
సాక్షి, అమరావతి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ రాజకీయ నాయకుడి వేషంలో ఉన్న కాలకేయుడని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ధ్వజ మెత్తారు. అటువంటి కాలకేయులకు చంద్రబాబు నాయకుడని మండిపడ్డారు. విచారణకు రావాలని మహిళా కమిషన్ ఇచ్చిన సమన్లపై బొండా ఉమ ఇష్టానుసారం మా ట్లాడటంపై వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పం దించారు. కమిషన్ సభ్యులు జి.వెంకటలక్ష్మి, బూసి వినిత, షేక్ రుఖియాబేగంతో కలిసి సోమవారం విజయవాడలో ఆమె మాట్లాడారు.
అత్యాచార ఘటనపై టీడీపీ చిల్లర రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కమిషన్‌కు వివరణ ఇచ్చే ధైర్యం చం ద్రబాబు, ఉమకు లేదని దీన్నిబట్టి అర్థమవుతోందన్నారు. ఈ నెల 27న చంద్రబాబు, ఉమ వచ్చి కమిషన్‌కు వివరణ ఇవ్వాల్సిందేనని.. లేకుంటే తమ పద్ధతులు తమకుంటాయని హెచ్చరించారు. చైర్‌పర్సన్‌గా తన పదవి పోయే వరకు పోరాడతానని చెబుతున్న చిల్లర రౌడీ ఉమకు చంద్రబాబు చీరకట్టి పంపాడా అని ప్రశ్నించారు. మహిళల పట్ల ఇష్టానుసారం మాట్లాడితే ఉమ చెప్పు దెబ్బలు తినడం ఖాయమన్నారు.