ఇక సెల్ ఫోన్‌తో రైలు టికెట్ బుకింగ్ | The train ticket booking with cell phone | Sakshi
Sakshi News home page

ఇక సెల్ ఫోన్‌తో రైలు టికెట్ బుకింగ్

Published Sun, Jul 5 2015 3:18 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM

ఇక సెల్ ఫోన్‌తో రైలు టికెట్ బుకింగ్

ఇక సెల్ ఫోన్‌తో రైలు టికెట్ బుకింగ్

♦ ఈ నెల 8 నుంచి ప్రవేశపెట్టనున్న వెస్ట్రన్ రైల్వే
♦  ైరె ల్వే మంత్రి చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు
 
 సాక్షి, ముంబై : నగరవాసులకు సెల్‌ఫోన్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని వెస్ట్రన్ రైల్వే కల్పిస్తోంది. ఈ నెల 8వ తేదీ నుంచి మొబైల్‌కు సంబంధించిన టికెటింగ్ విధానాన్ని రైల్వే ప్రవేశపెట్టనుంది. వెస్ట్రన్ రైల్వే ప్రయాణికులు మొబైల్ యాప్ ద్వారా అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్ (యూటీఎస్)ను ఉపయోగించి టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ విధానంలో ఏటీవీఎంలో టికెట్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. కాగా కొత్త విధానంలో ప్రయాణికులు రైల్వేవాలెట్ (ఆర్-వాలెట్) ద్వారా టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఆర్-వాలెట్‌లో ప్రయాణికులు వంద నుంచి రూ.5,000 వరకు బ్యాలెన్స్ రిచార్జ్ చేయించుకోవచ్చు. జూలై 8వ తేదీన పేపర్‌లెస్ మొబైల్ టికెటింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైల్వే మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని రైల్వే అధికారి ఒకరు పేర్కొన్నారు.

 సమయం వ ృథా అవదు..
 ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా టికెట్ కౌంటర్ల వద్ద కొంత మేర క్యూ తగ్గుతుందని, ప్రయాణికుల సమయం వృథా కాదని అధికారులు అంటున్నారు. మొదటిసారిగా సెల్‌ఫోన్‌లో యాప్ అందుబాటులోకి వచ్చిందని, ఆండ్రాయిడ్, విండోస్ ప్లాట్‌ఫాంలలో నడుస్తోందని, త్వరలో ఇతర ప్లాట్‌ఫాంలకు విస్తరించనున్నామని తెలిపారు. యూటీఎస్ మొబైల్ టికెటింగ్ విధానిన్ని ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. టికెట్ బుక్ చేసుకోవాలంటే మొబైల్ ఫోన్లలో జీపీఆర్‌ఎస్ విధానం ఉండాలన్నారు.  ఇదిలా వుండగా స్మార్ట్ కార్డ్ ద్వారా ప్రయాణికులు టికెట్ బుక్ చేసిన తర్వాత టికెట్ ప్రింట్ కోసం ఇబ్బంది పడాల్సివస్తోందని, దీంతో సమయం వృథా అవుతోందని ఓ ప్రయాణికుడు వాపోయాడు.  కాగా, రోజుకు ఒక లక్ష మంది స్మార్ట్ కార్డును ఉపయోగించి టికెట్‌ను బుక్ చేసుకుంటున్నారని వెస్ట్రన్ రైల్వే అధికారి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement