సాక్షి, విజయవాడ: అత్యాచారానికి గురైన మతిస్థిమితంలేని బాధితురాలిని భయాందోళనలకు గురిచేసేలా.. ఘటన వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను అగౌరవపరిచేలా దౌర్జన్యం చేసిన మీ తీరు కు సమన్లు ఇవ్వకుండా చప్పట్లు కొట్టాలా?.. అం టూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. విజయవాడ ఆర్ అండ్‌బీ భవనంలోని మీడియా పాయింట్‌లో ఆమె శనివారం మాట్లాడారు. విజయవాడ ప్రభుత్వాçస్పత్రిలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, ఆ పార్టీ నేతలు శుక్రవారం వ్యవహరిం చిన తీరు దారుణమన్నారు. ఇంకా ఏమన్నారంటే.. యుద్ధానికి వెళ్తున్నట్లు కౌరవమూక మాదిరిగా జనాన్ని వేసుకొచ్చి అలజడి సృష్టిస్తే అది పరామర్శ అవుతుందా? బాధితురాలితో ఎలా వ్యవహరించా లో చంద్రబాబుకు తెలీదని నిన్న అర్థమైంది. మన సు, శరీరం గాయమైన బాధిత యువతితో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి. అక్కడ బల ప్రదర్శన చేయటమేమిటి?
అవును.. కమిషన్ సుప్రీమే..
మహిళా కమిషన్ ఏమైనా సుప్రీమా? అని బొండా ఉమా ప్రశ్నించడంపై వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పందించారు. ‘అవును బొండా ఉమా లాంటి ఆకురౌడీలకు మహిళా కమిషన్ సుప్రీమే. చంద్రబాబు హ యాంలో మహిళా కమిషన్ అంటే తూతూమంత్రంగా, కంటితుడుపుగా నడిపి ఉండొచ్చేమో.. కా నీ, మహిళా కమిషన్‌కు ఉండే హక్కులు, కమిషన్ శక్తి ఏమిటో అర్థమైన తర్వాత వారికి దిమ్మతిరిగి బొమ్మ కనబడుతోంది. నేను ఇప్పుడు కోట్లాది మం ది మహిళలకు బాధ్యురాలిని. చంద్రబాబు, ఉమా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే కమిషన్ తలవంచుకోదు. ఈ నెల 27న వారిద్దరూ కమిషన్ ఎదుట హాజరుకావాల్సిందే. చేసిన తప్పుకు క్షమాపణలు అడగాల్సిందిపోయి ఎదురుదాడి చేస్తున్నారు’.
లోకేశ్.. మీ నాన్నను అడుగు
‘బాధిత మహిళలపట్ల ఎలా వ్యవహరించారో మీ నాన్నను అడుగు లోకేశ్.. రిషితేశ్వరి కేసులో ఆర్నెళ్లు ఏం చేశారని.. వనజాక్షి కేసులో ఏం చేయలేకపోయారెందుకని కూడా లోకేశ్ తన తండ్రిని అడగాలి. బాధితులపట్ల, మహిళా కమిషన్ పట్ల రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరించాలో తెలియజెప్పేందుకే విచారణకు రావాలని చంద్రబాబుకు, ఉమాకు సమన్లు ఇచ్చాం’.. అని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు.
సమన్లు అందజేత
మరోవైపు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు శనివా రం మహిళా కమిషన్ సమన్లు అందజేసింది. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి కమిషన్ సిబ్బంది వెళ్లి వాటిని అందజేశారు. అదేవిధంగా విజయవాడలోని బొండా ఉమా ఇంటికి వెళ్లి అందజేశారు. 22వ తేదీ శుక్రవారం ప్రభుత్వాసుపత్రిలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మను బాధితురాలి తో మాట్లాడనివ్వకపోగా.. ఆమెను బెదిరించేలా వ్యవహరించడంపై ఏపీ మహిళా కమిషన్ యాక్ట్–1998లోని సెక్షన్ 15(1) ప్రకారం ఈ నోటీసులు అందచేస్తున్నామని ఆ సమన్లలో పేర్కొన్నారు.
పోలీసు కమిషనర్‌తో భేటీ
విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాతో వాసిరెడ్డి పద్మ ఆయన కార్యాలయంలో శనివారం భేటీ అయ్యారు. కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు. అంతకుముందు.. ప్రభుత్వాసుపత్రిలో బా«ధిత యువతిని పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.
ఆస్పత్రి నుంచి బాధితురాలి డిశ్చార్జి
ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని శనివారం డిశ్చార్జి చేశారు. ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో ఏఆర్‌ఎంఓ డాక్టర్ శిరీష ఆమెను తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో ఇంటికి పంపారు.
ఆమెపై మేమూ ఫిర్యాదు చేస్తాం : బొండా
‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నా వెంట్రుక కూడా పీకలేదు’ అంటూ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా వ్యాఖ్యానించారు. మొగల్రాజపురంలోని తన నివాసంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుకు, తనకు సమన్లు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇలాంటి నోటీసులకు తాము భయపడబోమని, వాసిరెడ్డి పద్మపై తాము కూడా జాతీయ మహిళా కమిషన్‌కు, హైకోర్టుకు, చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తామన్నారు.
చదవండి: (విశాఖలో జాబ్‌మేళాను ప్రారంభించిన ఎంపీ విజయసాయిరెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment