ముక్త్యాల(జగ్గయ్యపేట) : కృష్ణానదిలో కొద్దిసేపు పడవ ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కృష్ణానది అవతల ఒడ్డు గుంటూరు జిల్లా మాదిపాడు వరకు బల్లకట్టు ప్రయాణం సాగిస్తుంటారు. ఉదయం 6 గంటల సమయంలో ముక్త్యాల ఒడ్డు నుంచి వంద మంది ప్రయాణికులతో మర పడవ అవతల ఒడ్డుకు బయలు దేరింది.
నది మధ్యలోకి వెళ్లే సరికి ఇంజిన్ సాంకేతిక లోపంతో ఒక్కసారిగా పడవ ఆగిపోయింది. రెండు కిలోమీటర్ల వరకు దిగువ ప్రాంతానికి కొట్టుకుపోయింది. ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు పడవ ఆపరేటర్లు ఇంజిన్‌ను బాగు చేసి ఒడ్డుకు తీసుకువచ్చారు. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో పడవ మరమ్మతుకు గురైందని ప్రయాణికులు అంటున్నారు.
2 గంటలు.. లబ్‌డబ్
Published Sat, Apr 25 2015 2:33 AM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM
Advertisement
Advertisement