకు ప్రస్తుతం సొరంగం మార్గం పనులు పూర్తి అయ్యాయి. ఎగ్మూర్ నుంచి సెంట్రల్-వాషర్మన్ పేట వైపుగా ట్రాక్ ఏర్పాటు పనులు సాగాల్సి ఉంది. ఎగ్మూర్ నుంచి కోయంబేడు వరకు పనులు ముగియడంతో ఇక, సొరంగ మార్గం రైల్వేస్టేషన్లకు సొబగులు దిద్దేందుకు తగ్గ కార్యచరణతో మెట్రో ప్రాజెక్టు వర్గాలు ముందుకు సాగే పనిలో పడ్డాయి.ట్రాక్, విద్యుద్దీకరణ పనులు ముగియడంతో ఇక, ట్రయిల్ రన్ వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టారు. ఈ రన్ పూర్తి స్థాయిలో విజయవంతం కాగానే, రైల్వే భద్రతా కమిషన్ వర్గాలు పరిశీలన, పరిశోధనానంతరం ప్రయాణికుల సేవకు శ్రీకారం చుట్టనున్నారు. సంక్రాంతి నాటికి ఈ ప్రక్రియను ముగించి కోయంబేడు - ఎగ్మూర్ మీదుగా సొరంగంలో ప్రయాణికులతో మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు తగ్గ కార్యచరణతో ముందుకు సాగనున్నారు. ఈ పనులు ముగిసిన పక్షంలో సెయింట్థామస్ మౌంట్, విమానాశ్రయంల నుంచి ఆలందూరు మీదుగా కోయంబేడు వైపుగా ఎగ్మూర్ వరకు ఇక పయనం సాగించేందుకు వీలుంది. నగరంలో నలభై కి.మీ దూరం మేరకు చేపట్టిన మెట్రో రైలు పనుల్లో ఇప్పటి వరకు 90 శాతం ముగిసినట్టుగా ఆ ప్రాజెక్టు వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. ఇక, వాషర్ మెన్ పేట నుంచి తిరువొత్తియూరు వరకు పనుల్ని పొడిగించిన దృష్ట్యా, పూర్తి స్థాయిలో సేవలకు మరో ఏడాది పట్టే అవకాశాలు ఉన్నాయి. -
డబుల్‌డెక్కర్ రెడీ
13 నుంచి అందుబాటులోకి.. కాచిగూడ నుంచి గుంటూరుకు బైవీక్లీ సర్వీసులు రెండంతస్తుల రైలు పట్టాలపెకైక్కనుంది. ఒకప్పటి డబుల్ డెక్కర్ బస్సును గుర్తుకు తెచ్చే ఈ ట్రైన్ కాచిగూడ నుంచి వారానికి రెండుసార్లు గుంటూరు, తిరుపతి పట్టణాలకు పరుగులు తీయనుంది. రైల్వే భద్రతా కమిషన్ అనుమతితో కూత పెట్టేందుకు సిద్ధమైన ఈ ట్రైన్.. తొలిసర్వీసు 13వ తేదీన కాచి గూడ నుంచి గుంటూరుకు, 14వ తేదీన కాచి గూడ నుంచి తిరుపతికి బయలు దేరనుంది. - సాక్షి, నల్లగొండ రెండు మార్గాల్లో ప్రయాణికులకు ఊరట.. నల్లగొండ నుంచి ప్రతిరోజూ పలుఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. తిరుపతి, గుంటూరు పట్టణాలకు మాత్రం రద్దీ ఉంటుంది. ప్రతిరోజు చాలా మంది భక్తులు తిరుపతి పుణ్యక్షేత్రానికి బయలుదేరుతారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వయా నల్లగొండ ద్వారా డెల్టా ఫాస్ట్ ప్యాసింజర్, నర్సాపూర్, చెన్నై సూపర్‌ఫాస్ట్, నారాయణాద్రి, విశాక, పుష్పుల్, ఫలక్‌నుమా, ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్, పల్నాడు, శబరి, భావనగర్, రేపల్లె, జన్మభూమి, భువనేశ్వర్ రైళ్లు గుంటూరు, తిరుపతికి రాకపోకలు సాగిస్తున్నాయి. ఇన్ని అందుబాటులో ఉన్నప్పటికీ వేలాదిమంది ప్రయాణికులకు నిరీక్షణ తప్పడం లేదు. డబుల్‌డెక్కర్ వల్ల ఈ రెండు మార్గాల్లోను ప్రయాణికులకు ఎంతో ఊరట లభించనుంది. పైగా ఈ సర్వీసులు పూర్తిగా పగటిపూట మాత్రమే నడుస్తాయి. ఉదయం బయలుదేరి సాయంత్రం తిరుపతికి చేరుకొనే విధంగా, మధ్యాహ్నం గుంటూరుకు చేరుకొనే విధంగా అందుబాటులో ఉంటాయి. ప్రత్యేకతలివీ.. - ఈ ట్రైన్ లోయర్ డెక్‌లో 48 సీట్లు, అప్పర్ డెక్‌లో 50 సీట్లు ఉంటాయి. మిడిల్ డెక్‌లో 22 సీట్లు ఉంటాయి. - ఒక బోగీలో 120 సీట్ల చొప్పున మొత్తం 14 బోగీలలో 1680 సీట్లు ఉంటాయి. - కాచిగూడ నుంచి తిరుపతికి 10 గంటల్లో, గుంటూరుకు 5 గంటల్లో చేరుకుంటుంది. - డబుల్ డెక్కర్ ట్రైన్ చార్జీలు : నగరం నుంచి గుంటూరుకు రూ. 415,కర్నూలుకు రూ. 335, తిరుపతికి రూ. 720