వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని కాచిగూడ–కాకినాడ (07425/07426) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని కాచిగూడ–కాకినాడ (07425/07426) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 2, 9, 16, 23 తేదీల్లో సాయంత్రం 6.45కు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం లో జూన్ 3, 10, 17, 24 తేదీల్లో సాయంత్రం 5.50కి కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.10కి కాచిగూడ చేరుకుంటుంది.