సాక్షి, విజయవాడ: విజయవాడ అత్యాచార బాధితురాలి అంశంలో టీడీపీ రాజకీయాలు చేస్తోందని మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ మేరకు మహిళా కమిషన్ విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, సభ్యురాలు జి లక్ష్మి మాట్లాడుతూ.. టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాసుపత్రిలో టీడీపీ నేతలు వ్యవహరించిన తీరు దురదృష్టకరమన్నారు. ఓ ఆడపిల్లను అడ్డం పెట్టుకుని టీడీపీ నీచ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. బోండా ఉమ రాజకీయ నాయకుడి వేషంలో ఉన్న కాలకేయుడని, అతనికి మహిళలే బుద్ధి చెబుతారని విమర్శించారు.
‘ఈ కాలకేయ ముఠాకు నాయకుడు చంద్రబాబు. బోండా ఉమ వల్ల చంద్రబాబుకు చెడ్డ పేరొచ్చిందని టీడీపీ వాళ్లే తిడుతున్నారు. టీడీపీ వాళ్లే తిడుతుండటంతో బోండా ఫ్రస్టేషన్‌లో ఉన్నాడు. బోండా ఆకు రౌడీ అనుకున్నా.. కానీ మరీ చిల్లర రౌడీలా వ్యవహరిస్తున్నాడు. ఏప్రిల్ 27న కమిషన్ ముందుకు రావడానికి చంద్రబాబు, బోండా ఉమాకు భయమేంటి. కమిషన్ ముందు హాజరయ్యే ధైర్యం మీకు లేదా.. మహిళా కమిషన్ పదవి ఊడే వరకూ పోరాడతానని బోండా చెబుతున్నాడు. నేను మహిళా కమిషన్ ఛైర్మన్‌గా దిగిపోవడం బోండా ఉమ ఆశయమా. నా పదవి పోయే వరకూ పోరాడమని చంద్రబాబు బోండాకు చీర కట్టి పంపించాడు. బోండా ఉమ తన పేరును సార్ధకం చేసుకుంటున్నాడు.
చదవండి: సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం సమావేశం
ఉత్తమ తెలుగుదేశం పార్టీ నారీ బోండా ఉమ. బోండా ఉమ మహిళల పట్ల సోయిలేకుండా మాట్లాడుతున్నాడు. విజయవాడలో టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులకు విద్యార్ధి బలైపోతే ఒక్క టీడీపీ నేత వచ్చాడా. వినోద్ జైన్ కేసులో మూడు నెలలైనా స్పందించని దిక్కుమాలిన పార్టీ మీది. ఇష్టానుసారంగా మహిళల పట్ల మాట్లాడితే మహిళలే బుద్ధి చెప్పడం ఖాయం’ అని మహిళా కమిషన్ సభ్యురాలు జి లక్ష్మి హెచ్చరించారు
Comments
Please login to add a commentAdd a comment