women commission
-
కాలకేయులకు నాయకుడు చంద్రబాబు
సాక్షి, అమరావతి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ రాజకీయ నాయకుడి వేషంలో ఉన్న కాలకేయుడని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ధ్వజ మెత్తారు. అటువంటి కాలకేయులకు చంద్రబాబు నాయకుడని మండిపడ్డారు. విచారణకు రావాలని మహిళా కమిషన్ ఇచ్చిన సమన్లపై బొండా ఉమ ఇష్టానుసారం మా ట్లాడటంపై వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పం దించారు. కమిషన్ సభ్యులు జి.వెంకటలక్ష్మి, బూసి వినిత, షేక్ రుఖియాబేగంతో కలిసి సోమవారం విజయవాడలో ఆమె మాట్లాడారు. అత్యాచార ఘటనపై టీడీపీ చిల్లర రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కమిషన్‌కు వివరణ ఇచ్చే ధైర్యం చం ద్రబాబు, ఉమకు లేదని దీన్నిబట్టి అర్థమవుతోందన్నారు. ఈ నెల 27న చంద్రబాబు, ఉమ వచ్చి కమిషన్‌కు వివరణ ఇవ్వాల్సిందేనని.. లేకుంటే తమ పద్ధతులు తమకుంటాయని హెచ్చరించారు. చైర్‌పర్సన్‌గా తన పదవి పోయే వరకు పోరాడతానని చెబుతున్న చిల్లర రౌడీ ఉమకు చంద్రబాబు చీరకట్టి పంపాడా అని ప్రశ్నించారు. మహిళల పట్ల ఇష్టానుసారం మాట్లాడితే ఉమ చెప్పు దెబ్బలు తినడం ఖాయమన్నారు. -
‘అన్ని రాష్ట్రాల్లో ఈ చట్టం అమల్లోకి రావాలి’
సాక్షి, ఢిల్లీ : మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను నివారించడానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన దిశ చట్టం అమల్లోకి రావాల్సిన అవసరం ఉందని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన జాతీయ మహిళ కమిషన్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిశ ఘటనలో తెలంగాణ పోలీసుల చర్యను అభినందించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహిళల విషయంలో దేశంలో చట్టాలను కఠినంగా రూపొందించాలని కోరారు. రాజకీయ నేతలు, పార్టీల కోసం అర్ధరాత్రి కూడా తెరుచుకునే సుప్రీంకోర్టు తలుపులు, మహిళలపై జరిగిన దారుణాలపై ఎందుకు తెరుచుకోవడం లేదని అందరూ ప్రశ్నిస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా హోం మంత్రులు, డీజీపీల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు మహిళల భద్రతపై ఎందుకు సమావేశాలు పెట్టరని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యాచారాలు, హత్యలపై దేశవ్యాప్తంగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏపీలోని ప్రతీ జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టిన విషయాన్ని సమావేశంలో ప్రస్తావించారు. మరోవైపు మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రస్తుతం ఉన్న చట్టాల అమలుపై జనవరిలో విజయవాడలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను, అన్ని రాష్ట్రాల మహిళా చైర్పర్సన్లను ఆహ్వానించామని తెలిపారు. -
మగాళ్లు సీతాకోక చిలుకలు.. !
చిత్తూరు : ‘మగాళ్లు సీతాకోక చిలుకల్లాంటి వారు. ఆడపిల్లలు పూబంతులు. వీరిని ఆకట్టుకోవడానికి సీతాకోక చిలుకలు రంగు రంగుల ఆకర్షణలతో రకాల వేషాలు వేస్తుంటారు. అలాంటి వారి ఆకర్షణకు మహిళలు లోనుకావద్దు. మాన, ప్రాణ, ఆత్మరక్షణ కోసం అవసరమైతే అంతం చేస్తాం.. అని ఎదురుతిరగాలి. అలాగని మగాళ్లందరూ చెడ్డవారు కాదు.’ అని రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి అన్నారు. పిల్లలు, యువతను పెడదోవ పట్టిస్తున్న అశ్లీల వెబ్సైట్లు, యూ ట్యూబ్‌ల్లోని వీడియోలను కేంద్రం తొలగించాలన్నారు. తమ డిమాండ్‌ను కేంద్రానికి రాతపూర్వకంగా అందిస్తామన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన భార్గవి, తిరుమల, నాగరత్న, నిర్మల అనే నలుగురు మహిళా కానిస్టేబుళ్లు గత 45 రోజులుగా 1200 కిలో మీటర్ల పాటు సైకిల్‌పై తిరుగుతూ మహిళల్లో ఆత్మస్థైర్యం నింపే కార్యక్రమాన్ని చేపట్టారు. చిత్తూరులో గురువారం జరిగిన ఈ ముగింపు కార్యక్రమానికి నన్నపనేని రాజకుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫేస్బుక్, యూ ట్యూబ్, వాట్సప్లను అవసరాలకు కాకుండా అనవసర విషయాలకు నేటి యువత ఎక్కువగా వినియోగిస్తోందన్నారు. దీనికి తోడు టీవీల్లో వచ్చే కొన్ని సీరియల్స్ మహిళల్ని చులకనగా చూపించడం, నేర ప్రవృత్తిని రెచ్చగొట్టేలా ఉండటం, అసభ్యంగా చూపడం వల్ల సమాజంలో మహిళల పట్ల ఎక్కువగా వేధింపులు, దాడులు జరుగుతున్నాయన్నారు. ఆడ పిల్లలు తల్లితండ్రుల కంటే ఎక్కువ సమయం ఉపాధ్యాయుల వద్దే ఉంటున్నారని, వారిని చదువులకే పరిమితం చేయకుండా సమాజం ఎలా పోతోంది, సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలనే విషయాలను సైతం నేర్పించాల్సిన బాధ్యత టీచర్లు, అధ్యాపకులపై ఉందన్నారు. -
సామాజిక మార్పుతోనే బాలికా సంరక్షణ
– ఆడపిల్లలను పుడితేనే వదిలేస్తుండటం దారుణం – వివక్షతను అరికట్టడంలో మీడియా పాత్ర అభినందనీయం – రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి కర్నూలు (అగ్రికల్చర్): సామాజిక మార్పుతోనే బాలికా సంరక్షణ సాధ్యమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. గురువారం కర్నూలులోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, లైంగిక వేధింపులను మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంటుందన్నారు. వీటిపై ఎప్పటికపుడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత డీఎస్పీలతో మాట్లాడుతూ తగిన చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. అనాథలుగా మారుతున్న బాలికల విషయంలో పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా పోషిస్తున్న పాత్ర అభినందనీయమన్నారు. . ఆడపిల్ల పుట్టిందని వదిలేసి వెళ్లిపోతున్న సంఘటనలు ఎక్కువ అవుతున్నాయని, ఇలాంటివి గుంటూరులో మరీ ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి వలసలు ఎక్కువగా ఉంటున్నాయని, పిల్లలను కూడా వెంట తీసుకెళ్తున్నాని ఇందువల్ల వారు బాలకార్మికులుగా మారుతున్నారని తెలిపారు. దీనిపై జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా ఆరు నెలల కిత్రం బాధ్యతలు చేపట్టానని ఈ వ్యవధిలోని మహిళా కమిషన్‌కు 470 ఫిర్యాదులు వచ్చాయన్నారు. జిల్లా ఎస్పీ ఆకె రవికష్ణ మాట్లాడుతూ చిన్న పిల్లలను వదిలేస్తున్న సంఘటనులు ఎక్కువగా జరుగుతుండటంతో జిల్లా పోలీసు అధికారులను అలర్ట్ చేసినట్లు తెలిపారు. మహిళల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ఆర్ డీడీ శారద, జిల్లా బాలనేరస్తుల పర్యవేక్షణ అధికారి రామసుబ్బారెడ్డి, మహిళా కమిషన్ డైరెక్టర్ సామేజ్ తదితరులు పాల్గొన్నారు. ఐసీడీఎస్ కార్యక్రమాలపై సమీక్ష: మధ్యాహ్నం ఐసీడీఎస్ కార్యక్రమాల అమలుపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గహ హింస చట్టం, వన్ స్టాప్ సెంటర్ల ఏర్పాటు, ఇంటిగ్రేటెడ్ స్కీమ్, చిల్డ్రన్స్ హోమ్‌ల నిర్వహణ, శిశుగహలోని చిన్నారుల సంక్షేమం తదితర కార్యక్రమాలను సమీక్షించారు. చిల్డ్రన్ హోమ్‌లు, శిశుగహలను మరింత బలోపేతం చేయాలన్నాలని చైర్ పర్సన్ అన్నారు. కార్యక్రమంలో జేసీ–2 రామస్వామి, సీడీపీఓలు, స్వయంసహాక సంఘాల మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. బుగ్గతండా బాలికలకు పరామర్శా: పత్తికొండ మండలం బుగ్గతండాకు చెందిన బనావత్ రమణమ్మ కామెర్లతో మతి చెందడం, తండ్రి రాంబాబు నాయక్ తాగుడుకు బానిస కావడంతో వారి సంతానమైన మల్లిక, శశిరేఖ, ఇందు, లోకేశ్వరీ, సింధులు దిక్కులేని వారుగా మిగిలారు. వీరి దుస్థితిపై పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలు రావడంతో దాతలు స్పందించి చిన్నారి బాలికలకు చేయాత నిచ్చారు. జిల్లా యంత్రాంగం స్పందించి సింధూ మినహా నలుగురిని కస్తూరిబా పాఠశాలలో చేర్పించింది. కర్నూలుకు వచ్చిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఐదుగురు చిన్నారులను పరామర్శించారు. వారికి దుస్తులు అందచేశారు. అనాథలుగా మిగిలిన చిన్నారులను చేసి ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ప్రకాశం జిల్లా మార్టూరులోని శారదనికేతన్ విద్యాసంస్థ ఐదుగురు ఆడపిల్లలను ఇంటర్ వరకు చదివించేందుకు, సెలవుల్లో సంరక్షించేందుకు ముందుకు వచ్చినట్లు ఆమె తెలిపారు. ఐదుగురు చిన్నారులను పెద్దపాడు శిశుగహానికి తరలించేందుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చిందన్నారు. పిల్లలను ఇతర జిల్లాలకు పంపవద్దని చిన్నారుల మేనమామ, చిన్నాయన కోరడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనాథలుగా ఉన్నపుడు లేని ప్రేమ ఇపుడు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. పిల్లల భవిష్యత్తును మేము చూసుకుంటామని తెలిపారు.