women commision
-
కేటీఆర్ కామెంట్స్‌పై మహిళా కమిషన్ సీరియస్
హైదరాబాద్, సాక్షి: ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళల గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. సుమోటోగా కేసు నమోదు చేసిన కమిషన్.. త్వరలో కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.మరోవైపు.. తెలంగాణ మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.. బేషరతుగా మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్స్‌లు చేసుకోవచ్చంటూ కేటీఆర్ అత్యంత హీనంగా మాట్లాడారని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు తన తండ్రి నేర్పించిన సంస్కారం ఇదేనా? అని సీతక్క ప్రశ్నించారు. మహిళలపై కేటీఆర్‌కు గౌరవం లేదన్నది ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమైందని చెప్పారు. అదే సమయంలో.. రవాణా మంత్రి పొన్నం సైతం కేటీఆర్‌పై రాష్ట, జాతీయ మహిళా కమిషన్లు కేసు నమోదు చేయాలంటూ కోరారు. -
పవన్ కళ్యాణ్ కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు
-
వాలంటీర్లపై పవన్ అనుచిత వ్యాఖ్యలు.. మహిళా కమిషన్ నోటీసులు
సాక్షి, అమరావతి: వాలంటీర్ల పట్ల పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు పవన్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. దీనిపై 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పవన్ వ్యాఖ్యలు ఒంటరి మహిళల గౌరవానికి భంగం కలించేలా ఉన్నాయని పేర్కొన్న కమిషన్.. తాను చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఇవ్వాలని తెలిపింది. కాగా మహిళలను ఉద్ధేశించి చేసిన పవన్ వ్యాఖ్యలపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఈమెయిల్స్ ద్వారా మహిళా సంఘాలు, వాలంటీర్లు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో పవన్‌కు నోటీసులు జారీ చేస్తున్నట్లు వాసిరెడ్డి పద్మ తెలిపారు. వాలంటీర్లపై పవన్ విషం కక్కుతున్నారని, ఆయనకు ఏ ఇంటెలిజెన్స్ అధికార చెప్పారో సమాధానం చెప్పాలని అన్నారు. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి పవన్ తప్పించుకోలేరని విమర్శించారు. వాలంటీర్లకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు. పవన్ చెప్తున్న 30 వేల మిస్సింగ్ కేసులకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. యువత చెడిపోవడానికి పవన్ సినిమాలే కారణమని దుయ్యబట్టారు. చదవండి: పవన్ వ్యాఖ్యలపై వాలంటీర్ల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ మరోవైపు పవన్ అనుచిత వ్యాఖ్యలపై వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలు చేస్తున్న తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. పవన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు. తమకు తక్షణమే పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: పవన్ ఎందుకు ఎమ్మెల్యే కాలేకపోయాడు?: మంత్రి అమర్నాథ్ -
మైనర్ బాలిక సూసైడ్ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్
-
Women Commission: మహిళల కోసం ‘లీగల్ సెల్’
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ప్రత్యేకంగా లీగల్ సెల్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లీగల్ సెల్‌ను సోమవారం జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి ప్రారంభించారు. మహిళలకు చట్టబద్ధమైన సహాయాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ లీగల్ సెల్‌ను ఏర్పాటు చేయడం శుభపరిణామమని రేఖా శర్మ అన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత న్యాయ సలహాలు, సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ కమిషన్ కార్యక్రమాలను, సేవలను అడిగి తెలుసుకున్నారు. మహిళలకు చట్టపరమైన సహాయం కోసం ఈ సెల్ వన్–స్టాప్ సెంటర్‌గా పనిచేస్తుందని సునీతాలక్ష్మారెడ్డి వివరించారు. అలాగే మహిళలకు సహాయంగా ఉండేందుకు ప్రారంభించిన వాట్సాప్ హెల్ప్ లైన్ 9490555533, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మహిళా కమిషన్‌కు వస్తున్న ఫిర్యాదులు గురించి తెలియజేశారు. ఇదీ చదవండి: Tamilisai Soundararajan: మహిళలకు అనుక్షణం అండగా ఉంటాం -
పనిచేసే చోట పదిలమేనా? ఆఫీసుల్లో కానరాని ఐసీసీ
బెంగళూరు: ఆమె ఓ ఆఫీసులో ఉద్యోగి. అందులో ఓ పురుష ఉద్యోగి పోకిరీ చేష్టలతో సమస్యగా ఉంటోంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే రచ్చ అవుతుంది. ఆఫీసులో పై అధికారులకు చెప్పుకుందామంటే అవకాశం ఉండదు. ఇలా.. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు, కంపెనీల్లో మహిళా ఉద్యోగులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే బాధితులు ఫిర్యాదు చేయడానికి అంతర్గత ఫిర్యాదుల సమితి (ఐసీసీ) ఉండాలి. కానీ ఈ కమిటీలు అనేక చోట్ల మనుగడలో లేవు. దీంతో మహిళలు గోడు చెప్పుకోవడానికి అవకాశం దొరకడం లేదు. రాష్ట్ర మహిళా కమిషన్ సమీక్షలో ఈ చేదునిజం వెలుగుచూసింది. రాష్ట్రంలో అన్ని ప్రైవేటు సంస్థల్లో కమిషన్ సర్వే చేయగా, 5,550 ఆఫీసులు, సంస్థల్లో ఐసీసీలు లేవని తేలింది. ఐసీసీ ఎలా ఉండాలి ప్రభుత్వ చట్టాల ప్రకారం 10 మంది కంటే ఎక్కువ మంది మహిళాసిబ్బంది పనిచేసేచోట మహిళలపై లైంగిక దాడులు, వేధింపులను నివారణకు తప్పనిసరిగా ఐసీసీ ఉండాలి. సీనియర్ ఉద్యోగులతో దీనిని ఏర్పాటు చేయాలి. కమిటీలో తప్పనిసరి మహిళా ఉద్యోగులు, ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధికి చోటివ్వాలి. కనీసం మూడు నెలలకు ఒకసారి సమావేశమై మహిళా ఉద్యోగుల సమస్యల మీద చర్చించాలి. కమిటీ లేనట్లయితే అలాంటి సంస్థపై జరిమానా విధించడం, లైసెన్సు రద్దు చేయడానికీ ఆస్కారముంది. ఆ సంస్థలకు హెచ్చరికలు ఇప్పటివరకు సుమారు 400 ప్రభుత్వ, 1300కు పైగా ప్రైవేటు సంస్థల్లో ఐసీసీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అయినప్పటికీ 5,550 ప్రైవేటు ఆఫీసుల్లో ఇంకా ఎలాంటి పురోగతి లేదని, ఆ సంస్థలకు హెచ్చరికల జారీ చేశామని మహిళాకమిషన్ అధ్యక్షురాలు ప్రమీళానాయుడు తెలిపారు. గత ఏడాదిలో పనిచేసే చోట లైంగిక వేధింపులపై 210 కేసులు నమోదు కాగా, ఇందులో బెంగళూరులోనే ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా గార్మెంట్స్ ఫ్యాక్టరీల్లో ఎక్కువగా వేధింపుల సమస్య ఉంది, ఇక్కడ మహిళల భద్రత కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆమె తెలిపారు. (చదవండి: మహిళా రచయిత్రి పై అత్యాచారం...చంపేస్తామంటూ బెదిరింపులు..) -
‘బోండా ఉమ ఆకు రౌడీ అనుకున్నా.. మరీ చిల్లర రౌడీలా..’
సాక్షి, విజయవాడ: విజయవాడ అత్యాచార బాధితురాలి అంశంలో టీడీపీ రాజకీయాలు చేస్తోందని మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ మేరకు మహిళా కమిషన్ విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, సభ్యురాలు జి లక్ష్మి మాట్లాడుతూ.. టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాసుపత్రిలో టీడీపీ నేతలు వ్యవహరించిన తీరు దురదృష్టకరమన్నారు. ఓ ఆడపిల్లను అడ్డం పెట్టుకుని టీడీపీ నీచ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. బోండా ఉమ రాజకీయ నాయకుడి వేషంలో ఉన్న కాలకేయుడని, అతనికి మహిళలే బుద్ధి చెబుతారని విమర్శించారు. ‘ఈ కాలకేయ ముఠాకు నాయకుడు చంద్రబాబు. బోండా ఉమ వల్ల చంద్రబాబుకు చెడ్డ పేరొచ్చిందని టీడీపీ వాళ్లే తిడుతున్నారు. టీడీపీ వాళ్లే తిడుతుండటంతో బోండా ఫ్రస్టేషన్లో ఉన్నాడు. బోండా ఆకు రౌడీ అనుకున్నా.. కానీ మరీ చిల్లర రౌడీలా వ్యవహరిస్తున్నాడు. ఏప్రిల్ 27న కమిషన్ ముందుకు రావడానికి చంద్రబాబు, బోండా ఉమాకు భయమేంటి. కమిషన్ ముందు హాజరయ్యే ధైర్యం మీకు లేదా.. మహిళా కమిషన్ పదవి ఊడే వరకూ పోరాడతానని బోండా చెబుతున్నాడు. నేను మహిళా కమిషన్ ఛైర్మన్‌గా దిగిపోవడం బోండా ఉమ ఆశయమా. నా పదవి పోయే వరకూ పోరాడమని చంద్రబాబు బోండాకు చీర కట్టి పంపించాడు. బోండా ఉమ తన పేరును సార్ధకం చేసుకుంటున్నాడు. చదవండి: సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం సమావేశం ఉత్తమ తెలుగుదేశం పార్టీ నారీ బోండా ఉమ. బోండా ఉమ మహిళల పట్ల సోయిలేకుండా మాట్లాడుతున్నాడు. విజయవాడలో టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులకు విద్యార్ధి బలైపోతే ఒక్క టీడీపీ నేత వచ్చాడా. వినోద్ జైన్ కేసులో మూడు నెలలైనా స్పందించని దిక్కుమాలిన పార్టీ మీది. ఇష్టానుసారంగా మహిళల పట్ల మాట్లాడితే మహిళలే బుద్ధి చెప్పడం ఖాయం’ అని మహిళా కమిషన్ సభ్యురాలు జి లక్ష్మి హెచ్చరించారు -
పెళ్లికి ఒప్పుకోని ప్లేయర్.. రూంలో వేసి లాక్!
హర్యానా: జాతీయ స్థాయి మహిళ కబడ్డీ ప్లేయర్ హర్యానా మహిళ కమిషన్‌ను కలిసింది. ఆమె రోహ్తక్ జిల్లా నుంచి ఎంపిక అయ్యింది. తన తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నారని మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ‘పెళ్లికి నేను నిరాకరించాను. అందుకే వారు నన్ను ఒక గదిలో పెట్టి బీగం వేశారు. నా చదువును, ఆటలను ఇంకా కొనసాగించాలని ఉంది’ అని ఆమె మహిళ కమిషన్ ముందు తన బాధలను తెలిపింది. -
ఎమ్మార్వోపై దాడిని సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్
హైదరాబాద్: కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి పట్ల మహిళా కమిషన్ గర్హం వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ మేరకు దాడి ఘటనపై నాలుగు వారాల్లోగా సంపూర్ణ నివేదికను అందజేయాల్సిందిగా జిల్లా ఎస్సీకి శనివారం ఆదేశాలు జారీచేసింది.