రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది.
రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గౌలిగూడ చమన్ ప్రాంతానికి చెందిన ప్రేమ్‌నాథ్ కుమారుడు జయరామ్ (35) కాచిగూడ - మలక్‌పేట రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు.