విహారయాత్ర అంటే పిల్లలకు పెద్ద సరదా. మూడేళ్లు నిండిన పిల్లలను టూర్‌లకు ధైర్యంగా తీసుకెళ్లవచ్చు. అయితే పిల్లలతో ఒక రోజు ప్రయాణానికే ఓ పెద్ద సూట్ కేసు తయారవుతుంది. అలాంటిది టూర్‌కి వెళ్లేటప్పుడు మరికొంత జాగ్రత్తగా చెక్ లిస్ట్ పెట్టుకుని మరీ ప్యాకింగ్ మొదలు పెట్టాలి. టూర్‌లో జలుబు, వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి ఇబ్బందులు ఎదురైతే వెంటనే వేయడానికి డాక్టర్ సూచించిన మందులు దగ్గర ఉండాలి. రెగ్యులర్‌గా చూపించుకునే డాక్టర్‌ని కలిసి టూర్ కోసం ప్రిస్కిప్షన్ రాయించుకుని మందులు తీసుకోవాలి. టూర్ ఎన్ని రోజులనే దానిని బట్టి ఆహారం సిద్ధం చేసుకోవాలి.
పాలపొడి లేదా మిల్క్ టెట్రా ప్యాక్‌లు తీసుకెళ్లాలి. టెట్రా ప్యాక్ అయితే పాలను మరిగించాల్సిన అవసరం కూడా ఉండదు. నూడుల్స్, ఫూడుల్స్ ఇన్‌స్టంట్ ప్యాకెట్‌లు దగ్గర ఉంటే... ప్యాకింగ్ టిన్‌లోనే మరిగే నీటిని పోస్తే నూడుల్స్, ఫూడుల్స్ రెడీ పిల్లలతోపాటు వాళ్లకు ఇష్టమైన ఒక్క బొమ్మనయినా టూర్‌కు తీసుకెళ్లాల్సిందే. టూరిస్ట్ ప్రదేశం నచ్చకపోతే విసిగించేస్తారు. అప్పుడే వాళ్లకు ఇంటి దగ్గర ఉన్న స్నేహితులు, అమ్మమ్మ, నానమ్మలు, తాతయ్యలు గుర్తుకు వస్తారు. వాళ్ల దగ్గరకు ‘వెళ్లిపోదాం’ అంటూ మారాం చేస్తారు. బొమ్మ ఉంటే ఆ బొమ్మతో ఆడుకుంటూ ఉల్లాసంగా గడుపుతారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment